రాజస్థాన్ అల్వార్ లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అండ్ మెడికల్ కళాశాల అండ్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు పోస్టు భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 115 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు. పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు అప్లయ్ చేసుకునేందుకు అర్హులు. అర్హతలున్నవారు జూన్ 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీలు 115
- ప్రొఫెసర్ 9 పోస్టులు
అర్హత- ఎన్ఎంసీ, ఎంఐసీ గైడ్ లైన్స్ ప్రకారం ఎంబీబీఎస్ పాసై ఉండాలి.
వయస్సు: 67ఏండ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5ఏండ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3ఏండ్ల వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.2,01,213.
- అసోసియేట్ ప్రొఫెసర్: 21 పోస్టులు
అర్హత: ఎన్ఎంసీ/ఎంఐసీ గైడ్‌లైన్స్ ప్రకారం ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు: 67ఏండ్ల మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5ఏండ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3ఏండ్ల వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.1,338,02.
- అసిస్టెంట్ ప్రొఫెసర్: 30 పోస్టులు
అర్హత: ఎన్ఎంసీ/ఎంఐసీ గైడ్‌లైన్స్ ప్రకారం ఎంబీబీఎస్ ఉత్తీర్ణులకు అవకాశం ఉంటుంది.
వయస్సు: 67ఏండ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5ఏండ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3ఏండ్ల వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.1,14,955.
- సీనియర్ రెసిడెంట్: 34 పోస్టులు
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 45ఏండ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5ఏండ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3ఏండ్ల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.67,700.
- సీనియర్ రెసిడెంట్ (జీడీఎంవో): 12 పోస్టులు
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 45ఏండ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5ఏండ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3ఏండ్ల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.67,700.
- సూపర్ స్పెషలిస్ట్: 09 పోస్టులు
అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 67ఏండ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5ఏండ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3ఏండ్ల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: ఫుల్‌టైమ్ ఎంట్రీ లెవెల్ రూ.2,00,000; సీనియర్ లెవెల్ రూ.2,40,000. పార్ట్‌టైమ్ ఎంట్రీ లెవెల్ రూ.1,00,000; సీనియర్ లెవెల్ రూ.1,50,000 ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.225. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 04.06.2024.