శైలజారెడ్డి అల్లుడు మొదటి రోజు ఎంత వసూలు చేసిందంటే..

702

ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య, అందాల భామ అను ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా బహుబాషా నటి రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ విడుదలైన మొదటి రోజు మంచి కలెక్షన్లు సాధించింది. వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 13న విడుదలైన ఈ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.12 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

హీరో నాగచైతన్య కెరీర్లో మొదటి రోజు కలెక్షన్లలో ఇవే అత్యధికం కావడం గమనార్హం. రివ్యూలు అనుకున్నంత పాజిటివ్ గా లేకపోయినా పండుగ నేపథ్యం, అందరికీ హాలిడే కావడం ఈ సినిమాకు కలిసొచ్చింది. దాసరి మారుతి దర్శకత్వం, అను ఇమ్మాన్యుయేల్ గ్లామర్, రమ్యకృష్ణ నటన ప్రతిభ, వెన్నెల కిశోర్ కామెడీ చమక్కులు, పాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

వీకెండ్ కావడం, థియేటర్లలో పెద్ద సినిమాలేవీ లేకపోవడం, మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు సినిమాలో ఉండటంతో శైలజారెడ్డి అల్లుడు హవా కొనసాగించే అవకాశం ఉంది. మరోవైపు యూఎస్ బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా సందడి చేస్తోంది. ప్రీమియర్ షోల ద్వారానే 100k యూఎస్ డాలర్లను వసూలు చేసింది.