ఆ హీరోయిన్ వెయ్యిసార్లు ఫోన్ చేసిందంటున్న హీరో ఎవరంటే..

679

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం అలీ అబ్బాస్ దర్శకత్వంలో ‘భరత్’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సల్మాన్ మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ ఈ చిత్రంలో కథానాయిక.

కాగా, ఈ చిత్రానికి మొదట గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రాను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ప్రియాంకా చోప్రా చెప్పాపెట్టకుండా సినిమా నుంచి తప్పుకోవడంతో హీరో సల్మాన్ తోపాటు చిత్ర యూనిట్ హర్ట్ అయ్యింది. అయితే తన అమెరికన్ ప్రియుడు నిక్ జోనాస్ తో నిశ్చితార్థం చేసుకోవడానికి, హాలీవుడ్ లో ఒక మూవీలో నటించడానికి సల్మాన్ ఖాన్ చిత్రాన్ని ప్రియాంకా చోప్రా వదులుకుందని వార్తలు గుప్పుమన్నాయి.

తాజాగా సల్మాన్ ఈ వివాదంపై స్పందించాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించడం కోసం తన చెల్లెలు అర్పితకు ప్రియాంకా వెయ్యిసార్లు ఫోన్ చేసిందని బాంబుపేల్చాడు. మీ అన్నయ్యతో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని, షూటింగ్ కోసం ఆస్తకిగా ఎదురుచూస్తున్నానని తన చెల్లితో చెప్పినట్టు తెలిపాడు. అంతేకాకుండా దర్శకుడు అబ్బాస్ కు కూడా ఫోన్ చేసి తనను హీరోయిన్ గా తీసుకోవాలని కోరిందని చెప్పాడు. తద్వారా ప్రియాంకానే తమ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిందని, హీరోయిన్ గా తీసుకున్నాక హ్యాండ్ ఇచ్చిందని పరోక్షంగా వెల్లడించాడు. మరి సల్మాన్ కామెంట్లపై ప్రియాంకా ఏమంటుందో వేచిచూడాల్సిందే.