తన ఎఫైర్ గురించి గుట్టువిప్పనంటున్న అందాల భామ

201

బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లోనూ సత్తా చాటుతోంది.. అందాల భామ ప్రియాంకా చోప్రా. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అమెరికన్ సింగర్, తనకంటే పదేళ్లు చిన్నవాడైన నిక్ జోనాస్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది. తన ప్రియుడితో కలసి దేశవిదేశాల్లో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తోంది.. ఈ భామ.

ఇప్పటికే ఈ జంటకు నిశ్చితార్థం జరిగిపోయిందని వార్తలు వస్తుండగా ప్రియాంకా మాత్రం వాటిని ధ్రువీకరించడం లేదు. సెప్టెంబర్ 16న తన ప్రియుడు నిక్ జోనాస్ పుట్టిన రోజు సందర్భంగా వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కుతారని బాలీవుడ్, హాలీవుడ్ కోడై కూస్తున్నా ప్రియాంకా మాత్రం స్పందించడం లేదు. నిక్ ను పెళ్లి చేసుకోవడం కోసమే సల్మాన్ ఖాన్ సరసన నటించాల్సిన ‘భరత్’ అనే సినిమాను వదులుకుందని గాసిప్ప్ వినిపిస్తున్నాయి. మరోవైపు సల్మాన్ తో చిత్రాన్ని వదులుకున్న ప్రియాంకా ఒక హాలీవుడ్ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పడం విశేషం.

తాజాగా ఓ కార్యక్రమం నిమిత్తం ఇండియా వచ్చిన ప్రియాంకాను నిక్ జోనాస్ తో పెళ్లి వార్తలపై స్పందించాలని మీడియా కోరగా.. తన జీవితంలో 90 శాతం తెరిచిన పుస్తకమేనని, రహస్యాలు ఏమీ లేవని వెల్లడించింది. కేవలం పది శాతం మాత్రమం తనకంటూ వ్యక్తిగత జీవితం ఉందని, దాన్ని ఇతరులకు తెలపడం ఇష్టం లేదంది. ప్రతి ఒక్కరికీ ప్రైవసీ ఉంటుందని, ఆ ప్రైవసీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పింది.