ఫలించని వైవిద్య ప్రయత్నాలు!

1363
  • ప్రతీకారంలోనూ లోపించిన కొత్తదనం!

  • నాగచైతన్య ‘యుద్ధం శరణం’ సమీక్ష

గత చిత్రాలకు భిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల్ని మెప్పించాలనుకోవడం నటీనటులకు పరిపాటే. కానీ, అన్ని సమయాల్లోనూ ఆ ప్రయత్నాలు ఆశించిన ఫలితాల్ని ఇచ్చిన దాఖలాలు మాత్రం లేవు. నాటితరం సీనియర్ నటులు నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు దగ్గర నుంచి నేటి తరం కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేశ్‌బాబు, వెంకటేష్ వంటి వారి వరకూ అందరూ విభిన్న కథాంశంతో తమ అభిమానుల్ని అలరించాలనుకున్నవారే. కానీ, వారి ప్రయత్నాలు చాలా సందర్భాలలో విఫలయత్నాలుగానే మిగిలాయన్నది జగమెరిగిన సత్యం.

ఎన్టీఆర్ చాలా గ్యాప్ తర్వాత చేసిన ‘మేజర్ చంద్రకాంత్’, అక్కినేని నాగేశ్వరరావు చేసిన ‘మనం’, కృష్ణ చేసిన ‘ఎన్‌కౌంటర్’, కృష్ణంరాజు అలరించిన ‘రెబల్’, శోభన్‌బాబు ‘ఆయనకు ఇద్దరు’తో పాటు వారి వారసులుగా చెప్పుకొంటున్న చిరంజీవి ‘ఖైదీ నం. 150’, బాలకృష్ణ ‘సింహా’, నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయన’, వెంకటేష్ ‘గురు’, మహేష్‌బాబు ‘దూకుడు’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాత్మకమయ్యాయి. ఈ క్రమంలో వారిలాగే గత రికార్డులను బద్దలు కొడదామనే ప్రయత్నాలు చేసిన చాలా మంది వర్ధమాన హీరోల చిత్రాలు బొక్కబోర్లా పడ్డాయి.

తాజాగా అక్కినేని నట వారసుల్లో ఒకరైన నాగచైతన్య శ్రీకాంత్‌తో కలిసి చేసిన ప్రయోగం కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ‘వారాహి చలనచిత్రం’ అంటే తెలుగు ఇండస్ట్రీలో మంచి సినిమాలను అందించే సంస్థగా గుర్తింపు ఉంది. అలాగే నాగచైతన్య ఇప్పుడున్న హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకొని ముందుకుపోతున్నాడు. మరోవైపు, శ్రీకాంత్ చాలా ఏళ్ల తర్వాత హీరో నుంచి విలన్‌గా యూ టర్న్ తీసుకొని చేసిన చిత్రం ‘యుద్ధం శరణం’. మరి ఇన్ని ప్రత్యేకతల మధ్య శుక్రవారం విడుదల అయిన ఈ సినిమా ఎలా ఉందో? అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

అర్జున్ (నాగ చైతన్య)కు తన అమ్మ సీత (రేవతి), నాన్న మురళీకృష్ణ (రావు రమేష్), ప్రియురాలు అంజలి (లావణ్య త్రిపాఠి) అక్క, భావ, చెల్లి ప్రపంచం. తన ప్రపంచంలో ప్రేమించిన అమ్మాయితో, ప్రేమని పంచే అమ్మ నాన్నలతో సంతోషంగా ఉంటూ మరోవైపు, తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ని పూర్తి చేసుకునే పనిలో ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతనిది ఒక హ్యాపీ ఫ్యామిలీ. అలాంటి తన జీవితంలో అనుకోకుండా అర్జున్ అమ్మ, నాన్న చనిపోతారు.

