HomeLATESTతెలంగాణ సాంస్కృతికం – క్రీడలు – పర్యాటకం

తెలంగాణ సాంస్కృతికం – క్రీడలు – పర్యాటకం

తెలంగాణలో సాంస్కృతిక వికాసానికి, క్రీడారంగ అభివృద్ధికి, పర్యాటక రంగాభివృద్దికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. కళాకారులకు వ్యక్తిగతంగా సహాయ సహకారాలు అందచేసింది. ప్రతిభ కలిగిన కళాకారులు, క్రీడాకారులు విదేశాలకు వెళ్లే సందర్భంలో కూడా ప్రభుత్వమే ఖర్చులు భరిస్తున్నది. అంతర్జాతీయ పోటీల్లో విజేతలకు ప్రోత్సాకాలు అందజేస్తున్నది. టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జాను ప్రభుత్వ అంబాసిడర్ గా పెట్టుకుని క్రీడాకారుల పట్ల అభిమానాన్ని చాటుకున్నది.

Advertisement

ప్రపంచ తెలుగు మహాసభలు

తెలుగు భాషను తెలంగాణకు దూరంచేసే కుట్రలను తిప్పికొట్టడమే కాకుండా..అసలు తెలుగంటే తెలంగాణ దే అనే విషయాన్ని ప్రపంచానికి చాటేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ మహా సభలు నభూతో నభవిష్యత్ అన్నట్టుగా సాగాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మార్గదర్శకత్వంలో నడిచిన ఈ మహాసభల్లో ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు భాషాభిమానులు కవులు రచయితలు పాల్గొన్నారు. ఆద్యంతం మహాద్భుతంగా సాగిన ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను ప్రపంచానికి చాటినాయి. హైదరాబాద్ నగరంలో  డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు అట్టహాసంగానిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు రూ.50 కోట్లు ఖర్చు చేశారు. మహాసభల నిర్వహణకు సాహిత్య అకాడమీ నోడల్ ఏజన్సీగా పనిచేసింది. మహాసభల నిర్వహణ బాధ్యతలను తెలంగాణ సాహిత్య అకాడమీ, అందులోని ప్రధాన కమిటీతోపాటు ప్రజాప్రతినిధులు తీసుకున్నారు. మంత్రులందరూ ఏదో ఒక సదస్సులో పాల్గొన్నారు. నిర్వాహక కమిటీ, సాంస్కృతిక శాఖ, ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు శాఖ సమన్వయంతో వ్యవహరించి ఉత్సవాలను విజయవంతం చేశాయి. అయిదు రోజుల సాహిత్య యజ్ఞంతో రాజధాని పులకరించింది. కవులు, రచయితలు, సాహితీవేత్తలు, చరిత్రకారులు, కళాకారులతో ప్రాంగణాలు కళకళలాడాయి. చర్చలు, గోష్ఠులు, సమ్మేళనాలు, అవధానాలు, సమావేశాలు భాషాభిమానుల్లో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. తెలుగును కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పాయి. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను చాటుతూ నిర్వహించిన కార్యక్రమాలు కన్నుల పండువగా సాగాయి.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభాధ్యక్షతన ప్రారంభ ఉత్సవాల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పాల్గొనడంతో మహాసభలకు నిండుదనం వచ్చింది. ఈ మహాసభలకు 17 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం, 42 దేశాలు, తెలంగాణలోని 33 జిల్లాల నుంచి 8వేల మంది ప్రతినిధులు పేర్లను నమోదు చేశారు. రోజూ 20 చొప్పున జరిగిన సదస్సులకు భాషాభిమానులు వెల్లువెత్తారు. సినిమా, రాజకీయ సభలను మించిన రీతిలో సాహిత్య ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. రోజూ ఎల్బీ క్రీడా మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలకు భారీగా జనం తరలివచ్చారు.

ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఖచ్చితంగా తెలుగు సబ్జెక్ట్

Advertisement

మాతృభాష అయిన తెలుగును రక్షించుకోవడం, మన సంస్కృతిని కాపాడుకోవడం లక్ష్యంగా తెలంగాణలోని అన్ని విద్యాసంస్థల్లో తెలుగును సబ్జెక్టుగా బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2018-19 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాషను తప్పనిసరిగా ఒక సబ్జెక్టుగా బోధించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ విధానం అమలు చేయడం కోసం 2018-19 అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలోనే చట్టం తేనున్నారు. మాతృభాష బోధన అమలుకు సంబంధించిన తమిళనాడులోని విధానాన్ని అధ్యయనం చేయడానికి తెలంగాణ అధికారుల బృందం అక్కడకు వెళ్లివచ్చింది. ఆ బృందంతో సమావేశమైన ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకోగా, తేదీ. 2018 ఏప్రిల్ 2న ఉత్తర్వులు వెలువడ్డాయి.

        మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంగ్లీషు మీడియంలో చదవడం అందరికీ అనివార్యమవుతున్నది. కనుక పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని, అదే క్రమంలో తెలుగు కనుమరుగు కాకుండ, ప్రభుత్వం ఇంగ్లీషు మీడియంలో చదివే విద్యార్థులు కూడా తెలుగు భాష నేర్చుకోవాలనే నిబంధన పెట్టింది. మొదట ఇంటర్మీడియట్ వరకు తెలుగును తప్పనిసరి చేయాలని భావించారు. అయితే ఇంటర్మీడియట్ (10+2) అన్ని విద్యాసంస్థల్లో ఒకే మాదిరిగా లేదు. ఇంటర్మీడియట్ లో తెలుగును అమలు చేయడం కాస్త ఇబ్బందిగా మారుతుంది. తమిళనాడు, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో మాతృభాష బోధన అమలును పరిశీలించిన అనంతరం మొదటి దశలో పదవ తరగతి వరకు తెలంగాణలో తెలుగును తప్పనిసరిగా సబ్జెక్టుగా బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ ఆలయాల అభివృద్ధి

Advertisement

ఎన్నో పోరాటాలుచేసి సాధించుకున్న తెలంగాణలో స్వీయ ఆధ్యాత్మిక అస్తిత్వమూ అవసరమేనని భావించిన సీఎం కేసీఆర్ పుణ్యక్షేత్రాల పునురుద్ధరణకు పూనుకున్నారు.  ఈ క్రమంలో లక్ష్మీ నరసింహస్వామి కొలువైన యాదగిరి గుట్టను (యాదాద్రి) ప్రభుత్వం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చి దిద్దుతున్నది. అలాగే వేములవాడ భద్రాద్రి కొమురవెల్లి మల్లన్న కురవి వీరన్న తదితర పుణ్యక్షేత్రాలు నాగార్జునకొండ వంటి బౌద్దారామాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ కోసం ప్రభుత్వం కామన్ గుడ్ ఫండ్ కింద 2018-19 బడ్జెట్ లో రూ.50 కోట్లు కేటాయించింది. 2020-21 లో దేవాలయాల అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించారు.

సుందర పుణ్యక్షేత్రంగా యాదాద్రి

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టను ప్రభుత్వం ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నది. 2018 వరకు ప్రవేశపెట్టిన అన్ని బడ్జెట్లలో కలిపి యాదాద్రి అభివృద్ధికి రూ.600 కోట్లు కేటాయించి, రూ.500 కోట్లు విడుదల చేసింది. వైటిడిఏ ఆద్వర్యంలో గుట్టపైన, దిగువన పరిసర ప్రాంతాల్లో మొత్తం 1900 ఎకరాల భూమిని సేకరించారు. ఈ భూమిలో ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులను చేపట్టారు.

Advertisement

ప్రధాన గుట్ట పైభాగంలోని నిర్మాణాలు

మాడవీధులు, ప్రాకారాలు కలుపుకొని 4.5 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన దేవాలయం నిర్మిస్తున్నారు. లక్ష్మీ నర్సింహస్వామి కొలువై ఉండే గుట్టపై భాగంలో ప్రధాన దేవాలయంతో పాటు గోపురాలు, ప్రాకారాలు, మాడ వీధులు, శివాలయం, ఆంజనేయ స్వామి విగ్రహం, ఇ.వో.కార్యాలయం, వివిఐపి గెస్ట్ హౌజు (ప్రెసిడెన్షియల్ సూట్), అర్చక నిలయం, నైవేధ్యం వంటశాల, ప్రసాద మంటపం, రథశాల, వ్రత మంటపం, స్వామి పుష్కరిణి, క్యూ కాంప్లెక్స్, మెట్ల దారి, బస్టాప్, పోలీస్ ఔట్ పోస్టు, హెల్త్ సెంటర్లుండాలని నిర్ణయించారు. ఏ నిర్మాణం ఎక్కడ రావాలనే దానిపై తుది నిర్ణయం తీసుకున్నారు.

