బ్లూ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

832

మనందరికీ గ్రీన్ టీ, బ్లాక్ టీ తెలుసు కానీ బ్లూ టీ గురించి తెలియదు కదా! ఈ బ్లూ టీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ ఆహారం తీసుకోవడానికి మధ్య సమయంలో బ్లూ టీ తాగితే అతి తక్కు వ ఖర్చుతోనే ఎక్కువ ప్రయోజనాలు పొందొచ్చని చెబుతున్నారు. మరి బ్లూ టీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా?

యాంటిఆక్సిడెంట్స్: బ్లూ టీ తాగడం వల్ల శరీరానికి ఎన్నో యాంటిఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి వృద్ధాప్యాన్ని కలిగించే రాడికల్స్ పై పోరాడి మనం నిత్యం యవ్వనంతో ఉండేలా చేస్తాయి.

యాంటీడయాబెటిక్: భోజనం చేసే సమయాల మధ్య కఫ్ బ్లూ టీ తాగితే శరీరంలో ఎక్కువ గ్లూకోజ్ విడుదల కాకుండా చేస్తుంది. తద్వారా షుగర్ బారినపడకుండా ఉండొచ్చు. అంతేకాకుండా లో బ్లడ్ షుగర్ రాకుండా కూడా బ్లూ టీ నివారిస్తుంది. ఇన్ ఫెక్షన్లు రాకుండా నివారించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతుంది. క్యాన్సర్ రాకుండా చేయడంలోనూ దీని పాత్ర అద్భుతమని తేలింది. టైప్-2 డయాబెటీస్ రాకుండా కూడా బ్లూ టీ చేస్తుంది.

చర్మానికి, వెంట్రుకలకు ఎంతో మేలు: రోజూ బ్లూ టీ తాగడం వల్ల చర్మం నునుపుదనం సంతరించుకుంటుంది. టీ లో ఉండే విటమిన్లు, మినరల్స్ వెంట్రుకలను, చర్మాన్ని మంచిగా ఉండేలా చేస్తాయి. అంతేకాకుండా వయసు ప్రభావంతో వచ్చే సమస్యలను అరికడుతుంది.

మెదడుకు చురుకుదనం: బ్లూ టీ మెదడు చురుకుదనాన్ని పెంచి మెదడు పనితీరు సరిగా ఉండేలా చేస్తుంది. నిపుణుల అధ్యయనం ప్రకారం.. ఆందోళనను, డిప్రెషన్ ను, ఒత్తిడిని దూరం చేస్తుంది. ఎనర్జీని అందించి గొప్ప అనుభూతి (ఫీలింగ్)తో ఉండేలా చేస్తుంది.

అదిరిపోయే అందం కావాలంటే బ్లూ టీ తాగాల్సిందే: ఇక అందరూ కోరుకునే అద్భుతమైన అందం సొంతం చేసుకోవాలంటే.. అందరూ బ్లూ టీ తాగాల్సిందే. రక్త ప్రసరణను పెంచి సాఫీగా జరిగేలా చేయడం, వయసులో ఉండగానే వచ్చే అవాంఛిత వృద్ధాప్యాన్ని అరికట్టడం, చర్మాన్ని, వెంట్రుకలను నునుపుగా చేయడం వంటి ఎన్నో ప్రయోజనాలు బ్లూ టీ లో ఉన్నాయి. మరిఇంకెందుకాలస్యం బ్లూ టీ తాగేయండి..!