అయితే వారి చావుకి నాయక్ (శ్రీకాంత్) అనే ఒక రౌడీ కారణం అని అర్జున్‌కి తెలుస్తుంది. అయితే, నాయక్, అర్జున్ అమ్మ, నాన్నని ఎందుకు చంపాడు? ఆ విషయం అర్జున్‌కి ఎలా తెలుస్తుంది? తన అమ్మ, నాన్న చావుకి కారణం అయిన నాయక్ మీద అర్జున్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది సినిమా చూస్తే అర్ధమవుతుంది. హ్యాపీగా సాగిపోతున్న ఒక మామూలు కుర్రాడి ఫ్యామిలీ లైఫ్‌లోకి సంబంధం లేకుండా ఒక రౌడీ ఎంటర్ అయ్యి మొత్తం వారి సంతోషాన్ని దూరం చేస్తే, ఆ కుర్రాడు ఎలా రియాక్ట్ అయ్యాడు అనే విషయాన్ని దర్శకుడు ఎంచుకొని చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది.

కాకపోతే, మొదటి అర్ధ భాగంలో వచ్చే ఫ్యామిలీ అనుబంధం, వారి మధ్య చిన్న చిన్న ఎమోషన్స్ ప్రెజెంట్ చేస్తూ కొంత ఆకట్టుకునే విధంగా దర్శకుడు నడిపించినా రెండో భాగంలో ఎందుకో గానీ, కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. అలాగే ఇంటర్వెల్‌లో ఇచ్చే ట్విస్ట్ కూడా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తూ సెకండ్ హాఫ్ మీద చాలా హైప్ క్రియేట్ చేస్తుంది. కథలో భాగంగా వచ్చే ఎమోషన్స్‌తో ఫస్ట్ హాఫ్‌లో పండించిన వినోదం కూడా ప్రేక్షకులకి భాగా కనెక్టవుతుంది. ఇక చాలా ఏళ్ల తర్వాత శ్రీకాంత్ చేసిన విలన్ పాత్ర సినిమాలో మేజర్ హైలెట్. అతను తన కళ్ళతో విలనిజాన్ని చూపిస్తూ చేసిన నాయక్ పాత్ర ఆకట్టుకుంది.

ఇక నాగ చైతన్య పాత్ర చూసుకుంటే సింపుల్ అండ్ స్వీట్ లైఫ్‌తో హ్యాపీగా వెళ్ళిపోయే యువకుడుగా, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వారి చావుకి కారణం అయిన వాడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి, తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి అతనితో యుద్ధం చేయడానికి సిద్ధమైన కొడుకుగా రెండు రకాల ఎమోషన్స్‌ని బాగా చూపించాడు. ఇక హీరోయిన్‌గా లావణ్య పర్వాలేదనిపించుకుంది. ఇక సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా మురళీశర్మ ఎప్పటిలాగే ఆకట్టుకున్నాడు. మిగిలిన వారు కూడా ఎవరి పాత్ర పరిధి మేరకు వారు భాగానే చేశారు.

అయితే, సినిమాలో ప్రధాన లోపం ఎమోషన్‌ లోపించడం. మొదటి అర్ధ భాగం చూసిన తర్వాత ప్రేక్షకులు చాలా ఎక్స్పక్టేషన్ పెట్టుకుంటారు. సెకండ్ హాఫ్ ఇంకా గొప్పగా, మైండ్ గేమ్ అద్బుతంగా ఉంటుందని ఆశిస్తారు. అయితే, ఈ విషయంలో దర్శకుడు తడబాటు పడ్డారు. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకునే ఒక పెద్ద రౌడీని చాలా ఈజీగా హీరో ట్రాప్ చేసేయడం అంత కన్విన్సింగ్‌గా అనిపించదు. ఇంటెలిజెంట్ గేమ్ అని చూపిస్తూ స్క్రీన్ ప్లేలో ఏదో చేయడానికి ట్రై చేసినా, అది కథని కన్విన్స్ చేయడానికి చేసినట్లు ఉంది తప్ప ప్రేక్షకుడుని కన్విన్స్ చేసే విధంగా మాత్రం లేదు.

