యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 339 ఖాళీలకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 7వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
అర్హత: సాధారణ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్‌తో పాటు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి. రాతపరీక్ష, ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్: ఆర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 7వ తేదీ వరకు అప్లై చేసుకోవాలి. మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకి ఫీజు లేదు. జనరల్ క్యాండిడేట్స్ రూ.200 చెల్లించాలి. పరీక్షను సెప్టెంబర్ 4వ తేదీని నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం www.upsc.gov.in వెబ్సైట్ సంప్రదించాలి.