పోలీసులను ఆటాడించిన లేడీ రౌడి.. చివరకు వారి గన్ కు బలైంది..! (వీడియో)

1344

అమెరికాలో నేరస్థులను పట్టుకునేందుకు యూనిఫాంలోనే కెమెరాలను పెట్టుకుని కొన్ని దాడులకు వెళ్తుంటారు. సంఘటనలో అసలు ఏం జరుగుతుంది అన్న విషయాన్ని ఆ కెమెరాలు షూట్ చేస్తాయి. ఇక ఇదే విధానంతో ఓ లేడీ రౌడిని పోలీసులు పట్టుకునేందుకు వెళ్లి ఆమెను కట్టడి చేయడం కుదరక గన్ ను వాడాల్సి వచ్చింది.

కెన్సాస్ లో సియారా హోవార్డ్ అనే మహిళ అక్కడ నేరాలు చేస్తూ తప్పించుకుని తిరుగుతుందట. ఆమె కోసం ఎన్నాళ్ల నుండో గాలిస్తున్న పోలీసులు ఎట్టకేలకు ఆమె ఆచూకి తెలియగా ఆమెను అరెస్ట్ చేయాలని వెళ్లారు. అయితే ఆమె గన్ తో బెదిరించడం.. వ్యక్తిగత దూషణలకు దిగడం లాంటివి చేయడం జరిగిందట.

దాదాపు మూడు గంటల పాటు ఓపికగా ఉన్న పోలీసులు ఫైనల్ గా ఆమెను షూట్ చేశారు. ఎంతకీ వారికి లొంగే ఆలోచనలేని ఆమె మరణాన్ని కోరి తెచ్చుకుంది. ఇక యూనిఫాంలో ఉన్న కెమెరా జరిగినదంతా రికార్డ్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. లేడీ కిలాడి సియారా హోవార్డ్ కింద చాలా కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. కస్టడీలోకి వస్తే పరిస్థితి ఎలా ఉండేదో కాని చివరి నిమిషం దాకా ప్రయత్నించి ఎంతకీ లొంగక పోవడంతో ఆమెను పోలీసులు షూట్ చేయాల్సి వచ్చిందట.