Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఐటీబీపీలో కానిస్టేబుల్ 51 పోస్టులు

ఐటీబీపీలో కానిస్టేబుల్ 51 పోస్టులు

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఇండో–టిబెట‌న్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌(ఐటీబీపీ).. స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్/జ‌న‌ర‌ల్ డ్యూటీ 51 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.  క్రీడాంశాలు: బాక్సింగ్‌, రెజ్లింగ్‌, క‌బ‌డ్డీ, ఆర్చరీ, వాలీబాల్‌, స్పోర్ట్స్ షూటింగ్‌, ఐస్ హాకీ; ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.100, ఎస్సీ/ఎస్టీ, మహిళలకు ఫీజు లేదు. చివ‌రి తేది: 2020 ఆగస్ట్​ 26; వివరాలకు: www.recruitment.itbpolice.nic.in

Advertisement

హైద‌రాబాద్‌ మింట్​లో 11 పోస్టులు

హైదరాబాద్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ఎస్‌పీఎంసీఐఎల్‌).. 11 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

పోస్టులు–ఖాళీలు: జూనియ‌ర్ ఆఫీస్ అసిస్టెంట్‌–10, సూప‌ర్‌వైజ‌ర్‌(అఫీషియ‌ల్ ల్యాంగ్వేజ్‌)–01

Advertisement

అర్హత‌: డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత‌. ఇంగ్లిష్, హిందీ ప్రొఫిషియ‌న్సీ, టైపింగ్ స్కిల్స్తో పాటు పని అనుభ‌వం

వయసు: 2020 ఆగస్ట్​ 1 నాటికి18–28 ఏళ్ళు మద్య ఉండాలి

సెలెక్షన్ ప్రాసెస్: ఆన్‌లైన్ టెస్ట్‌, టైపింగ్​/స్కిల్​ టెస్ట్ ద్వారా

Advertisement

ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.600, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.200

చివ‌రి తేది: 2020 జులై 31

వెబ్​సైట్​: www.igmhyderabad.spmcil.com

Advertisement

నేషనల్​ బోర్డు ఆఫ్​ ఎగ్జామినేషన్​లో జాబ్స్​

నేషనల్​ బోర్డు ఆఫ్​ ఎగ్గామినేషన్​ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్​ అసిస్టెంట్​, జూనియర్​ అసిస్టెంట్​తో పాటు సీనియర్​ అకౌంటెంట్​, స్టెనోగ్రాఫర్​ పోస్టులు భర్తీ చేయనుంది.
సీనియర్ అసిస్టెంట్ 18 పోస్టులు; డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి
జూనియర్ అసిస్టెంట్ 57 పోస్టులు; ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్స్ పై పని చేయడం తెలిసి
ఉండాలి. విండోస్/ నెట్వర్క్/ లాన్ వంటి ప్రాథమిక అంశాలపై పట్టు ఉండాలి.
సీనియర్ అకౌంటెంట్​ 7 పోస్టులు; కామర్స్ లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ ఆధారిత అకౌంటింగ్ పై అవగాహనకు తోడు
కనీసం మూడేళ్ళ అనుభవం ఉండాలి.
ఆగస్టు 31న నిర్వహించే కంప్యూటర్ ఆధారిత టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్
జనరల్ అవేర్ నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీస్​ కాంప్రహెన్షన్ నుంచి ఒక్కో టాపిక్ లో 50. చొప్పున మొత్తం 200 ప్రశ్నలు వస్తాయి. కాలవ్యవధి మూడు గంటలుఇతర వివరాలుఈ ఏడాది జూలై 31 నాటికి అభ్యర్థి వయస్సు 27 సంవత్సరాలకు లోపు ఉండాలి. పోస్టులన్నీ ప్రస్తుతానికి న్యూఢిల్లీ కార్యాలయంలో ఉన్నాయి. దేశంలో ఎక్కడైనా పనిచేసేందుకు సంసిద్ధులై ఉండాలి, దరఖాస్తు ఫీజు రూ.1500. మహిళలు, ఇడబ్ల్యుఎస్, ఎస్సి, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు రూ.750 జిఎస్టి అదనం. అర్హతలు ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 31లోపు దరఖాస్తు చేసుకోవాలి.పూర్తి వివరాలకు natboard.edu.in

టీఎస్‌పీసీబీలో 4 పోస్టులు

తెలంగాణ స్టేట్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డ్‌(టీఎస్‌పీసీబీ), హైద‌రాబాద్‌.. ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో 4 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​లైన్​ ద్వారా​ ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: లీగ‌ల్ క‌న్సల్టెంట్‌, ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ క‌న్సల్టెంట్‌; అర్హత‌: ఎల్ఎల్‌బీ, బీఈ/బీటెక్‌/ఎంసీఏ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; చివ‌రి తేది: 2020 జులై 24; వివరాలకు: www.tspcb.cgg.gov.in

ప్రసార భార‌తిలో..

