ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవద్దని చెప్పిన హీరో ఎవరో తెలుసా?

560

విక్టరీ వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘కూలీ నెంబర్ వన్’, యువసామ్రాట్ నాగార్జున హీరోగా వచ్చిన ‘నిన్నే పెళ్లాడుతా’ ‘ఆవిడా మా ఆవిడే’, మెగాస్టార్ చిరంజీవి సరసన ‘అందరివాడు’, యువరత్న నందమూరి బాలకృష్ణ సరసన ‘చెన్నకేశరెడ్డి’ ‘పాండురంగడు’ అబ్బాస్, వినీత్ హీరోలుగా వచ్చిన ‘ప్రేమ దేశం’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మతులు పోగొట్టింది.. పొడుగుకాళ్ల సుందరి టాబు. హైదరాబాద్ కు చెందిన టాబు ఫ్యామిలీ బాంబేలో స్థిరపడింది. టాబు అక్క ఫరా కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

కాగా, ఈ ముద్దుగుమ్మకు 46 ఏళ్లు వచ్చినా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ప్రముఖ సినీ నటుడు నాగార్జునతో చాలా కాలం ఎఫైర్ నడిపిందని, నాగార్జున ఇంటిలోనే మకాం కూడా పెట్టిందని అప్పట్లో వార్తలొచ్చాయి. దీనివల్ల అమల-నాగార్జున దంపతుల మధ్య బేదాభిప్రాయలు తలెత్తాయని, వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని గాసిప్పులు హల్చల్ చేశాయి. అయితే ఏమైందో ఏమో కానీ ఈ అందాల భామ బాంబేలోనే మకాం పెట్టింది.

కాగా, పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన టబును మీడియా వదిలిపెట్టడం లేదు. మీడియాతో మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడల్లా ఆమెను పెళ్లి ఎప్పుడని అడుగుతున్నారు. తాజాగా ఈ భామకు ఇలాంటి ప్రశ్నే ఎదురవగా.. తాను పెళ్లి చేసుకోపోవడానికి కారణం.. బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ అని బాంబుపేల్చింది. అజయ్ తన సోదరుడికి బంధువుని, తన జీవితం ప్రారంభం నుంచి అజయ్ తనతో కలసి ఉన్నాడంటూ అసలు విషయం చెప్పేసింది. అతడి కారణంగానే తాను వివాహం చేసుకోలేదంటూ వెల్లడించింది. కాగా, టబు కెరీర్ లోనే తొలి సూపర్ హిట్ చిత్రం ‘విజయ్ పథ్’లో హీరో అజయ్ దేవ్ గణ్ కావడం గమనార్హం. మరి ఇప్పుడు టాబు చెప్పిన మాటలకు అజయ్ భార్య ప్రముఖ నటీమణి కాజోల్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే