HomeLATESTతెలంగాణ పోలీస్​ విభాగం

తెలంగాణ పోలీస్​ విభాగం

శాంతి భద్రతలు – పోలీసుల సంక్షేమం

Advertisement

ఏ దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా శాంతి భద్రతలు సజావుగా ఉంటేనే పరిపాలన సాఫీగా జరగుతుంది. జనజీవనం ప్రశాంతంగా ఉంటుంది. ప్రగతిశీల సమాజం రూపుదిద్దుకుంటుంది. వలస పాలనాకాలంలో అనేక అలజడులకులోనైన తెలంగాణ స్వయంపాలనలో బంగారు తెలంగాణ దిశగా పయనించాలన్నా, ప్రజలు సుఖశాంతులతో జీవించాలన్నా శాంతిభద్రతల పరిరక్షణే కీలకమని భావించి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

పోలీస్ స్టేషన్ల నిర్వహణకు ప్రత్యేక నిధులు

పోలీస్ స్టేషన్లలో కాగితాల ఖర్చు, పెట్రోల్, డీజిల్, తిండి ఖర్చుల కోసం పోలీసు అధికారులు ఇబ్బందులుపడేవారు. ఫిర్యాదు చేసిన వారే ఖర్చులు భరించాల్సి వచ్చేది. స్టేషన్ కు వచ్చిన వారికి వారి సొంత సమస్యలతోపాటు ఈ అదనపు భారం మరింత బాధించేది. ఇది గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అటు సామన్య ప్రజలకు, ఇటు పోలీసులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ స్టేషన్లకు స్టేషనరీ తదితర ఖర్చుల నిమిత్తం నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో నగరాల్లోని ఒక్కో పోలీస్ స్టేషన్  నిర్వహణ ఖర్చుకోసం నెలకు రూ. 75 వేలు (గతంలో రూ.5 వేలు), జిల్లా కేంద్రాలలో రూ.50 వేలు (గతంలో రూ.3 వేలు) , గ్రామీణ ప్రాంతాల స్టేషన్లకు 25 వేల రూపాయలు (గతంలో 2 వేలు) ప్రభుత్వం అందిస్తున్నది.

Advertisement

పోలీస్ శాఖలో పెద్దఎత్తున ఉద్యోగ నియామకాలు

పోలీస్‌శాఖను బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వం పోలీసు శాఖలో భారీగా సిబ్బంది నియామకాన్ని చేపట్టింది. 2014 జూన్ లో పోలీసు శాఖలో 8,447 పోలీస్ కానిస్టేబుల్స్ నియామకాలు జరిగాయి.  ఇందులో 1133 మంది మహిళలు ఉద్యోగం పొందారు. అనంతరం 2017లో రాష్ట్రంలో ఏర్పాటైన నూతన జిల్లాలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పోలీస్‌ శాఖలో 18,290 పోస్టులను మంజూరు చేసింది. సివిల్ లో 9,629 పోస్టులు,  ఏఆర్  5,538 పోస్టులు, టి.ఎస్.ఎస్.పి.లో 2,075 పోస్టులు, కమ్యూనికేషన్స్  143 పోస్టులు, మినిస్టీరియల్ లో 599 పోస్టులు మంజూరయ్యాయి.  ఈ మేరకు ప్రభుత్వం జులై 2017లో ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మరోమారు 2018 ఫిబ్రవరి 3న వివిధ హోదాల్లో కలిపి మరో 14,177 ఉద్యోగాల భర్తీకి అనుమతినిస్తూ హోంశాఖ కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర డీజీపీ పరిధిలో ఉండే ఈ పోస్టులను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేశారు. మొత్తం 14,177 పోస్టుల్లో సివిల్ ఎస్సై 710 పోస్టులు, ఏఆర్ ఎస్సై 275 పోస్టులు, టీఎస్‌ఎస్పీ ఎస్సై 175 పోస్టులతోపాటు సివిల్ కానిస్టేబుల్ 5,002 సహా మొత్తం ఏడు క్యాటగిరీల్లో భర్తీచేశారు.  

