మరోసారి ఐటెమ్ సాంగులో మెరవనున్న మిల్కీ భామ

638

ప్రస్తుతం తెలుగు సినిమాల్లో ఐటెమ్ సాంగులకు, ప్రత్యేక గీతాలకు ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. సినిమాల విజయాల్లో ఈ ఐటెమ్ సాంగులు, ప్రత్యేక గీతాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒకప్పుడు సిల్క్ స్మిత, డిస్కోశాంతి, జయమాలిని, జ్యోతిలక్ష్మి వంటివారు మాత్రమే ఐటెమ్ సాంగులు చేసేవారు. ప్రస్తుతం లీడింగ్ హీరోయిన్లే ప్రత్యేక గీతాల్లో నర్తిస్తున్నారు. ఇందుకు భారీ మొత్తాల్లో కళ్లు చెదిరే రెమ్యూనరేషన్లు అందుకుంటున్నారు.

ప్రముఖ కథానాయకుడు నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సవ్యసాచి’ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో నర్తించనుంది. యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున కథానాయకుడిగా 1990వ దశకంలో వచ్చిన ‘అల్లరి అల్లుడు’ చిత్రంలోని ‘నిన్ను రోడ్డు మీద చూసినాది లగాయితు’ పాటను మరోమారు రీమేక్ చేయనున్నారు. నాడు సూపర్ హిట్ గా నిలిచిన అల్లరి అల్లుడు చిత్రంలో ఈ పాట సూపర్ హిట్ అయింది. రమ్యకృష్ణను టీజ్ చేస్తూ నాగార్జున పాడిన ఈ పాటలో ఈసారి నాగచైతన్య.. మిల్కీ భామ తమన్నాతో కలసి స్టెప్పులు వేయనున్నాడు.