భారత ప్రభుత్వ రంగానికి చెందిన అతి పెద్ద విద్యుత్ ఉత్పాదక సంస్థ ‘ఎన్టీపీసీ లిమిటెడ్’ (NTPC)అనుభవజ్ఞులైన ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ కోసం డిప్యూటీ మేనేజర్ (E-4 గ్రేడ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రికల్, మెకానికల్, కంట్రోల్ & ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో.. మొత్తం 135 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ. 70వేల నుంచి రూ. 2 లక్షల వరకు జీతం లభిస్తుంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్ట్ 26 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీల వివరాలు:
మొత్తం 135 పోస్టుల్లో విభాగాలు, కేటగిరీల వారీగా ఖాళీలు.
ఎలక్ట్రికల్: 40 పోస్టులు (UR-15, EWS-4, OBC-10, SC-7, ST-4)
మెకానికల్: 55 పోస్టులు (UR-21, EWS-5, OBC-14, SC-8, ST-7)
సి అండ్ ఐ (C&I): 40 పోస్టులు (UR-15, EWS-4, OBC-10, SC-6, ST-5)
విద్యార్హతలు & వయోపరిమితి:
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో ఫుల్-టైమ్ బీఈ/బీటెక్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు కేవలం పాస్ మార్కులు ఉంటే సరిపోతుంది).
అనుభవం: పవర్ సెక్టార్ (కోల్, గ్యాస్, లిగ్నైట్) లో సంబంధిత విభాగంలో.. కనీసం 10 సంవత్సరాల పోస్ట్-క్వాలిఫికేషన్ ఎగ్జిక్యూటివ్ అనుభవం ఉండాలి. ప్రభుత్వ/పీఎస్‌యూ అభ్యర్థులకు E-3 గ్రేడ్ లేదా తత్సమాన స్కేలులో కనీసం 2 సంవత్సరాల అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: 26 ఆగస్టు 2026 నాటికి గరిష్టంగా 40 ఏళ్లు. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ (NCL)అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
ఫీజు: జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు రూ. 500,ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఫీజును ఆన్లైన్ లేదా ఎస్బీఐ చలాన్ ద్వారా చెల్లించవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ: ఆగస్టు 26 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: అభ్యర్థుల అప్లికేషన్లు షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష/ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ఎలా అప్లై చేయాలి:
ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు NTPC అధికారిక వెబ్సైట్ careers.ntpc.co.in ద్వారా మాత్రమే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.