హోంగార్డుల జీతాలు భారీగా పెంపు

Advertisement

పోలీసులతో సమానంగా నిత్యం విధుల్లో అంకితభావంతో పనిచేస్తున్న హోంగార్డుల పట్ల ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తుంది. ఎన్నోఏళ్లుగా అరకొర జీతాలతో అష్టకష్టాలు పడుతున్న హోంగార్డులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. ఎవరూ ఊహించనివిధంగా 18,491 హోంగార్డుల వేతనాలు పెంచడంతోపాటు, అనేక ఇతర సౌకర్యాలూ కల్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో హోంగార్డులకు కేవలం రూ.6 వేల జీతం వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2014 డిసెంబర్ 5న వారి జీతాన్ని రూ. 9 వేల నుండి రూ. 12 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన జీతాలను 2015 ఏప్రిల్ నుంచి అమలు చేశారు. నెలకు రెండుసార్లు పరేడ్‌ అలవెన్సు పేరిట ఇస్తున్న రూ. 28/- ని రూ.100/-లకు పెంచారు. 2017డిసెంబర్ 13న వారి వేతనాలను రూ.12 వేల నుంచి రూ.20 వేలకు పెంచారు. ముఖ్యమంత్రి కేసిఆర్ 2017 డిసెంబర్ 13న ప్రగతి భవన్‌లో (జనహిత) హోంగార్డుల జీతాల పెంపు  ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం 2018జనవరి 31న జారీ చేసింది. పెరిగిన జీతాల మేరకు నెలకు రూ.20 వేల వరకు హోంగార్డులు తీసుకునే అవకాశం ఉంది. జీవోలో పేర్కొన్న మేరకు ప్రతిరోజూ రూ.675, ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నుంచి వెయ్యి రూపాయల పెంపు, ట్రాఫిక్ విభాగంలో పని చేసే వారికి కానిస్టేబుళ్లతో సమానంగా 30 శాతం ప్రత్యేక అలెవెన్సు, యూనిఫాం అలవెన్సు, మహిళా పోలీసు కానిస్టేబుళ్లతో సమానంగా మహిళా హోంగార్డులకు ఆరు నెలల మెటర్నరీ సెలవు, ప్రమాదవశాత్తు విధి నిర్వహణలో చనిపోతే హోంగార్డు కుటుంబానికి ఇప్పుడు ఇస్తున్న రూ.5 వేలను రూ.10 వేలకు పెంపు, పోలీస్ యూనిట్ హాస్పిటల్స్‌లో పోలీసులకు అందిస్తున్న వైద్య చికిత్సలు అందజేత, ఆరోగ్య బీమాతోపాటు డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే విధంగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతోపాటు హోంగార్డుల తొలగింపు లేకుండా ఉద్యోగ భద్రతకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నీ జనవరి 2018 నుంచి అమల్లోకి వచ్చాయి. జంట నగరాల్లో పనిచేసే హోంగార్డులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రస్తుతం వారి వేతనాలు, ఇతర భత్యాలకు ప్రభుత్వం ఏడాదికి రూ.285 కోట్లు ఖర్చు చేస్తుండగా. ఈ హామీల అమలుతో ఏటా అదనంగా రూ.265 కోట్ల భారం పడుతున్నది. మొత్తం వ్యయం రూ.550 కోట్లు అవుతున్నది.

పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్

దేశంలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడుకున్న మొదటి పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో నిర్మిస్తున్నది. బంజారాహిల్స్‌ లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నర్మిస్తున్న పోలీస్ ట్విన్‌టవర్స్‌ కు ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 నవంబర్ 22న శంకుస్థాపన, భూమిపూజ నిర్వహించారు. భారతదేశంలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడుకున్న మొదటి పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రభుత్వం నిర్మిస్తున్నది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్, కమాండ్, కంట్రోల్ సెంటర్ భవనాన్ని రూ.350 కోట్ల వ్యయంతో 7 ఎకరాల విస్థీర్ణంలో.. 6 లక్షల చదరపు అడుగుల్లో టవర్లను నిర్మిస్తున్నారు. ఈ భవన నిర్మాణానికి 2016 సెప్టెంబర్ 16న పరిపాలనా అనుమతులు వచ్చాయి. డిసెంబర్ 2016 న నిర్మాణ పనులు ప్రారంభించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు 2018-19 బడ్జెట్లో రూ.280.80 కోట్లు కేటాయించారు. ఈ భవనాన్ని 4 టవర్లతో నిర్మిస్తున్నారు. టవర్ ఎ.ను 20 అంతస్తుల ఎత్తులో 1.40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, టవర్ బి, సి, డి లను ఒక్కొక్కటి 16 అంతస్తుల ఎత్తులో 1.12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మిస్తున్నారు. మిగతా ప్రాంతాన్ని 1.24 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. నాలుగు టవర్ల మధ్య ఉన్న స్థలంలో అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మధ్యలో కింది ఖాళీ భాగాన్ని వివిధ అవసరాలకు ఉపయోగించనున్నారు. కమాండ్ సెంటర్ కోసం నాలుగంతస్తులను 44 వేల చదరపు అడుగుల విస్థీర్ణంలో నిర్మించారు. ఒక్కో అంతస్తు 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. నాలుగో అంతస్తు డేటా సెంటర్ కాగా అయిదారు అంతస్తులను కమాండ్ కంట్రోల్ సెంటర్ గా తీర్చిదిద్దుతున్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో లక్ష కెమెరాల పుటేజీని ఒక్క నిమిషంలోనే పరిశీలించే ఆధునిక పరికరాలు, పరిజ్ఞానం  అందుబాటులో ఉన్నాయి.

Advertisement

ట్రాఫిక్ పోలీసులకు కాలుష్య అలవెన్సు

రోజు రోజుకూ పెరుగుతున్న కాలుష్యంలో విధులు నిర్వహించడం వల్ల ట్రాఫిక్ పోలీసులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్న వీరి కోసం ప్రభుత్వం కాలుష్య అలవెన్స్ ఇవ్వాలని 2016 జనవరి 2న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. వారి మూలవేతనం మీద 30 శాతం పెంచింది.  

పోలీసుశాఖ పునర్వ్యవస్థీకరణ :

Advertisement

శాంతి భద్రతలను పకడ్బందీగా పర్యవేక్షించేందుకు అత్యంత శాస్త్రీయ పద్ధతిలో పోలీసుశాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో కేవలం రెండు పోలీస్ కమీషనరేట్లు మాత్రమే ఉండేవి. ప్రభుత్వం కొత్తగా ఏడు పోలీస్ కమీషనరేట్లన్లను నెలకొల్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో తొమ్మిది పోలీస్ కమీషనరేట్లున్నాయి. పోలీస్ సబ్ డివిజన్ల సంఖ్యను 139 నుంచి 164కు, సర్కిళ్ల సంఖ్యను 688 నుంచి 719కు, పోలీస్ స్టేషన్ల సంఖ్యను 712 నుంచి 815కు ప్రభుత్వం పెంచింది.

ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ఐ.టి.ఎం.ఎస్.

హైదరాబాద్ లో రోజురోజుకు ఎక్కువవుతున్న ట్రాఫిక్ రద్దీని శాస్త్రీయ పద్ధతిలో క్రమబద్ధీకరించేందుకు ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టమ్ అమలు చేస్తున్నారు. రూ.98.89 కోట్ల వ్యయంతో అమలు చేస్తున్న ఈ పద్ధతి ప్రకారం ఆన్ లైన్ లోనే నిరంతరం ట్రాఫిక్ పరిస్థితిని సమీక్షిస్తారు. రాంగురూట్లో వెళుతున్న వారిని గుర్తిస్తారు. ట్రాఫిక్ ఎక్కడ ఎక్కువుందో గుర్తించి, రూట్లను డైవర్టు చేస్తున్నారు. నంబర్ ప్లేట్లను గుర్తించడానికి, నకిలీ నెంబరు ప్లేట్లు పెట్టుకుని తిరిగే వారిని గుర్తించేందుకు ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ ఐడెంటిఫికేషన్ తీసుకొచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిని ఆపి, చానళ్లు రాయడం వల్ల మరింత ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున, ఆన్ లైన్ ద్వారానా చానాళ్లను రూపొందించి, వాహన యజమానులకు పంపుతున్నారు.

