Homeవార్తలు1564 ఎస్‌ఐ పోస్టులు

1564 ఎస్‌ఐ పోస్టులు

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌ అండ్ ఢిల్లీ పోలీస్ శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా మెరిట్ సాధించిన వారికి పోస్టింగ్ ఇస్తారు.

Advertisement

అర్హత: ఇండియాతో పాట నేపాల్, భూటాన్ దేశానికి చెందిన పౌరులు అర్హులు; ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి; వయసు: 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి( ఎస్సీ, ఎస్టీలకు 5ఏళ్లు, బీసీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు 3ఏళ్లు మినహాయింపు ఉంటుంది) డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.100( ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపు ఉంటుంది.

పోస్టుల వివరాలు
సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్‌– 169
సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఇన్ సీఏపీఎఫ్(కేటగిరీల వారిగా)
సీఆర్‌‌పీఎఫ్–1072
బీఎస్‌ఎఫ్–244
ఐటీబీపీ–43
సీఐఎస్‌ఎఫ్–20
ఎస్‌ఎస్‌బి–16
మొత్తం–1564
నోటిఫికేషన్
మొత్తం పోస్టులు –1564
అప్లికేషన్ లాస్ట్ డేట్‌ జులై 16
ఆఫ్‌లైన్‌లో జులై 22
పేపర్–1 పరీక్ష తేదీలు సెప్టెంబ్ 29 –ఆక్టోబర్ 10
పేపర్–2 మార్చి 01, 2021

కంప్యూటర్ బేస్‌డ్‌ ఎగ్జామ్ : క్వశ్చన్ పేపర్‌‌ మల్టీపుల్ చాయిస్‌ టైప్‌లో ఉంటుంది. ప్రతి తప్పు ఆన్సర్‌‌కు 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. పేపర్‌‌–1, పేపర్‌‌–2 రాత పరీక్షలతో పాటు ఫిజికల్ స్టాండర్డ్, ఫిజికల్ ఎండ్యురెన్స్ టెస్ట్‌, డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అన్ని ఎగ్జామ్‌లలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి.

Advertisement

పేపర్‌‌–1 లో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్‌ అండ్ రీజనింగ్, క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్ కాంప్రెహెన్సివ్ సబ్జెక్టులు ఉంటాయి. ప్రతి సబ్జెక్టుకు 50 మార్కులు ఉంటాయి. మొత్తం 2గంటల సమయం ఉంటుంది.

పేపర్‌‌–2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్‌ 200 మార్కులకు ఉంటుంది. 2గంటల సమయం ఉంటుంది. ఎన్‌సీసీ సర్టిఫికెట్‌(ఏ, బీ, సీ) ఉన్న వారికి బోనస్ మార్కులుంటాయి

ఫిజికల్ టెస్ట్..
ఫురుషులు 170సెం.మీ, మహిళలు 165 సెం.మీ ఎత్తు ఉండాలి. (రిజర్వేషన్ల ప్రకారం మినహాయింపు ఉంటుంది.) పురుషుల ఛాతీ 80 సెం.మీ. ఉండి గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ. వ్యాకోచించాలి. టెస్ట్‌లో భాగంగా పురుషులకు పదహారు సెకెండ్లలో వంద మీటర్ల మేర పరుగు, ఆరున్నర నిమిషాల్లో 1.6 కి.మీ. పరుగు, మూడు ఛాన్స్‌ల్లో 3.65 మీటర్ల మేర లాంగ్‌ జంప్‌, మూడు ఛాన్స్‌ల్లో 1.6 మీటర్ల మేర హైజంప్‌ పోటీ ఉంటుంది. మూడు ఛాన్స్‌ల్లో షాట్‌పుట్‌(16 ఎల్‌బిఎస్‌)ను 4.5 మీటర్ల మేరకు విసరాలి. మహిళలకు పద్దెనిమిది సెకెండ్లలో వంద మీటర్ల మేర పరుగు, నాలుగు నిమిషాల్లో 800 వీటర్లు పరుగు, మూడు ఛాన్స్‌ల్లో 2.7 మీటర్ల మేర లాంగ్‌ జంప్‌, మూడు ఛాన్స్‌ల్లో 0.9 మీటర్ల మేర హైజంప్‌ పోటీ ఉంటుంది

Advertisement

వేతనం: సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఇన్ సెంట్రల్ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌(సీఏపీఎఫ్) అండ్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్‌ పోస్టుకు సెలెక్టయిన వారికి రూ.35,400–1,12,400 ఉంటుంది.

Advertisement

RECENT POSTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!