అభ్యంతర సన్నివేశాల్లో నటించక తప్పడం లేదంటున్న హీరోయిన్!

713

కన్నడ భామ ప్రణీత చూడగానే ఆకట్టుకునే అందం, ఒంపుసొంపులు ఉన్న తార. తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ‘అత్తారింటికి దారేది’లో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అగ్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు సరసన ‘రభస’, ‘బ్రహ్మోత్సవం’లో నటించినా ఆ చిత్రాలు సక్సెస్ కాలేదు. ప్రస్తుతం తెలుగు సినిమాలతోపాటు తన మాతృ భాష కన్నడంలోనూ ఈ తార సినిమాలు చేస్తోంది. అంతేకాకుండా వివిధ వస్త్ర దుకాణాలు, బంగారం షాపులు ప్రారంభిస్తూ రెండు చేతులా ఆర్జిస్తోంది.

కాగా, ఇటీవల చికాగో సెక్స్ రాకెట్ లో ఒక కన్నడ భామ కూడా ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె మరెవరో కాదు.. ప్రణీతనేనని గాసిప్పులు వినిపిస్తున్నాయి. వివాదాస్పద కామెంట్లతో పరువు పొగొట్టుకున్న శ్రీరెడ్డి కూడా చికాగో సెక్స్ రాకెట్ లో ప్రణీత కూడా ఉందని తెలిపింది. తాజాగా ప్రణీత ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు వెల్లడించింది.

దర్శకులు ఏం చెబితే అదే చేయాలని, వారికి ఎదురుచెప్పడానికి ఉండదని, కొన్నిసార్లు అభ్యంతరకర సన్నివేశాల్లో నటించాల్సి వస్తోందని వాపోయింది. ఆ సీన్లు స్లోమోషన్ లో వస్తుంటే సిగ్గనిపిస్తోందని తెలిపింది. తాజాగా ఒక చిత్రంలో తాను మావోయిస్టు భార్యగా నటిస్తున్నానని, ఆ సన్నివేశం చిత్రీకరించాక చూసుకుంటే చాలా అభ్యంతరకరంగా ఉందని చెప్పింది. కానీ తన అభిప్రాయానికి ఎవరూ విలువ ఇవ్వరని, దర్శకుడు చెప్పినట్టు చేయాల్సిందేనని అంటోంది. తన విషయంలో ఇలాంటివి చాలాసార్లు చోటు చేసుకున్నాయని వాపోయింది ఈ సుందరి.