ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో భారీ రిక్రూట్మెంట్ మొదలైంది. ఏకంగా 3673 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. మొత్తం 19 నోటిఫికేషన్‌ల ద్వారా 3,673 పోస్టులను భర్తీ చేయనున్నారు.ఆఫీస్ స్టాప్ ఖాళీల భర్తీకి ఏపీ హైకోర్టు ఆన్‌లైన్లో అప్లికేషన్స్ స్వీకరిస్తోంది. ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్ విభాగాల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. ఏపీ హైకోర్టు వేర్వేరు ప్రకటనలు జారీ చేసిన నేపథ్యంలో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న నోటిఫికేషన్ ప్రకారం విడివిడిగా అప్లై చేసుకోవాలి.
పోస్టులు.. ఖాళీల వివరాలు:
- సెక్షన్ ఆఫీసర్/ కోర్ట్ ఆఫీసర్/ స్క్రూటినీ ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్ విభాగంలో 9 పోస్టులు,
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 13,
- కంప్యూటర్ ఆపరేటర్ 11,
- అసిస్టెంట్ ఎగ్జామినర్ 27,
- డ్రైవర్ 8,
- ఆఫీస్ సబార్డినేట్ 135,
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 114,
- జూనియర్ అసిస్టెంట్ 681,
- టైపిస్ట్ 170,
- ఫీల్డ్ అసిస్టెంట్158,
- ఎగ్జామినర్ 112,
- కాపిస్ట్: 209,
- రికార్డ్ అసిస్టెంట్ 9,
- డ్రైవర్(లైట్ వెహికల్) 20,
- ప్రాసెస్ సర్వర్ 439,
- ఆఫీస్ సబార్డినేట్ 1520,
- టైపిస్ట్ & కాపిస్ట్ 36 .
అర్హతలు:
పోస్టులను బట్టి ఏడో తరగతి, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు, టైప్‌రైటింగ్/ స్టెనో సర్టిఫికెట్, కంప్యూటర్ నాలెడ్జ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్:
పోస్టును బట్టి రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. హైకోర్టు ఖాళీలకు నవంబర్15, జిల్లా కోర్టులకు నవంబర్ 11 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం www.hc.ap.nic.in