Advertisement

.

ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం

పోలీసుశాఖ  ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. దేశంలోనే తొలిసారిగా అనుమానితుల ఫోటోలు క్షణాలలో సరిపోల్చే ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ప్రవేశపెట్టింది. ఇది పోలీసుల చేతిలో ఒక బ్రహ్మాస్త్రంగా మారింది. నేరస్తులతోపాటు, అనాథశవాలను, తప్పిపోయినవారిని కూడా  దీంతో గుర్తిస్తున్నారు.   

Advertisement

 ‘నేను సైతం’ – ఊరూరా సీసీ కెమెరాలు

సమాచార సాంకేతికాభివృద్ధి మానవాభివృద్ధికి వారి సుఖసంతోషాలకోసం ఉపయోగపడాలె అనే ముఖ్యమంత్రి ఆలోచనా విధానాన్ని పోలీసుశాఖ అనుసరిస్తున్నది. అందులో భాగంగా పల్లె పల్లెనా శాంతి భద్రతలను పటిష్ట పరిచేందుకు సీసీ కెమెరాలను వినియోగించాలని నిర్ణయించింది. ఎవరూ చూడట్లేదనుకుని నేరాలకు తెగబడే నేరస్థులకు, తమను ఎప్పటికప్పుడు గమనించే  పైవాడు వొకడున్నాడనే భయం నేర నిరోధానికి తద్వారా నివారణకు దోహదం చేస్తుంది.  

హైదరాబాద్ నగరంలో ‘నేను సైతం’ 

Advertisement

రాష్ర్ట జిడిపిలో హైదరాబాద్ వాటా 40 నుంచి 50 శాతం ఉంటుంది. అందుకే హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు ‘నేను సైతం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.  నగరంలో నమోదవుతున్న కేసుల్లో 90 శాతం సీసీ కెమెరాల పుటేజీల్లో దొరికే ఆధారాల ద్వారానే ఛేదిస్తుండటం గమనార్హం.

గ్రామాలకూ ‘నేను సైతం’  విస్తరణ

హైదరాబాద్‌లో సత్ఫలితాలు ఇస్తున్న ‘నేను సైతం’ కార్యక్రమాన్ని గ్రామాలకూ విస్తరించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, కేసుల దర్యాప్తునకు ఉపయోగపడే సీసీ టీవీ కెమెరాలను గ్రామాల్లో ఏర్పాటు చేయనుంది. ప్రతి గ్రామంలో ప్రధాన కూడళ్లు, నేరాలు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి… వాటిని మండల కేంద్రంలోని ఠాణాల్లో కమాండ్‌ కంట్రోల్‌ రూంలకు అనుసంధానం చేయనున్నారు. జిల్లాల్లో ఠాణాల పరిధిలోని ప్రాంతాలు విస్తీర్ణపరంగా పెద్దవి. దొంగతనాలు, మద్యం, ఇసుక అక్రమ రవాణా, పోకిరీల బెడద, రోడ్డు ప్రమాదాలు… వీటన్నింటినీ పోలీసులు చూడలేరు. కావున గ్రామాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నారు. అన్ని మండలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన జిల్లాగా యదాద్రి-భువనగిరి నిలిచింది.

Advertisement

దేశంలోని ఉన్న సీసీ కెమెరాల్లో 66 శాతం సీసీ కెమెరాలు తెలంగాణలోనే (14.2.2020)

దేశవ్యాప్తంగా పోలీసులు ఉపయోగిస్తున్న 4,27,529 కెమెరాల్లో 2020 మార్చి నాటికి 66 శాతం (2,75,528) తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్స్ – నివేదికలో పేర్కొన్నది. తెలంగాణలో ఏదైనా పనిమీద బయటకొచ్చినవారు ఇంటికి వెళ్లేలోపు 50 కెమెరాల్లో చిక్కే అవకాశం ఉంది. ఇలా రాష్ట్రంలోని ప్రతి అంగుళాన్ని పోలీస్ రాడార్ లోకి తెచ్చుకొని,  నేరాలను అదుపు చేసేందుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్ని నియంత్రించేందుకు నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ సెంటర్ 2020 ఆగస్టులోగా అందుబాటులోకి రానుంది. దీంతో ఎక్కడ నేరం జరిగినా క్షణాల్లోనే పోలీసులకు సమాచారం అందడంటో నేరాలు తగ్గుతాయి.