తల్లిదండ్రులు చనిపోతే హీరో పడే ఒక మానసిక సంఘర్షణని ఎలివేట్ చేయడంలో దర్శకుడు ఎంచుకున్న కథనం చాలా సింపుల్‌గా ఉంటుంది. ఆడియన్స్ కోరుకునే పోరాటం సెకండ్ హాఫ్‌లో కనిపించకపోవడం కాస్త నిరాశపరుస్తుంది. మంచి కథని ప్రెజెంట్ చేయడంలో స్క్రీన్ ప్లేలో చేసిన పొరపాటు సెకండ్ హాఫ్‌ని పూర్తిగా కిందకి దించేస్తుంది. వారాహి సంస్థ ఎప్పటిలాగే తన నిర్మాణ విలువలతో ఆకట్టుకుంది. అయితే, దర్శకుడు కృష్ణ ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషన్స్ మీద నడిపిస్తూ ఆకట్టుకున్నాడు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్స్ కంటే ఇంటలిజెన్స్ ముఖ్యం.

అందులో దర్శకుడు సరైన పనితనం చూపించలేకపోయారు. ఒక పెద్ద రౌడీ, ఒక మామూలు కుర్రాడు మధ్య కథ నడిపించే ఇంటెలిజెంట్ గేమ్ చాలా ఇంటెన్సిటీతో ఉండాలని ఆడియన్స్ కోరుకుంటారు. అందులో దర్శకుడు అనుభవలేమి కొట్టోచ్చినట్లు కనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ పాటల్లో క్లాసిక్ టచ్ చూపించి, అతని భవిష్యత్తుకి స్ట్రాంగ్ పిల్లర్ వేసుకున్నాడు. ఇక బ్యాగ్రౌండ్ కూడా కొన్ని ఎమోషన్స్‌లో తప్ప ఓవరాల్ పర్వాలేదు. ఇక సినిమాటోగ్రఫీ భాగానే ఉంది. ఎడిటింగ్‌లో పెద్దగా పని చెప్పడానికి ఏమీ లేదు. స్క్రీన్ ప్లే మ్యాజిక్ కోసం కొన్ని అనవసరమైన సన్నివేశాలు పెట్టారు.

వాటికీ కత్తెర వేసుండాల్సింది. మొత్తానికి చెప్పాలంటే, ప్రేమ‌క‌థ‌ల్లోనే ఎక్కువ‌గా క‌నిపించిన నాగ‌చైత‌న్య ఈమ‌ధ్య వైవిధ్యం చూపించే ప్ర‌య‌త్నం చేస్తూ వస్తున్నారు. త‌న శైలి క‌థ‌ల్లోనే యాక్ష‌న్‌పాళ్లు ఉండేలా చూసుకొంటున్నారు. మాస్ ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డంలో భాగ‌మే అది. ఆ త‌ర‌హా క‌థ‌ల్లో ఆయ‌న చ‌క్క‌గా ఒదిగిపోతాడ‌ని కూడా ప‌లు చిత్రాలు నిరూపించాయి. ఈ ఏడాది ఇప్ప‌టికే ‘రారండోయ్ వేడుక‌చూద్దాం’తో సంద‌డి చేసిన నాగ‌చైత‌న్య ‘యుద్ధం శ‌ర‌ణం’ అంటూ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్ర దీన్ని తెర‌కెక్కించ‌డం, ప్ర‌చార చిత్రాలు గాఢ‌తతో కూడుకొని ఉండ‌టంతో సినిమాపై ముందస్తు అంచ‌నాలు పెరిగాయి. ఒక్కముక్కలో చెప్పాల్సి వస్తే, కథనం ప్రధానంగా సాగే చిత్రమిది.