యాదాద్రి మున్సిపాలిటీగా మార్పు

Advertisement

 పెరిగిన జనాభాతోపాటు,  భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశం  వున్న యాదగిరి గుట్ట గ్రామాన్ని మునిసిపాలిటీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీగా మారినప్పటికీ యాదాద్రి  టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ ఆధ్వర్యంలోనే, వారి ప్రణాళికకు అనుగుణంగానే పట్టణంలో పనులు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. 

వేములవాడ దేవాలయం అభివృద్ధికి చర్యలు

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 జూన్ 18 న సందర్శించారు. ఈ సందర్భంగా దేవాలయ అభివృద్ధికి కావలసిన సహాయము ప్రకటించి 2015-16 కు గాను రూ. 1.00 కోటి మరియు 2016-17 కు రూ.50.00 కోట్లు మొత్తం రూ.51 కోట్లు విడుదల చేశారు. 2017-18 బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించారు. 2018-19 బడ్జెట్లో వేములవాడ డెవలప్ మెంట్ అథారిటీకి రూ.100 కోట్లు కేటాయించారు.దేవాలయం చుట్టూ 1,200 మీటర్ల మేర మూడు నాలుగు అంతస్థుల భవనాలు కట్టకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. శివరాత్రి రోజున దేవుడి కళ్యాణం కోసం మినీ స్టేడియం కట్టాలని, ట్యాంక్ బండ్ తరహాలో చుట్టూ రింగ్ బండ్ ఏర్పాటు చేయాలని, దేవుడి గుడి స్థలాన్ని అభివృద్ధి పనులకు వినియోగించాలని, మరో 25 నుంచి 30 ఎకరాల స్థలం సేకరించి చెరువును నిర్మించాలని నిర్ణయించారు. శృంగేరి పీఠం సహకారంతో వేములవాడలో సంస్కృత, వేద పాఠశాలల ఏర్పాటు చేయనున్నారు. అలాగే, సిరిసిల్ల-వేములవాడకు నాలుగు లైన్ల రహదారి పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

Advertisement

భద్రాద్రికి కొత్తశోభ

భద్రాచలం ఆలయానికి ఉన్న ప్రాశస్త్యం, ప్రపంచవ్యాప్తంగా శ్రీరామచంద్రుడిపై ప్రజలకున్న భక్తిభావం ప్రకారం.. భద్రాద్రి ఆలయాన్ని దేశంలోనే       ఒక అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఖర్చుకు వెనుకాడకుండా భద్రాద్రి ఆలయాన్ని ఆధ్యాత్మిక దివ్యవైభవ క్షేత్రంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పరమహంస పరివ్రాజకులు, త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్‌స్వామీజీ సూచనల ప్రకారం ఆలయ శిల్పి ఆనందసాయి బృందం రూపొందించిన దేవాలయ అభివృద్ధి నమూనాలను సీఎం పరిశీలించారు. దేవాలయానికి ఉత్తరం, పడమర దిక్కున ఉన్న స్థలాలతో కలిపి 30 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయాన్ని అభివృద్ధిచే యాలని సూచించారు. మూలవిరాట్టు కొలువై ఉన్న గర్భగుడి, చారిత్రాత్మక, పౌరాణిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యంగల కట్టడాలకు ఆటంకం కలుగకుండా నిర్మాణాలను చేపట్టాలని స్పష్టం చేశారు. అలాగే, కొత్తగూడెం-భద్రాచలం మధ్య విమానాశ్రయం నిర్మిస్తున్నారు. కొత్తగూడెం వరకు ఉన్న రైలు మార్గాన్ని భద్రాచలం వరకు పొడిగించే ప్రతిపాదనలను రైల్వేశాఖకు పంపించారు. గోదావరి, ప్రాణహిత నదుల వెంట రహదారిని నిర్మించడం వల్ల మహారాష్ట్ర వరకు రోడ్డు సౌకర్యం కలుగుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అటు ఛత్తీస్‌గఢ్, ఒడిశాలను కలిపేలా రహదారులను నిర్మిస్తున్నారు. గోదావరి నదిపై మరో వంతెన నిర్మిస్తున్నారు. గోదావరి నదిలో ఎప్పుడూ నీరు నిల్వ ఉండేలా ప్రాజెక్టులు కూడా నిర్మాణంలో ఉన్నాయి. యాత్రికులు పడవ ప్రయాణం కూడా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 2018-19 బడ్జెట్ లో భద్రాద్రి అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించారు. భద్రాద్రిని ఇంటిగ్రేటెడ్ టౌన్ గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కొమురవెల్లి మల్లన్న దేవాలయం అభివృద్ధి

