టర్మరిక్ (పసుపు) టీతో కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?

794

మన ఇంటి వంటగదే మనకు ఔషధాల నిలయమని చెప్పొచ్చు. వంట గది పోపుల డబ్బాలో ఉండే ప్రతి ఒక్కటీ ఔషధ గుణాలు కలిగిందే. దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఆవాలు, యాళుకులు ఇలా ప్రతి ఒక్కటీ ఔషధమే. అలాగే వీటన్నింటికంటే మించి పసుపుతో కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కూరల్లో చిటికెడు పసుపు వేస్తే సూక్ష్మజీవులను చంపడంతోపాటు రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోగ నిరోధక శక్తి క్షీణించి వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆహార పదార్థాల్లో పసుపును వాడితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు. ఇక టర్మరిక్ (పసుపు టీ) తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని, బరువును తగ్గించడంలో టర్మరిక్ టీ క్రియాశీలకంగా పనిచేస్తుందని పేర్కొంటున్నారు. టర్మరిక్ టీలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని చెబుతున్నారు. క్యాన్సర్ రాకుండా నివారించడంలో టర్మరిక్ టీ అద్భుతంగా పనిచేస్తుందని అంటున్నారు. ద నేషనల్ క్యాన్సర్ ఇన్సిట్యూట్ అధ్యయనంలో కూడా టర్మరిక్ టీ ఔషధ గుణాలు వల్లడయ్యాయి.

టర్మరిక్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇనప్లమేటరీ ప్రాపర్టీస్ క్యాన్సర్ ను సమర్థంగా ఎదుర్కొంటాయి. అంతేకాకుండా బరువును తగ్గించడంలోనూ, ఫ్యాట్ టిష్యూలను అరికట్టడంలో టర్మరిక్ టీ పనిచేస్తుంది. రెగ్యులర్ గా టర్మరిక్ టీ తాగుతూ ఉంటే శరీరంలో చెడ్డ కొవ్వును పెంచే కణాలు నశిస్తాయి. తద్వారా మనం బరువు తగ్గడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.