మిషన్‌ వుమెన్‌ ప్రొటెక్షన్‌

మహిళలు, బాలికల భద్రత, రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో మహిళ భద్రతకు అత్యంత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం వుమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేసింది. అలాగే బాలికలు, మహిళలపై యాసిడ్ దాడులకు పాల్పడిన వారిపై అత్యంత కఠినంగా చర్యలు తీసుకునే విధంగా గతంలో ఉన్న చట్టానికి ప్రభుత్వం మార్పులు చేసింది. నేరస్తులకు 10 ఏళ్ల నుండి జీవిత కాలం శిక్ష విధించే విధంగా చట్టంలో మార్పులు తేనుంది. నేరస్తులకు జరిమానా విధించి ఆ డబ్బులను బాధితులకు లేదా వారి కుటుంబ సభ్యులకు అందజేసే విధంగా చట్టంలో మార్పులు తీసుకురానుంది.

మహిళల భద్రతకు ‘షీ టీమ్స్’

ఈవ్ టీజింగ్‌కు ముగింపు పలకాలనే ఉద్దేశంతో 2014 అక్టోబర్ 24న షీ టీములను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మహిళలు, యువతులు, విద్యార్థినులను రక్షించండం, వారి భద్రతకు ఈ బృందాలను ఏర్పాటుచేసింది. షీ టీమ్స్ మహిళల గౌరవాన్ని, హక్కులను కాపాడుతున్నాయి.  షీ టీమ్స్‌ సభ్యులైన పోలీసులు  కాలేజీల్లోనూ, బస్టాండ్‌ల్లోనూ, రద్దీ ఉన్న ప్రదేశాలలో మఫ్టీలో సంచరిస్తారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ప్రవేశపెట్టిన షీ టీం ప్రయోగం సక్సెస్ కావడంతో తెలంగాణవ్యాప్తంగా ప్రభుత్వం షీ టీంలను రంగంలోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలో మొత్తం 200 షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. 6,546 ఫిర్యాదులు అందగా 5,179 కేసులు రిజిస్టర్ చేశారు.  1547 మందిని జైలుకు పంపారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని  చాలా రాష్ర్టాలు ‘షీ టీమ్స్’ ను ప్రవేశపెడుతున్నాయి. వేదింపులకు గురవుతున్న మహిళలు డయల్ 100 ఫోన్ చేసి కానీ, ఈ మెయిల్, ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, హాక్ ఐ మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదులు అందిస్తున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే షీ టీమ్స్ స్పందిస్తున్నాయి. ఏదైనా ఆపదొస్తే సమాచారం అందించేలా రాష్ట్రస్థాయిలో షీటీమ్‌ వాట్సప్‌నంబర్‌ 944166 9988ను 28 జనవరి, 2020న  ఐజీ స్వాతి లక్రా ప్రారంభించారు. 

భరోసా కేంద్రాలు

వేధింపులకు గురైన మహిళలు, పిల్లల సమస్యల్ని పరిష్కరించి, వారికి భద్రత కల్పించడానికి ప్రభుత్వం భరోసా కేంద్రాల్ని ప్రారంభిస్తోంది.ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం మే 2016 న ప్రవేశపెట్టింది.ఈ సెంటర్‌ ద్వారా న్యాయంతోపాటు బాధితుల కోసం ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే, న్యాయం కోసం బాధితులు వివిధ ఏజెన్సీల చుట్టూ తిరగడం భారంగా మారినందున నిపుణులందరినీ ఒకే వేదికపైకి తెచ్చి సత్వర న్యాయం అందిస్తున్నారు. లైగింక వేధింపుల ఫిర్యాదులు అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైనపక్షంలో బాధితులను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సైకాలజిస్టులు, లీగల్‌ కౌన్సెలర్లతో కౌన్సెలింగ్‌ ఇప్పిస్తున్నారు.