Advertisement

కొమురవెల్లి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేయాలని సంకల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ క్రమంలో ఇందుకోసం ప్రభుత్వం 164 ఎకరాలు కేటాయించింది. ఆ స్థలాల్లో భక్తులకు అవసరమైన కాటేజీలు, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసింది. 

రూ.1 కోటితో ఐనవోలు మల్లికార్జున ఆలయ అభివృద్ధి

వరంగల్ అర్బన్ జిల్లాలోని చారిత్రక ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధికి రూ. కోటి మంజూరు చేసింది.

Advertisement

కాళేశ్వరం ఆలయ అభివృద్దికి రూ.100 కోట్లు

రూ.100 కోట్లతో కాళేశ్వరం ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గోదావరి నదిపై ఏరియల్ సర్వే చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పునాది రాయి వేసినప్పటి నుంచి నిన్నటి వరకు సీఎం కేసీఆర్ గారు 9 సార్లు ప్రత్యక్షంగా పర్యటించి, పర్యవేక్షించారు.

నాగార్జునసాగర్ బౌద్ధ క్షేత్రం

Advertisement

బుద్దగయ తరహాలో నాగార్జునసాగర్ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి బౌద్ధ క్షేత్రంగా మార్చాలని ప్రభుత్వ నిర్ణయించింది. నాగార్జుసాగర్ శ్రీ పర్వతారామ – బుద్ధవనం అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేసింది. పూర్తికాలం ఇక్కడేవుండి పనిచేసేలా బుద్ధవనం పాజెక్టు ప్రత్యేక అధికారిగా సీనియర్‌ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్యను నియమించగా, 2016 ఏప్రిల్, 29న పదవీ బాధ్యతలను చేపట్టారు. ప్రస్తుతం 274 ఎకరాల విస్తీర్ణంలో స్థూపం, ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న బౌద్ధ స్థూపాల నమూనాలు, ధ్యానకేంద్రం నిర్మాణంలో ఉన్నాయి. కృష్ణానదీ తీరం వరకు మరికొంత స్థలాన్ని కేటాయించి అభివృద్ధి చేయనున్నారు. శ్రీలంక ప్రభుత్వం బహుకరించిన 27 అడుగుల ఎత్తైన బుద్ధుడి విగ్రహాన్ని కూడా ఇందులో నిలుపనున్నారు.

రామప్పకు యునెస్కోలో స్థానం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర యత్నాలు

ములుగు జిల్లా వెంకటాపూర్ లో కాకతీయ రాజులు నిర్మించిన అద్భుతమైన ఆలయం రామప్పకు వారసత్వ హోదాతో యునెస్కో లో స్థానం సంపాదించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. యునెస్కో గుర్తింపునకు వివిధ దశలు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాంస్కృతిక, పురావస్తు శాఖల సంచాలకులు బుర్రా వెంకటేశం, కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడు ఆచార్య పాండురంగారావు తదితరులు 2019 నవంబరులో పారిస్ లోని బక్మోస్ కు వెళ్లి యునెస్కో ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే భవిష్యత్ లో రామప్ప ఆలయ సంరక్షణ, నిర్వహణపై మరిన్ని వివరాలను 2020 జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం యునెస్కోకు పంపింది.

అధికారికంగా తెలంగాణ పండుగలు

తెలంగాణ సంస్కృతిలో మిళితమై, అస్తిత్వ ప్రతీకలుగా తర తరాలుగా కొనసాగుతూ వస్తున్న పండుగలను గుర్తించి అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే. మతాలకు అతీతంగా హిందూ ముస్లిం క్రైస్తవ మతాలకు సమాన ప్రాధాన్యతనిచ్చి మత సామరస్యాన్ని ఫరిడవింపజేస్తున్న తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణ లౌకిక భావనలకు ఆదర్శంగా నిలించింది. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు రాష్ట్రంలో బతుకమ్మ, బోనాలు, రంజాన్, క్రిస్మస్ తదితర పండుగలకు ప్రభుత్వం అధికారిక హోదా కల్పించింది. ఇందుకోసం 2014 జూన్ లో ప్రత్యేకంగా జీవో విడుదల చేసింది. అలాగే, బక్రీద్, క్రిస్మస్, దసరా, దీపావళి ఇలా ప్రతి పండుగనూ  ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది.

