యాత్ర మధ్యలో పవన్ కల్యాణ్ బ్రేక్ ఇస్తోంది అందుకేనా?

360

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తన పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తూ మధ్యలో ఆకస్మాత్తుగా యాత్రకు విరామమిచ్చారు. పవన్ ఇలా మాటిమాటికి మధ్యలో యాత్రకు విరామమిస్తుండటంపై భిన్నకథనాలు వెలువడుతున్నాయి.

ప్రత్యర్థి పార్టీలు పవన్ నాలుగు రోజులు పర్యటిస్తే వారం రోజులు పామ్ హౌస్ లో పడుకుంటాడని, ఆయనలో సీరియస్ నెస్ లేదని, అంతా టైమ్ పాస్ వ్యవహారమని విమర్శలు కురిపిస్తున్నాయి. మరోవైపు పార్టీ కార్యకర్తలు, అభిమానుల్లోనూ అసంతృప్తి నెలకొంటోంది. మధ్యలో యాత్రకు విరామిస్తుండటం వల్ల కార్యకర్తల్లో జోష్ పోతోందని అంటున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా విభాగం శతఘ్ని టీమ్ ఈ విమర్శలపై వివరణ ఇచ్చింది.

పవన్ యాత్రకు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ, ప్రతి నిమిషం పార్టీ కార్యాలయంలోనే గడుపుతున్నారని, పార్టీ నేతలతో్ వివిధ అంశాలపై చర్చిస్తున్నారని వెల్లడించింది. అంతేకాకుండా వచ్చే సాధారణ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రూపకల్పన, పార్టీలో చేరికలు, ఎన్నికల వ్యూహాలు తదితర అంశాలపై పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారని వివరించింది. కాగా, ఒకటి రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి పర్యటన మొదలుకానుంది. ఇప్పటికే భీమవరం తదితర ప్రాంతాల్లో పర్యటించిన పవన్ జిల్లాలో దాదాపు 20 గడపనున్నారు.