‘డయల్ 100’ బలోపేతం

రాష్ట్రంలో అమలులో ఉన్న డయల్ 100 ను ప్రభుత్వం బలోపేతం చేస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు 14,500 వాహనాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ వాహనాలకు జిపిఎస్ తదితర ఉపకరణాలను సమకూరుస్తున్నారు. కెమెరాలను కూడా అమర్చనున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగేలా ప్రెటోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి, బాధితుల నుంచి ఫోన్‌కాల్ వచ్చిన త్వరాత ఘటనాస్థలానికి వేగంగా చేరేలా రెస్పాన్స్ టైంను తగ్గిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రెస్పాన్స్ టైం 8.5 నిమిషాలుగా ఉన్నది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఈ సమయం 5 నిమిషాలుగా ఉన్నది.

ఆపదలో ఉన్నవారిని ఆదుకునే డయల్ 100కు మరిన్ని హంగులు 

ఆపదలో ఉన్నవారెవరైనా డయల్ 100కు కాల్ చేశాక, వారి ఫోన్ స్విచ్ఛాఫ్ అయితే.. వారు

ఎక్కడున్నదీ గుర్తించడం కష్టం. కానీ, తెలంగాణ పోలీసులు ఈ సమస్యకు సాంకేతిక పరిష్కారం

కనుగొన్నారు. ఫోన్ స్విచ్ఛాఫ్ అయినా, డయల్ చేసిన వారిది స్మార్ట్ ఫోన్ కాకున్నా లొకేషన్

   గుర్తించి క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకునేలా సరికొత్త సాఫ్ట్ వేర్ రూపొందించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో పెట్రోలింగ్ వాహనాల్లో ఉండే ట్యాబ్ లకు 100కు డయల్ చేసిన వారి లొకేషన్ కనిపిస్తుంది. దీంతో జీపీఎస్ సహకారంతో పోలీసులు అక్కడకు చేరుకొని, ఆపదలో ఉన్నవారిని రక్షిస్తారు.

పోలీసు అమరవీరుల ఎక్స్ గ్రేషియా భారీగా పెంపు

పోలీసు అమరుల కుటుంబాలకు చెల్లించే ఎక్స్‌ గ్రేషియాను భారీగా పెంచారు.  కానిస్టేబుల్‌ నుంచి అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ హోదావరకు ఉన్న సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబానికి ఇస్తున్న పరిహారాన్ని రూ. 25 నుంచి రూ.40 లక్షలకు పెంచారు.  ఎస్‌ఐ హోదా అధికారి చనిపోతే రూ.25 నుంచి రూ. 45 లక్షలకు, సిఐ, డిఎస్పి, అడీషినల్‌ ఎస్పి హోదా గల అధికారులు మృతి చెందితే ఇస్తున్న మొత్త్తాన్ని రూ. 30 నుంచి రూ. 50 లక్షల వరకు, ఎస్పీ స్థాయి లేదా ఐపిఎస్‌ అధికారి మృతి చెందితే రూ. 50 లక్షల నుంచి రూ. ఒక కోటికి పెంచారు.

పోలీస్ శాఖ నియామకాల్లో వయో పరిమితి మూడేండ్ల సడలింపు

పోలీస్ శాఖ నియామకాల్లో అభ్యర్థుల కనీస వయోపరిమితిని ప్రభుత్వం సడలించింది. వివిధ క్యాటగిరీల్లో ప్రస్తుతం ఉన్న పరిమితిని మూడేండ్లకు పెంచుతూ సంబంధిత ఫైలు మీద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 2015 నవంబర్ 8న సంతకం చేశారు. దీని ప్రకారం కానిస్టేబుళ్లనియామకాల్లో జనరల్ క్యాటగిరీ అభ్యర్థులకు 22 ఏండ్ల వయోపరిమితిని 25 ఏండ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల వయోపరిమితిని 27 నుంచి 30 ఏండ్లకు పెంచారు. సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టుల నియామకానికి జనరల్ కేటగిరీ అభ్యర్థుల వయో పరిమితిని 25 నుంచి 28 ఏండ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వు కేటగిరీ అభ్యర్థులకు 30 నుంచి 33 ఏండ్లకు పెంచారు. అలాగే పోలీస్‌శాఖలో కమ్యూనికేషన్ల విభాగంలో 332 కానిస్టేబుల్ పోస్టులను భర్తీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గ్యాంబ్లింగ్‌ సెంటర్లు, పేకాట క్లబ్బుల మూసివేత

