ప్రభుత్వ రంగ సంస్థ- స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్ స్టీల్ ప్లాంట్లు/ యూనిట్లు, గనుల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) 249 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ అప్లికేషన్స్ కోరుతోంది.
విభాగాలు: కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్.
అర్హత: కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్-2024 స్కోరు సాధించి ఉండాలి. వయసు 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. గేట్-2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జులై 25 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రూ.700(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200) అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాలకు www.sail.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.