మొక్కలతో అందంగా గోడ కడితే.. !

438

ఇటు అందానికి అందం..అటు చూడచక్కని పచ్చదనం. ఖైరతాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌ జోనల్‌ కార్యాలయం ఇప్పుడు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆఫీస్ మెయిన్ గేట్ కు రెండువైపులా.. గోడల నిండా పచ్చని మొక్కలు. అక్కడ అసలు గోడ ఉందా.. పచ్చని మొక్కలతోనే అందమైన గోడను నిర్మించారా.. అనిపించేలా అందంగా తయారు చేశారు.
షేడ్‌ ట్రీస్‌ పేరిట నిండుగా అందమైన మొక్కల్ని పెంచుతున్నారు. ఇవి ఎంతో ఆకర్షణీయంగా ఉండి.. పచ్చదనంతో కళకళలాడుతూ ఆహ్లాదం పంచుతున్నాయి. ఈ మొక్కలకు నీటిని పోసేందుకు ప్రత్యేక డ్రిప్‌ సిస్టం కూడా ఏర్పాటు చేశారు. నిజంగా ఈ అందాలను చూస్తే ’ఇది ప్రభుత్వ కార్యాలయమా…నర్సరీ కేంద్రమా..’ అని ఆశ్చర్యపోవటం ఖాయం.