చూడాలనిపించే టాప్ 5 మిస్టరీస్

718

దేశంలో కొన్ని ప్రదేశాలు ఇప్పటికీ మిస్టరీనే తలపిస్తాయి. నమ్మకాలు, ప్రజల విశ్వాసాలు, సైన్స్ కు అందని మిస్టరీలు  ఎన్నో ఉన్నాయి.  కొన్ని వింతలు, విశేషాలు ప్రపంచాన్ని సైతం అబ్బుర పరుస్తున్నాయి. కొన్నింటి వెనుక నిజానిజాలు, రహస్యాలను చేధించడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. వీటిలో కొన్నింటిని తెలుసుకుందాం

లేపాక్షిలో వేలాడే స్తంభం:
లేపాక్షి ఆంధ్రప్రదేశ్‌లో చారిత్రక ప్రదేశం, శివునికి అంకితం చేయబడిన ఈ దేవాలయం దేశంలో రహస్యమైన స్థలాలలో ఒకటి. 16వ శతాబ్దంలో నిర్మించిన వీరభద్ర స్వామి దేవాలయం ఇక్కడే కుర్మా సైలా (తాబేలు ఆకారపు శిఖరం) అనే కొండపై ఉంది. ఈ ఆలయంలోని పెద్ద నంది ఏకశిలతో చెక్కి ఉంటుంది. ఈ ఆలయం ప్రశాంతతకు పవిత్రతకు ప్రతీక. ఆలయం పైకప్పుతో పాటు, భారీ డాన్స్‌ హాల్‌కు సపోర్ట్‌గా స్తంభాలు ఉపయోగించారు. ప్రతి స్తంభంపై అప్పటి శాసనాలున్నాయి.
ఇక్కడున్న 70 స్తంభాల్లో ఒక మూలన ఉన్నదే వేలాడే స్తంభం. ఇదే హ్యాంగింగ్‌ పిల్లర్‌. పైనా కింద సపోర్ట్‌ లేకపోవటం.. గాల్లో వేలాడినట్లు ఉన్నందుకే దీనికీ పేరు వచ్చింది. 1910లో బ్రిటిష్‌ ఇంజనీర్‌ హామిల్టన్‌ ఈ పిల్లర్‌ ను సరిచేయడానికి ప్రయత్నించాడు. కాని సాధ్యం కాలేదు. ప్రజలు ఈ ఆలయానికి వచ్చి స్తంభం కింద నుంచి వస్తువులను పాస్‌ చేస్తారు, అది తమకు మేలు చేస్తుందని ప్రజల విశ్వాసం.

తలకాడ్‌ మినీ డెజర్ట్‌ , కర్ణాటక:
కావేరి నది ఒడ్డున ఉన్న తలకాడ్‌ మైసూర్‌ జిల్లాలో ఒక మిస్టరీ ప్లేస్‌. తలకాడ్‌ బెంగుళూరుకు 180 కిలోమీటర్లు, మైసూర్‌ నుంచి∙45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 30 ఆలయాల సముదాయం. ప్రధానంగా తలకాడ్‌ అయిదు శివాలయాలకు ప్రసిద్ధి. మిగిలిన ఆలయాలు ఇసుక కింద పూడుకుపోయాయట. అయిదు ప్రధాన ఆలయాలను దర్శించుకునే అవకాశం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ ఆలయాల్లో ఉన్న అయిదు లింగాలు అయిదు వేర్వేరు ముఖాలు, అవతారాలున్న శివుణ్ని సూచిస్తాయి. తలకాడ్‌ ను చారిత్రక ప్రదేశంగా అభివర్ణిస్తారు. దీన్నే మినీ డెసర్ట్‌ అని పిలుస్తారు. ఇక్కడి దేవాలయాలన్నీ సగభాగం ఇసుకతో కప్పి ఉండటంతోనే ఆ పేరు వచ్చింది. 16 వ శతాబ్దంలో వితంతువు, శివభక్తురాలు అల్లేమలమ్మ శాపంతో ఈ ప్రాంతం ఎడారిగా మారిందనే పురాణ చరిత్ర ప్రచారంలో ఉంది. కానీ రుజువులేమీ లేవు. అందుకే ఇదో వింత ఎడారి. ఇక్కడే కావేరి నది సుడిగాలి (ఠీజిజీట ఞౌౌ ) గా మారుతుంది.