బక్రీద్, రంజాన్, క్రిస్‌మస్‌లకు రెండు రోజుల సెలవు

రంజాన్, బక్రీద్, క్రిస్‌మస్ పండుగలకు రెండు రోజులు సెలవులను ప్రభుత్వం మంజూరు చేసింది. పండుగల గలకోసం కుటుంబాలతో సొంతూళ్లకు ప్రయాణాలు చేసి మరుసటి రోజే తిరిగి విధుల్లోకి రావడం ఇబ్బందిగా ఉన్నందున వారికి పండుగ తదుపరి రోజు కూడా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు

ప్రతీ బతుకమ్మ పండుగకు ముందు రాష్ట్రంలోని 18 ఏళ్లు నిండిన పేద మహిళలందరికీ చీరలను కానుకగా అందజేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. 2017 సెప్టెంబర్ 18 నుంచి ప్రతి బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేస్తున్నారు. 500 డిజైన్లలో రూపొందించే ఈ చీరల కోసం ప్రభుత్వం ప్రతిఏటా రూ.220 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నది. సిరిసిల్ల మరమగ్గ కార్మికులతో ఈ చీరలను తయారుచేయిస్తున్నారు. 80 సెంటీమీటర్ల జాకెట్ తో కలిపి ప్రతి చీరె 6.30 మీటర్ల పొడవు కలిగి ఉంది. గతానికి భిన్నంగా ఈసారి చీరెలను ప్రీడైడ్ ఫిలమెంట్ యార్న్ టెక్నాలజీతో బంగారురంగు జరీతో తయారుచేయించారు. కుల, మతాలకు సంబంధంలేకుండా మహిళలకు బతుకమ్మ చీరెలను రేషన్‌షాపుల వారీగా స్థానిక ప్రజా ప్రతినిధుల చేతులమీదుగా పంపిణీ చేశారు. అర్హులైన మహిళలు చీరలు తీసుకునేందుకు రాకపోతే వారి తరఫున భర్త లేదా తండ్రి, లేదా తల్లి ఎవరైనా గుర్తింపు కార్డు చూపిస్తే వారికి కూడా చీరలు అందించారు.

తెలంగాణ మొక్కులు తీర్చుకున్న కేసీఆర్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైతే ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వెంకన్న, విజయవాడలోని కనకదుర్గమ్మతోపాటు రాష్ట్ర దేవాలయాలకు కానుకలు, ఆభరణాలు సమర్పిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మొక్కులు మొక్కుకోగా ఇపుడు నెరవేరుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ మొక్కుబడులకు బంగారు ఆభరణాల తయారీకి నిధులు విడుదల చేస్తూ 2015 ఫిబ్రవరి 24న జీవో జారీ చేసింది. ఆంధ్రాలో 3 దేవాలయాలు, తెలంగాణలో 2 దేవాలయాల్లో మొక్కుల కోసం రూ. 8 కోట్ల 73 లక్షల నిధులు  విడుదల చేశారు.

వరంగల్ భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం

వరంగల్ లో భద్రకాళి అమ్మవారికి సీఎం కేసీఆర్ 2016 అక్టోబర్ 9న మొక్కులు సమర్పించారు. అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రూ 3.60 కోట్ల వ్యయంతో 11 కిలోల బంగారంతో చేయించిన కిరీటాన్ని అమ్మవారికి సమర్పించారు.

కురవి వీరభద్ర స్వామికి కోరమీసాలు

కురవిలోని వీరభద్రస్వామి దేవాలయానికి 25 గ్రాముల బరువుండే రూ.75 వేల విలువైన  బంగారు కోరమీసాలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం తరఫున సమర్పించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినాన 2017 ఫిబ్రవరి 24న మొక్కులు తీర్చుకున్నారు. 