న్యూఢిల్లీలోని భార‌త ప్రభ‌త్వ రంగ ప్రసార సంస్థ.. ప్రసార భార‌తి కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 7 కంటెంట్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అర్హత‌: పీజీ డిప్లొమా/ పీజీ ఇన్ జ‌ర్నలిజంతో పాటు ఇంగ్లిష్‌, హిందీలో ప్రొఫిషియ‌న్సీ, కనీసం ఏడాది పని అనుభ‌వం; వ‌య‌సు: 2020 జులై 1 నాటికి 30 ఏళ్లు మించ‌కూడ‌దు; ఫీజు: రూ.500; చివ‌రి తేది: 2020 జులై 20; వివరాలకు: www.prasarbharati.gov.in

Advertisement

నీరీలో 5 ప్రాజెక్ట్ స్టాఫ్​

న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్‌కి చెందిన -నేష‌న‌ల్ ఎన్విరాన్‌మెంట‌ల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌(నీరీ).. 5 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ–మెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు–ఖాళీలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్‌–03, రీసెర్చ్ అసోసియేట్‌–02; అర్హత: సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ఎంసీఏ, ఎంఈ/ఎంటెక్​, పీహెచ్‌డీ ఉత్తీర్ణత‌; సెలెక్షన్​ ప్రాసెస్​: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ/టెస్ట్​ ద్వారా; ఈ–మెయిల్‌: drc@neeri.res.in; చివ‌రి తేది: 2020 జులై 15; వివరాలకు: www.neeri.res.in

ఎన్ఐఆర్‌టీహెచ్‌లో 22 ప్రాజెక్ట్ స్టాఫ్

జ‌బ‌ల్‌పూర్‌లోని ఐసీఎంఆర్‌కి చెందిన -నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ట్రైబ‌ల్ హెల్త్‌(ఎన్ఐఆర్‌టీహెచ్).. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 22 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ–మెయిల్/ఆఫ్‌లైన్‌​లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: సైంటిస్ట్‌ ‘బి’, రీసెర్చ్ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్ టెక్నీషియ‌న్‌, మల్టీ టాస్కింగ్​ స్టాఫ్​, జూనియ‌ర్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, లోవర్​ డివిజన్​ క్లర్క్​, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌; అర్హత:10+2, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: రాత‌ప‌రీక్ష/ఇంట‌ర్వ్యూ ద్వారా; చివ‌రి తేది: 2020 జులై 15; వివరాలకు: www.nirth.res.in

ఐఎస్ఐలో ప్రాజెక్ట్ లింక్డ్​ ప‌ర్సన్స్​

కోల్‌క‌తాలోని ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్ఐ).. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 8 ప్రాజెక్ట్ లింక్డ్​ ప‌ర్సన్స్‌ పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ–మెయిల్​ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అర్హత‌: ఎమ్మెస్సీ, ఎంఈ/ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం. వ‌య‌సు: 2020 జులై 1 నాటికి 35 ఏళ్లు మించ‌కూడ‌దు; సెలెక్షన్​ ప్రాసెస్​: రాత‌ప‌రీక్ష/ ఇంట‌ర్వ్యూ ద్వారా; చివ‌రి తేది: 2020 జులై 20; వివరాలకు: www.isical.ac.in

Advertisement

సీ-డ్యాక్‌, మొహాలీలో..

మొహాలీలోని సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్‌(సీ-డ్యాక్‌).. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 28 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు–ఖాళీలు: ప్రాజెక్ట్ ఇంజినీర్‌–18, ప్రాజెక్ట్ అసోసియేట్‌–07, ప్రాజెక్ట్ మేనేజ‌ర్‌–03; అర్హత‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ఎంసీఏ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం. ఫైనలియర్​లో ఉన్న వారు దరఖాస్తుకు అనర్హులు. సబ్జెక్ట్స్​: సాఫ్ట్​వేర్​ అప్లికేషన్​ డెవలపర్​, సైబర్​ డేటా అనాలసిస్, స్టాటిస్టిక్స్​ అండ్​ డేటా సైన్స్​, నెట్​వర్క్​ సెక్యూరిటీ తదితరాలు; సెలెక్షన్​ ప్రాసెస్​: రాత‌ప‌రీక్ష/ఇంట‌ర్వ్యూ ద్వారా; ఫీజు: జనరల్​/ఓబీసీ మేల్​కు రూ.500, ఫీమేల్​కు రూ.250, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు లేదు. చివ‌రి తేది: 2020 జులై 18; వివరాలకు: www.cdac.in