కవలల గ్రామం, కోడిన్హి కేరళ:                                                                                        కేరళలోని ఒక మారుమూల గ్రామం కోడిన్హి. ఇది కూడా దేశంలోని మిస్టరీ ప్లేస్‌. ఈ గ్రామాన్ని ‘విలేజ్‌ ఆఫ్‌ ట్విన్స్‌’ అని పిలుస్తారు. మలప్పురం నుంచి ఈ గ్రామం 15 మైళ్ళ దూరంలో ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధికంగా కవలల జనన రేటు ఇక్కడే ఉంది. ఏటా ఇక్కడ జన్మించే కవలల సంఖ్య అసాధారణంగా పెరుగుతోంది. దాదాపు రెండు వేల మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 204 జతల కవలలు ఉన్నారు, ప్రతి ఏడాది సగటున 15 జంటలు జన్మిస్తున్నారు. ఇక్కడి ప్రతి వెయ్యి మందిలో 45 మంది కవలలు. దేశంలో సగటున ప్రతి వెయ్యి మందిలో నలుగురే కవలలు ఉన్నారు. ఈ గ్రామంలో కవలలెందుకు ఎక్కువగా ఉన్నారనే విషయంపై ఇప్పటికే పరిశోధనలు జరిగాయి. కానీ కారణం కనుక్కోలేదు. 1949 నుంచే కవలలు జన్మించడం మొదలైందని గ్రామస్తుల అభిప్రాయం. కోడిన్హి గ్రామ పురుషులు ఇతర ప్రాంతాల నుంచి పెళ్లి చేసుకున్న స్త్రీలతో పాటు.. ఇతర గ్రామాల పురుషులను పెళ్లి చేసుకున్న కోడిన్హి గ్రామ స్త్రీలు ఇద్దరిలోనూ కవలలు జన్మించే రేట్‌ ఎక్కువగానే ఉంది. ఈ రహస్యాన్ని విప్పేందకు వైద్యులు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించలేదు. మీరు ఈ గ్రామంలో అడుగు పెడితే ఎక్కడ చూసినా ట్విన్స్‌ కనిపిస్తారు. రెండు కుటుంబాల్లో ట్రిప్లేట్స్‌ కూడా ఉన్నారు.

