ఈసారి ఆర్కే రోజాకు సీటు గల్లంతేనా?

650
Lotus pond nivasam lo YS.Jagan mohan reddy ni kalasina MLA.RK.Roja

ప్రస్తుతం చిత్తూరు జిల్లా నగరి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు ప్రముఖ సినీ నటి, జబర్దస్త్ షో జడ్జి.. ఆర్కే రోజా. అటు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, ఇటు షోలు చేస్తూ రెండు పడవలపైన విజయవంతంగా ప్రయాణం చేస్తున్నారు. అయితే రోజా నియోజకవర్గాన్ని ఎక్కువగా పట్టించుకోవడం లేదని, షూటింగ్ లు అంటూ ఎక్కువగా హైదరాబాద్, చెన్నైలో ఉంటున్నారంటూ ప్రత్యర్థులు ఆమెపై పార్టీ అధినేత వైఎస్ జగన్ కు ఫిర్యాదు చేశారంట. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో డూ ఆర్ డై పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రోజాకు సీటు నిరాకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

వాస్తవానికి ప్రత్యర్థులు ఆరోపించినట్టు రోజా నియోజకవర్గానికి దూరంగా ఏమీ లేరు. పార్టీ తరఫున ఏ కార్యక్రమం నిర్వహించినా ఆమె చురుకుగా పాలుపంచుకుంటున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో కార్యకర్తలు, అభిమానుల శుభ, అశుభ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారు. అయితే నగరి సీటుపై కన్నేసిన మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి సోదరుడు చక్రపాణిరెడ్డి వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నియోజకవర్గంలో రోజా లేనప్పుడు చక్రపాణిరెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తూ చాపకింద నీరులా పనిచేసుకుంటూ పోతున్నారు.

వాస్తవానికి వైఎస్సార్సీపీలో మంచి వాగ్ధాటి ఉన్న నేతల గురించి చెప్పుకోవాలంటే ముందు వరుసలో నిలిచేవారు ఇద్దరే.. వారు అంబటి రాంబాబు, రోజా. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేయాలంటే వారిద్దరి తర్వాతే ఎవరైనా. ముఖ్యంగా రోజా అయితే చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేశ్ ను ఒక ఆట ఆడుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరంజీవిని కూడా వదల్లేదు. అయితే నియోజకవర్గంలో రోజాను ఒక నటిగా మాత్రమే అభిమానిస్తున్నారని, ఎమ్మెల్యేగా ఎవరూ ఇష్టపడటం లేదని ప్రత్యర్థి వర్గం వైఎస్ జగన్ కు ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఏ నిర్ణయం తీసుకోనున్నారో వేచిచూడాల్సిందే..!