నిశ్చితార్థానికి రణ్ వీర్ ను పిలిచి దీపికాని పిలవకపోవడానికి కారణమిదేనా?

265

గ్లోబల్ స్టార్, మాజీ ప్రపంచ సుందరి ప్రియాంకా చోప్రా ఎట్టకేలకు తన ప్రియుడు నిక్ జోనాస్ తో పెళ్లికి నిశ్చితార్థం చేసుకుంది. ముంబైలో జరిగిన ఈ ఈవెంట్ కు కేవలం 20 మందిని మాత్రమే ప్రియాంకా ఆహ్వానించింది. వీరిలో బాలీవుడ్ అందాల భామలు.. పరిణితి చోప్రా, అలియాభట్ లతోపాటు ప్రముఖ హీరో రణ్ వీర్ సింగ్, ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ, సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత తదితరులు ఉన్నారు.

అయితే రణ్ వీర్ సింగ్ ని పిలిచిన ప్రియాంకా అతడి ప్రేయసి దీపికా పదుకోణ్ ను పిలవకపోవడంపై గాసిప్పులు గుప్పుమంటున్నాయి. దీపికా, ప్రియాంకా కలసి ‘బాజీరావు మస్తానీ’లో కలిసి నటించారు. అంతేకాకుండా దీపిక హీరోయిన్ గా నటించిన ‘రామ్ లీలా’లో ప్రియాంకా ప్రత్యేక గీతంలో నర్తించింది. వీటితోపాటు ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఒక టీవీ చానెల్లో నిర్వహించే ‘కాఫీ విత్ కరణ్’లోనూ వీరిద్దరూ పాల్గొని సందడి చేశారు.

అలాంటిది దీపికా పదుకోణ్ ను పిలవకపోవడంపై బాలీవుడ్ విస్తుపోయింది. ఇద్దరూ మంచి స్నేహితులే అయినప్పటికీ ప్రొఫెషనల్ జెలసీ వల్లే దీపికాను ప్రియాంకా పిలవలేదనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో దీపికా పదుకోణ్ నెంబర్ వన్ హీరోయిన్. దీపికా ఒక్కో సినిమాకి రూ.14 కోట్లు వసూలు చేస్తుండగా, రెండో స్థానంలో ఉంది.. ప్రియాంకానే. ఈ ముద్దుగుమ్మ ఒక్కో సినిమాకు రూ.12 కోట్లు వసూలు చేస్తూ దీపికా తర్వాతి స్థానంలో నిలుస్తోంది. దీంతోపాటు దీపికా.. ప్రియాంకాలానే హాలీవుడ్ మూవీస్ లోనూ నటిస్తోంది. దీంతో తనకు అన్ని విషయాల్లో పోటీగా ఉన్న దీపికాను నిశ్చితార్థానికి పిలవకుండా ప్రియాంకా అవమానించిందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు రణ్ వీర్ సింగ్ కు ఆహ్వానమున్నప్పటికీ అతడు నిశ్చితార్థానికి హాజరుకాలేదు.