ఎయిమ్స్‌ భోపాల్‌లో టీచింగ్ స్టాఫ్​

భోపాల్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. 165 ఫ్యాకల్టీ పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు–ఖాళీలు: ప్రొఫెస‌ర్‌–33, అడిష‌న‌ల్ ప్రొఫెస‌ర్–19, అసోసియేట్ ప్రొఫెస‌ర్‌–39, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌–64; విభాగాలు: అనెస్తీషియాల‌జీ, బ‌యోకెమిస్ట్రీ, కార్డియాల‌జీ, డెర్మటాల‌జీ, ఈఎన్​టీ, జ‌న‌ర‌ల్ స‌ర్జరీ, మైక్రోబ‌యాల‌జీ, న్యూరాలజీ, ఆర్థోపేడిక్స్​, సైకియాట్రీ, ట్రామా ఎమ‌ర్జెన్సీ త‌దిత‌రాలు; అర్హత‌: స‌ంబంధిత విభాగాల్లో ఎండీ/ఎంఎస్‌ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా; ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.2000, ఎస్సీ/ఎస్టీలకు రూ.500; చివ‌రి తేది: 2020 ఆగస్ట్​17; వివరాలకు: www.aiimsbhopal.edu.in

ఐపీఆర్‌సీఎల్‌లో 15 ప్రాజెక్ట్ ఇంజినీర్స్

మినిస్ట్రీ ఆఫ్​ షిప్పింగ్​కు చెందిన ఇండియ‌న్ పోర్ట్ రైల్ అండ్ రోప్‌వే కార్పొరేష‌న్ లిమిటెడ్‌(ఐపీఆర్‌సీఎల్‌).. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 15 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ–మెయిల్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు-: ప్రాజెక్ట్ సైట్ ఇంజినీర్‌, ఇంజినీర్‌. విభాగాలు: సివిల్‌, సిగ్నల్ అండ్ టెలీక‌మ్యూనికేష‌న్; అర్హత‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; వయసు: 32 ఏళ్లు మించకూడదు; సెలెక్షన్​ ప్రాసెస్​: అక‌డ‌మిక్ మెరిట్​, గేట్ స్కోర్‌ ఆధారంగా; ఈ–మెయిల్: hr.iprcl@gmail.com; చివ‌రి తేది: 2020 జులై 20; వివరాలకు: www.iprcl.in

Advertisement

ఎన్ఐఐఎస్‌టీలో..

తిరువ‌నంత‌పురంలోని సీఎస్ఐఆర్‌కి చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ఇంట‌ర్‌ డిసిప్లీన‌రీ సైన్స్ అండ్ టెక్నాల‌జీ(ఎన్ఐఐఎస్‌టీ).. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 19 ప్రాజెక్ట్​ స్టాఫ్​ పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: ప్రాజెక్ట్ అసోసియేట్‌, సీనియ‌ర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌, ఫీల్డ్ వ‌ర్కర్‌, జేఆర్ఎఫ్‌(ప్రాజెక్ట్‌); అర్హత‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్​, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ, నెట్‌/గేట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: షార్ట్‌లిస్టింగ్‌, ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వ్యూ ద్వారా; చివ‌రి తేది: 2020 జులై 21; వివరాలకు: www.niist.res.in

జిప్‌మ‌ర్‌లో 64 సీనియ‌ర్ రెసిడెంట్స్

పుదుచ్చేరిలోని జవహర్​లాల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ పోస్ట్​ గ్రాడ్యుయేట్​ మెడికల్​ ఎడ్యుకేషన్​ & రీసెర్చ్​ (జిప్​మర్​)..64 సీనియర్​ రెసిడెంట్​ పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. విభాగాలు: అనెస్తీషియాల‌జీ, బ‌యోకెమిస్ట్రీ, డెర్మటాల‌జీ, ఫోరెన్సిక్ మెడిసిన్‌, జనరల్​ సర్జరీ, నెఫ్రాల‌జీ, న్యూక్లియ‌ర్ మెడిసిన్‌, పీడియాట్రిక్స్, పాథాలజీ, ఫిజియాలజీ తదిత‌రాలు; అర్హత‌: స‌ంబంధిత విభాగాల్లో ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ ఉత్తీర్ణత‌; వయసు: 2020 జులై 31 నాటికి 45 ఏళ్లు మించకూడదు. సెలెక్షన్​ ప్రాసెస్​: ప‌ర్సన‌ల్‌/ వీడియో కాన్ఫరెన్సింగ్ ఇంట‌ర్వ్యూ ద్వారా; ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.500, ఎస్సీ/ఎస్టీలకు రూ.250, దివ్యాంగులకు ఫీజు లేదు. చివ‌రి తేది: 2020 జులై 16; వివరాలకు: www.main.jipmer.edu.in

సాయ్‌, ఢిల్లీలో..

ఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్‌).. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 14 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టు–-ఖాళీలు: సీనియ‌ర్ రిసెర్చ్ ఆఫీస‌ర్‌–4, అథ్లెట్ రిలేష‌న్‌షిప్ ఆఫీస‌ర్‌–5, రిసెర్చ్ ఆఫీస‌ర్‌–5; అర్హత‌: బీఈ/బీటెక్‌/ఎంబీఏ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: ఇంట‌ర్వ్యూ ద్వారా; చివ‌రి తేది: 2020 జులై 20; వివరాలకు: www.sportsauthorityofindia.nic.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!