ఈ యాప్స్ తో ఎంచక్కా డేటింగ్ చేసేయండి!

712

యువతీయువకులు తమకు నచ్చిన భాగస్వామి కోసం, పెళ్లైనవారు కొత్తదనం కోసం తమకు నచ్చినతోడు కోసం వెతుకులాటలో ఉంటున్నారు. దీనికోసం వారు వివిధ అడల్డ్ ఫ్రెండ్ వెబ్ సైట్లపైన, వివిధ డేటింగ్ యాప్స్ పైన ఆధారపడుతున్నారు. తాజాగా ఒక సర్వే సంస్థ మన దేశంలో టాప్ డేటింగ్ యాప్స్ ను ప్రకటించింది. వీటి ద్వారా మీకు నచ్చిన భాగస్వామిని వెతుక్కోవచ్చు.

టిండర్: ప్రస్తుతం డేటింగ్ యాప్స్ లో యూజర్ల నుంచి దీనికి మంచి ఆదరణ ఉంది. విశ్వసనీయమైన, మీ ఆలోచనలకు తగిన భాగస్వామిని ఈ యాప్ మీకు వెతికిపెడుతుంది. మీకు నచ్చిన వ్యక్తిని ఎంపిక చేసుకుని వారితో మీ ఆలోచనలు పంచుకుని భవిష్యత్ లో వారితో కలసి సాగడానికి ఈ యాప్ మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది.

హింగ్: టిండర్ తర్వాత బెస్ట్ డేటింగ్ యాప్.. హింగ్. ఫేస్ బుక్ తో అకౌంట్ ద్వారా హింగ్ యాప్ లోకి లాగిన్ కావాలి. మీ ఆలోచనలు, ఆస్తకుల మాదిరిగానే ఉన్న గర్ల్ ఫ్రెండ్స్/బాయ్ ఫ్రెండ్స్ ను ఈ యాప్ వెతికిపెడుతుంది. మీ గురించి మీరు చెప్పుకోవడానికి, భాగస్వాములతో చాట్ చేయడానికి ఈ యాప్ చక్కగా ఉపయోగపడుతుంది.

హ్యాపెన్: టిండర్, హింగ్ తర్వాత చెప్పుకోదగిన డేటింగ్ యాప్.. హ్యాపెన్. జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుంది. తద్వారా మీకు దగ్గరలో ఉన్నవారి వివరాలను మీకు అందిస్తుంది. చాటింగ్ చేయడం, ఫొటోలు, వీడియోలు పంపుకోవడం ద్వారా వారితో మీరు కనెక్ట్ కావచ్చు. తద్వారా మీకు నచ్చిన భాగస్వామిని ఎంచుకుని ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని కూడా ఫేస్ బుక్ అకౌంట్ తో లాగిన్ కావచ్చు.

బంబల్: ప్రత్యేకంగా యవతులు, మహిళల కోసం ఏర్పాటైన డేటింగ్ యాప్. ఇందులోకి ప్రవేశించి యువతులు, మహిళలు తమకు నచ్చిన భాయ్ ప్రెండ్ ను ఎంచుకుని, ఒకరి ఆసక్తులు మరొకరితో కలిస్తే భవిష్యత్ లో వారితో కలసి ముందుకుసాగొచ్చు. ఆండ్రాయిడ్, యాపిల్ ఐవోఎస్ ఫ్లాట్పామ్ లపై ఇది పనిచేస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 27 మిలియన్ల మంది ఈ యాప్ ను వినియోగిస్తున్నారు.

ఓకేకుపిడ్: ఫేస్ బుక్ అకౌంట్ తో సంబంధం లేకుండా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా ఈ యాప్ లోకి లాగిన్ కావచ్చు. మనమిచ్చిన ప్రశ్నల ఆధారంగా మనకు సూటయ్యే భాగస్వామిని ఈ యాప్ వెతికిపెడుతుంది. ప్రపంచ ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు ఓకేకుపిడ్ వెబ్ సైట్ ను రూపొందించారు.