ఒక సస్పెన్స్‌ ఎలిమెంట్‌ కథ మొత్తాన్నీ ముందుకు నడిపిస్తుంది. అనుకోకుండా తల్లిదండ్రులు దూరమయ్యాక ఓ యువకుడి జీవితంలో ఎదురైన సంఘర్షణ ఎలాంటిది? తన కుటుంబం కోసం అతను ఏం చేయాల్సి వస్తుంది? అనే విషయాలతో ఈ సినిమా సాగుతుంది. తొలి సగభాగం అందమైన కుటుంబం, నాయకనాయికల ప్రేమ చుట్టూ నడుస్తుంది. ద్వితీయార్ధంలో అందుకు పూర్తి భిన్నంగా ప్రతీకార నేపథ్యం తెరపై కనిపిస్తుంది. ఈ చిత్ర కథ, కొన్ని సన్నివేశాలు ఇదివరకు నాగచైతన్య నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ను గుర్తు చేస్తాయి. కాకపోతే కథానాయకుడు ఇందులో తన కుటుంబం కోసం పోరాటం చేస్తాడు. సన్నివేశాలను విభిన్నమైన కథనంతో తీర్చిదిద్దినప్పటికీ ప్రేక్షకుడి వూహకు అందేలా ఉంటాయి.

బహుశా దర్శకుడు చెప్పిన కథనమే చైతూని ఆకట్టుకుని ఈ సినిమా చేసేలా ప్రోత్సహించి ఉంటుంది. ప్రతినాయకుడు నాయక్‌ పాత్రలో శ్రీకాంత్‌ కనిపించిన విధానం, ఆయన నటన బాగుంది. కానీ, ఆ పాత్రను మరింత సమర్థంగా, బలంగా తీర్చిదిద్దాల్సింది. సాంకేతికంగా ఈ సినిమా పర్వాలేదు. ఛాయాగ్రహణం కథకు తగ్గట్టుగా కుదిరింది. వివేక్‌ సాగర్‌ నేపథ్య సంగీతం బాగున్నా, పాటలు గుర్తుండిపోయేలా లేవు. తన తొలి చిత్రమే అయినా దర్శకుడు మారిముత్తు ఎంతో పరిణతితో రాసుకున్న కథను తెరపైకి తీసుకొచ్చాడు. కథపై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

వారాహి సంస్థ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక, చివరిగా ఇప్పుడున్న యువ హీరోల్లో స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి వచ్చి కాస్త కొత్తదనం ఉన్న పాత్రలు చేయడానికి ఎప్పుడూ ఆసక్తి చూపే చైతూ కెరీర్లో ఈ సినిమా మరో డిఫరెంట్ సినిమా అవుతుంది. నటన పరంగా అతను మెప్పించాడు. ఇక, శ్రీకాంత్ విలన్‌గా ఒకే అనిపించుకున్నా ఇది అతనికి ఎంత వరకు ప్లస్ అవుతుందో చెప్పలేం. ఫస్ట్ హాఫ్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఆద్యంత ఆకట్టుకున్నా, అసలైన హీరో, విలన్ రివెంజ్ డ్రామాలో అనుకున్నంత స్థాయ తీవ్రత లేక రొటీన్ రివెంజ్ డ్రామాగా సినిమా మిగిలింది.

అలాగే కథలో లవ్ స్టొరీ, కామెడీకి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒక మామూలు కుర్రాడికి, పెద్ద రౌడీకి మధ్య పోరాటం అనే పాయింట్ బాగుంది కానీ ఆ ప్రయత్నం ఇంకా బెటర్‌గా చేసుంటే బాగుండేది. అంటే యుద్ధం బాగున్నా దానికి వేసిన వ్యూహం వీక్‌గా ఉంది. మొత్తంగా చెప్పాలంటే రివెంజ్ డ్రామాలను ఎక్కువగా ఇష్టపడేవారికి ఈ సినిమా ఓకే కానీ కొత్తదనం ఆశించేవారికి ఎంజాయ్ చేయడానికి ఇందులో పెద్దగా ఏం దొరకదు.