శ్రీరెడ్డి డైరీస్ సినిమా వచ్చేస్తోంది.. ఆ విషయాలు బయటపడేనా?

299

ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి టీవీలో యాంకర్ గా పనిచేసి, ఆ తర్వాత సినీ నటిగా అవతారమెత్తిన శ్రీరెడ్డి ఎలియాస్ విమలా చౌదరి ఎలియాస్ శ్రీశక్తి తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, తనకు అవకాశాలిస్తామని చెప్పి చాలామంది తనను వాడుకున్నారంటూ కలకలం రేపింది. ఇందులో టాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు కోలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారంటూ శ్రీరెడ్డి లీక్స్ పేరిట ఫేస్ బుక్ లో ఆరోపణలు చేస్తూ వస్తోంది.

అయితే, ఇదంతా అసలు వ్యవహారం కాదని, వచ్చే ఎన్నికల్లో ప్రభంజన శక్తిగా మారిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను ఎదుర్కోవడానికి ఆమెను ఒక పార్టీ ప్రవేశపెట్టిందని విమర్శలు వ్యక్తమయ్యాయి. అందుకు తగ్గట్టుగానే ఆమె స్థాయి మరిచి అసభ్య వ్యాఖ్యలతో కామెంట్లు చేయడం, పవన్ కల్యాణ్ ను, ఆయన తల్లిని దూషించడం చేయడంతో పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేయడమే ఆమె అసలు లక్ష్యమని వెల్లడై పోయింది. దీంతో ఎవరూ ఆమె వ్యాఖ్యలకు ప్రాధాన్యతనివ్వడం లేదు. ముందు సానుభూతి చూపిన మహిళా సంఘాలే ఆమెకు హ్యాండిచ్చాయి.

దీంతో టాలీవుడ్ లో తన పప్పులు ఉడక్కపోవడంతో చెన్నైకి చెక్కేసి అక్కడ తమిళ టీవీ చానెళ్లకు, పత్రికలకు, మ్యాగజైన్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ కాలం వెల్లదీస్తోంది. ఇప్పుడు తాజాగా ‘శ్రీరెడ్డి డైరీస్’ పేరుతో తమిళంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. దీనికి సంబంధించి చిత్ర నిర్మాత, దర్శకుడితో దిగిన ఫొటోలను శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో పంచుకుంది. అమ్మ (జయలలిత) ఆశీస్సులతో తాను ఒక తమిళ సినిమాను చేస్తున్నానని వెల్లడించింది. ఈ చిత్రానికి దర్శకుడిగా చిత్రల్ సెల్వన్, నిర్మాతగా రవి దేవన్ వ్యవహరిస్తున్నారు. మరి శ్రీరెడ్డి డైరీ పేరిట తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్ని సంచలన విషయాలు బయటపడతాయో వేచిచూడాల్సిందే..!