తిరుపతి వెంకన్నకు రూ.5 కోట్లతో ఆభరణాలు

ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుపతి దేవస్థానాన్ని 2017 ఫిబ్రవరి 24న కుటుంబ సమేతంగా దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రూ.5 కోట్లతో ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు ఆభరణాలను స్వామివారికి సమర్పించారు. ఇందులో రూ.3.7 కోట్ల విలువైన 14.2 కిలోల స్వర్ణసాల గ్రామహారం, రూ.1.21 కోట్ల విలువైన 4.650 కిలోల స్వర్ణ కంఠాభరణాలు ఉన్నాయి. 

తిరుచానూరు పద్మావతి అమ్మవారికి ముక్కుపుడక

తిరుపతిలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారికి 10 నుంచి 15 గ్రాములముక్కుపుడక – దీనికి 45 వేల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది.

విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముక్కుపుడక

విజయవాడలోని కనకదుర్గ అమ్మవారికి 11.29 గ్రాముల బంగారంతోముక్కుపుడకను  పాలపిట్ట రంగులో విలువైన రాళ్లు, రత్నాలు పొదిగించి చేయించారు. దీని నిమిత్తం ప్రభుత్వం రూ.45 వేలు విడుదల చేసింది. 2018 జూన్ 28న ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా విజయవాడకు వెళ్లి కనకదుర్గ అమ్మవారికి ముక్కుపుడక సమర్పించి, మొక్కు తీర్చుకున్నారు.

తెలంగాణ శాస్త్ర సాంకేతిక మండలి ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2015 ఫిబ్రవరి 13న జీవో 6,7లను జారీ చేసింది. దీనికి సీఎం అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.

అతిపెద్ద జాతీయ జెండా

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న దేశంలోనే అతి ఎత్తైన 303 అడుగుల ఎత్తున్న జాతీయజెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.  ఇందుకోసం రూ.1.96 కోట్లు నిధులు విడుదల చేస్తూ 6 మే, 2016న ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ జెండా ఏర్పాటు బాధ్యతను కోల్‌కతా స్కిప్పర్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. ఇందులో 303 అడుగులు కర్ర ఎత్తు కాగా, జాతీయ పతాకం 100 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తులో ఉంది.

అమరులకు నివాళిగా మహా దీపకళిక

తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరుల స్మృతికి ఘనంగా నివాళులు అర్పించేందుకు, అమరుల త్యాగాలను స్మరించేందుకు ఒక మహాస్మృతికేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్, అధికారులు ఆ స్థూపం నమూనాను ఖరారు చేశారు. ప్రపంచంలో అపూర్వమైన రీతిలో ఈ అమరవీరుల స్థూపం ఉండేలా సీఎంఅన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సర్వహంగులతో ప్రత్యేకతను చాటుకునేలా స్మృతికేంద్రం నిర్మాణం జరగాలని అధికారులను ఆదేశించారు. అమరవీరుల స్తూపం, స్మృతివనం నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హుస్సేన్‌సాగర్ తీరంలో ఏర్పాటు చేసే అమరవీరుల స్తూపాన్ని ప్రమిద ఆకృతిలో డిజైన్ చేశారు. ఈ అపురూప స్మారకానికి రూ.90 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. సాధారణంగా స్మృతి స్తూపాలను రాయి లేదా సిమెంటుతో నిర్మిస్తుంటారు. కానీ తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని పూర్తిస్థాయిలో స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నిర్మించనున్నారు. దీని ఎత్తు 23 మీటర్ల వరకు ఉంటుంది. సాధారణంగా ఆరు లేదా ఏడు అంతస్తుల భవనంతో ఇది సమానం. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన అమరవీరుల స్తూపం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించేలా వుండబోతోంది.  25 మంది ప్రఖ్యాత డిజైనర్లు, ఆర్టిస్టులు కలిసి ఈ డిజైన్ రూపొందించారు. ఇక్కడికి వచ్చినవారు కొంత సమయం గడిపేలా, తెలంగాణ ప్రాంత చరిత్ర, అమరవీరుల త్యాగాలు తెలుసుకునేలా ఒక మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేస్తారు.

అమరవీరుల స్మృతిచిహ్నం

రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ, వారికి ఘన నివాళి ఆర్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం వేడుకలు నిర్వహించింది. హుస్సేన్‌సాగర్ తీరాన అమరవీరుల భారీ స్థూపానికి 2016 జూన్ 2న శంకుస్థాపన చేశారు. 12 ఎకరాల స్థలంలో అమరవీరుల స్థూపం, స్మృతివనం నిర్మాణం పనులను చేపట్టారు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!