యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ), ఇండియన్ నావల్ అకాడమీ కోర్సుల్లో(ఎన్ఏ) అడ్మిషన్స్‌కు అవివాహిత పురుష/ మహిళా క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ కోరుతోంది. మొత్తం 400 ఖాళీలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 7వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు: నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ): 370 (ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్ ఫోర్స్-120), నావల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్): 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హత: ఆర్మీ వింగ్ పోస్టులకి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. ఎయిర్ ఫోర్స్, నేవల్ వింగ్స్ పోస్టులకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: రాతపరీక్ష, ఎస్ఎస్‌బీ టెస్ట్/ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ క్యాండిడేట్స్‌కు ఫీజు లేదు. 2004 జనవరి 2 – నుంచి 2007 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. జూన్ 7వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ 4న పరీక్ష నిర్వహించనున్నారు. 2023 జులై నుంచి కోర్సు ప్రారంభమవుతుంది. పూర్తి వివరాల కోసం www.upsc.gov.in వెబ్సైట్ సంప్రదించాలి.