టెన్నిస్ క్వీన్ పెళ్లి.. పండంటి బిడ్డతో వేడుక

433

ప్రపంచ టెన్నిస్‌ క్వీన్ సెరెనా విలియమ్స్, రెడిట్‌ వెబ్‌సైట్‌ సహ వ్యవస్థాపకుడు, తన ప్రియుడు అలెక్సిస్ ఒహనియన్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. గురువారం జరిగిన ఈ వేడుకకు అతి కొద్దిమంది ప్రముఖులు హాజరయ్యారు. అమెరికాలోని న్యూఆర్లీన్స్‌లోని కాన్‌టెంపరరీ ఆర్ట్స్‌ సెంటర్‌‌లో జరిగిన ఈ వేడుక కోసం మిలియన్‌ డాలర్లు పైనే ఖర్చు చేశారట.
2015 నుంచి సెరెనా, అలెక్సిస్ సహజీవనం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో తాను గర్భవతినని ప్రకటించిన సెరెనా సెప్టెంబరు 1న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి అలెక్సిస్ ఒలంపియా అని పేరు కూడా పెట్టారు. పెళ్లి ఫొటోలకు సంబంధించిన రైట్స్‌ను సెరెనా వోగ్‌ మ్యాగజైన్‌కు అమ్మడంతో.. పెళ్లికి వచ్చిన అతిథుల సెల్‌ఫోన్లు అనుమతించలేదు. ఈ వేడకకు హాలీవుడ్‌ స్టార్‌ కిమ్‌ కార్డాషియన్‌, ఇవా లాంగోరియా, పాప్‌ గాయని సియారాలు తదితరులు హాజరయ్యారు.