Homeవార్తలునల్సార్‌, హైదరాబాద్‌లో ఎంఏ, అడ్వాన్స్​డ్​ డిప్లొమా కోర్సులు

నల్సార్‌, హైదరాబాద్‌లో ఎంఏ, అడ్వాన్స్​డ్​ డిప్లొమా కోర్సులు

Advertisement

హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా కి చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ (డీడీఈ), సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ అండ్‌ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ (సీడీఓఈ) 2022-2023 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఎంఏ కోర్సులు: డ్యురేషన్ రెండేళ్లు ఉంటుంది. ఇందులో ఏవియేషన్ లా అండ్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ అండ్‌ డిఫెన్స్‌ లా, స్పేస్‌ అండ్ టెలీకమ్యూనికేషన్ లా, మారిటైం లా, క్రిమినల్‌ లా అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఇంటర్నేషనల్‌ ట్యాక్సేషన్‌, యానిమల్‌ ప్రొటెక్షన్ లా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

అర్హత: ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. చివరి ఏడాది గ్రాడ్యుయేషన్‌/ ఇంజినీరింగ్‌ డిగ్రీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా: డ్యురేషన్​ ఏడాది ఉంటుంది. పేటెంట్స్‌ లా, సైబర్‌ లా, మీడియా లా, ఇంటర్నేషనల్‌ హ్యూమానిటేరియన్‌ లా, ఫ్యామిలీ డిస్‌ప్యూట్‌ రెజల్యూషన్‌, మారిటైం లా, కార్పొరేట్‌ టాక్సేషన్‌, యానిమల్‌ ప్రొటెక్షన్ లా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. చివరి ఏడాది గ్రాడ్యుయేషన్‌/ ఇంజినీరింగ్‌ డిగ్రీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జులై 15వ తేదీ వరకు అప్లై చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం www.nalsar.ac.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

Advertisement

RECENT POSTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!