బుల్లెట్‌ బాబా టెంపుల్, బండాయి, రాజస్థాన్‌
ఇక్కడ బుల్లెట్‌ బాబా అంటే దేవుడి గా మారిన మనిషి కాదండి. ప్రజలు ఇక్కడ దేవుళ్ళను మరియు దేవతల యొక్క సాధారణ శిల్పాలను ఆరాధించరు. వారు పూజించేది, ఒక మోటార్‌ సైకిల్‌ ను. మీరు విన్నది నిజమే. దీనిని ఓం బన్నా మరియు బుల్లెట్‌ బన్నా అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని జోధ్పూర్‌ సమీపంలోని పాలి జిల్లాలో ఉన్న ఒక మోటార్‌ సైకిల్‌ విగ్రహం. ఇది పాలి నుండి 20 కిలోమీటర్లు (12 మైళ్ళు) మరియు జోడిఫోర్‌ నుండి పాలి–జోధ్‌ పూర్‌ రహదారిపై చోటిల గ్రామానికి సమీపంలో 50 కిలోమీటర్లు (31 మైళ్ళు) దూరంలో ఉంది. మోటార్‌ సైకిల్‌ మోడల్‌ 350 సీసీ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ ఖNఒ 7773. ఒక మోటార్‌ సైకిల్‌ కు పూజలు చేయడమేంటీ అని ఆలోచనలో పడ్డారా..? రాజస్థాన్‌ రాష్ట్రం బండాయిలో ఉన్న ఓం బన్న బుల్లెట్‌ బాబా పుణ్యక్షేత్రం కూడా మిస్టరీ ప్లేస్‌. ఇది తమను కాపాడుతోందని ప్రయాణీకుల నమ్మకం. స్థానికుల విశ్వాసం. 1991 డిసెంబరు 2న… ఓం బన్న అసలు పేరు ఓం సింగ్‌ రాథోడ్‌. పాలీ నుంచి బాంగ్డి పట్టణానికి ఇదే మోటారుసైకిల్‌పై ప్రయాణిస్తూ చెట్టుకు గుద్దుకొని చనిపోయారు. మోటార్‌ బైక్‌ అతనికి దగ్గరలోనే పడిపోయిందట. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు బైక్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లారు. మరుసటి రోజు ఆ మోటార్‌ బైక్‌ అదృశ్యమైంది. మళ్లీ ప్రమాదం జరిగిన చోటే దొరికింది. ఈసారి పోలీసులు అందులో ఉన్న పెట్రోల్‌ను తీసేసి.. లాక్‌ వేసి స్టేషన్‌ దగ్గర చైన్‌తో కట్టేశారు. అయినా ఫలితం లేదు. మళ్లీ బైక్‌ మిస్సింగ్‌. అదే ప్రమాద స్థలంలో ప్రత్యక్షం. దీంతో స్థానికులు ఇదొక అద్భుతంగా గుర్తించారు. అప్పట్నుంచీ ‘బుల్లెట్‌ బైక్‌‘ ను ఆరాధించడం మొదలైంది. అక్కడే ఒక ఆలయాన్ని నిర్మించారు. ఇదే బుల్లెట్‌ బాబా టెంపుల్, ఇక్కడి గ్రామస్తులు, అటుగా వెళ్లే ప్రయాణికులు ప్రతి రోజు బైక్‌ను, బైక్‌ యజమాని ఓం సింగ్‌ రాథోడ్‌ ను పూజించి తమకు మంచి జరగాలని ప్రార్థిస్తారు. ఇక్కడ ప్రార్థన చేయకుండా వేళ్లే ప్రయాణికులు ప్రమాదానికి గురవుతారనేది స్థానికుల నమ్మకం.

ఫ్లోటింగ్‌ స్టోన్స్, రామేశ్వరం, తమిళనాడు:
తమిళనాడులోని రామేశ్వరం హిందూ పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం. రామాయణం ప్రకారం, శ్రీలంకకు వెళ్లేందుకు శ్రీరామునికి సహకరించిన వానర సేన ఇక్కడే నీటిపై తేలే రాళ్ల వంతెనను నిర్మించింది. ఈ రాళ్ళ పైన రాముడు పేరు రాసి ఉంటుంది. ఇది కేవలం పురాణ కథ కాదు. నిజానికి రాళ్ళతో తయారు చేసిన వంతెన ఆనవాళ్లు ఇప్పటికీ అక్కడ కనిపిస్తాయి. రామేశ్వరంలో ఈ వంతెన పర్యాటకులకు స్పెషల్‌ అట్రాక్షన్‌. చిన్న బరువున్న రాయి కూడా నీటిలో ముసిగిపోతుంది. కానీ రామేశ్వరంలో ఎంత బరువున్న రాయి అయినా నీటిలో తేలుతుంది. అందుకే ‘ఫ్లోటింగ్‌ స్టోన్స్‌’ అంటారు. ఇప్పటికీ నీళ్లపై తేలియాడుతూనే ఉన్నాయి. వీటిలో కొన్ని రాళ్ళు సునామీ వచ్చినప్పుడు చెల్లాచెదురయ్యాయి. ఈ రాళ్లన్నీ ఇతర రాళ్ల తరహాలోనే భౌతిక మరియు రసాయన స్వభావాన్ని కలిగున్నాయని ఖగోళ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలిపోయింది. కానీ.. ఎందుకు నీటిపై తేలుతున్నాయనేది ఇప్పటికీ మిస్టరీనే.