రియల్.. లవ్ స్టోరీ వైరల్ 

515

బాలీవుడ్‌ చిత్రాలకు ఏమాత్రం తీసిపోదు ఈ కథ.. అసలు సిసలు బాలీవుడ్‌ చిత్ర క్టైమాక్స్‌ ను కూడా మరిపించింది ఈ దంపతుల ప్రేమకథ. విషయమేమిటంటే.. కొద్ది నెలల క్రితం యూపీలోని ఝూన్సీకి చెందిన ఓ జంట కాపురంలో గొడవలై పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లింది. దీంతో భర్తకు వ్యతిరేకంగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో భార్య ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇరు కుటుంబాల వారిని కౌన్సిలింగ్‌ కు పిలిచారు. కౌన్సిలంగ్‌ సెంటర్‌ కు వచ్చిన భర్త ఎలాగైనా భార్యను శాంతింపజేయాలనుకున్నాడు. అంతే పోలీస్ స్టేష‌న్ అని మ‌రిచి పోయి.. ఓ రొమాంటిక్ సాంగ్ అందుకున్నాడు.. అది విన్న భార్య.. భర్త ప్రేమకు ముగ్ధురాలవ్వడంతో కథ సుఖాంతమైంది. భర్తపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోగా ఇరు కుటుంబాల వారు సంతోషం వ్యక్తం చేశారు.
బద్లాపూర్‌ చిత్రంలో అతీఫ్‌ పాడిన ‘ నా సిఖా జినా తేరే బినా” అనే పాటతో భార్య కోపాన్ని పోగ​ట్టిన భర్త వీడియోను ఐపీఎస్‌ అధికారి మధుర్ వర్మ తన ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశారు. ‘ ప్రేమ విజయాలు’ అనే ట్యాగ్‌తో ఆమె పోస్ట్‌ చేసిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. మీరూ చూడండి..