మనుషులను వ్యసనపరులుగా మార్చి వారి జీవితాలను ఆగం చేయడంలో ప్రధాన పాత్ర పేకాట గ్యాబ్లింగులది. తెలంగాణ వంటి వెనుకబాటుకు గురైన రాష్ట్రాల్లో చేతినిండా పనిలేక అనేక దురలవాట్లకు లోనైన చరిత్ర గత పాలనతోనే అంతం కావాలని నూతన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పేకాట క్లబ్బులను మూసేయాలని తెలంగాణ వచ్చిన కొత్తలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తదుపరి కాలంలో సత్పలితాలనిచ్చింది. చాలామంది జీవితాలను ఆర్థికంగా చిన్నాభిన్నం చేస్తున్న గ్యాంబ్లింగ్‌ సెంటర్లు, పేకాట క్లబ్బులను మూసివేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో అక్రమ దందాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఉండవద్దనేది ప్రభుత్వ ఉద్దేశ్యం. ప్రభుత్వం పేకాట క్లబ్బులను మూసివేసినా ఆన్‌లైన్‌లో గేమింగ్, గ్యాంబ్లింగ్‌ జరుగుతున్న నేపథ్యంలో… రాష్ట్రంలో ఆన్‌లైన్‌లో రమ్మీ, పేకాట ఆడటాన్ని నిషేధించాలని 2017 జూన్ 17న కేబినెట్‌ నిర్ణయించింది. ఈ మేరకు గ్యాంబ్లింగ్, గేమింగ్‌ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారు. అప్పటినుంచి తెలంగాణలో ఆన్ లైన్ పేకాట ఆడటం రద్దయ్యింది.

కల్తీకి పాల్పడితే పీడీ యాక్ట్‌

వ్యక్తులను అనారోగ్యం పాలు చేసి ఆర్థికంగా శారీరకంగా మానసికంగా శక్తిహీనులను చేసే మహమ్మారి కల్తీ. ఇది కేవలం మానవ తప్పిదం కావడం దురదృష్టకరం. కంచే చేను మేసిన చందంగా, నమ్మకంగా కొనుక్కుని వినియోగిస్తున్న ప్రతి వస్తువులో కల్తీ మయం కావడం రోజురోజుకూ పెరుగుతున్న దుర్మార్గం. ఇటువంటి దుర్మార్గాలకు చెక్ చెప్పకపోతే రానున్న భావి తరాల భవిష్యత్తు నిర్వీర్యమైపోతుందనే ముందు చూపుతో కల్తీని అరికట్టే దిశగా ముఖ్యమంత్రి తీసుకున్న కఠిన చర్యలు మహిళల ఆదరణ చూరగొంటున్నవి.

        ఈ దిశగా ప్రభుత్వం పీడీ యాక్టులోకి మరో పది అంశాలను చేర్చింది. ఈ మేరకు 2017 జూన్17న జరిగిన కేబినెట్‌ ఆర్డినెన్స్‌ జారీకి ఆమోదం తెలిపింది.  ఆయా మోసాలకు పాల్పడేవారిని కూడా పీడీ యాక్టు కింద అదుపులోకి తీసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.కల్తీ నిరోధానికి పోలీసు శాఖ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది.  

పీడీ యాక్టులో చేర్చిన మరో పది మోసాలు..

  • , ఎరువులు, పురుగు మందుల విక్రేతలు
  • , నూనె, పప్పు, కారం తదితర ఆహార పదార్థాల కల్తీకి పాల్పడేవారు
  • , సర్టిఫికెట్లు తయారుచేసేవారు
  • , ఆయుధాలు, మందుగుండు సరఫరా చేసేవారు
  • , వైట్‌ కాలర్‌ నేరాలు చేసేవారు

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!