కొత్త యాక్టివా కొన్నారా.. వెంటన్ వాపస్ ఇచ్చేయండి

1209

ఒక వైపు గ్రాజియా అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉండగా.. కంపెనీ  రీకాల్ చేయడం వాహనదారులను  ఆందోళనకు గురి చేస్తోంది. యాక్టివా 125, గ్రాజియా,  ఏవియేటర్ బైక్ లలో సాంకేతిక లోపం ఉన్నట్లు హోండా కంపెనీ గుర్తించింది. తమ తప్పును సరిదిద్ధుకునేందుకు వాహనాలను వెనక్కి తీసుకుంటోంది. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 56,194 వాహనాలను రీకాల్ చేయాలని నిర్ణయించింది. ఆ సంస్థ విడుదల చేసిన యాక్టివా 125, గ్రాజియా, ఏవియేటర్ స్కూటర్లలోని ఫ్రంట్ ఫోర్క్ వద్ద బిగించిన ఓ బోల్ట్‌లో లోపం ఉన్నట్టు గుర్తించిన సంస్థ వీటిని వాపస్ తీసుకోవాలని నిర్ణయించింది. వెనక్కి వచ్చాక వాటిని పరిశీలించి అవసరమైతే బోల్టును మారుస్తామని హోండా తెలిపింది.

2018 లో ఫిబ్రవరి 7 నుండి మార్చి 16 మధ్య తయారు చేసిన ఈ మోడల్స్ లోనే లోపం ఉన్నట్లు గుర్తించారు. హోండా డీలర్లు ఈ విషయాన్ని వినియోగదారులకు చెప్పి స్కూటర్లను వెనక్కి తెప్పిస్తున్నారు. కంపెనీ వెబ్ సైట్ లోకి లాగిన్ అయ్యి బైక్ ఓనర్లు వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్(VIN) ఆధారంగా తమ బైక్ లు పక్కాగా ఉన్నాయా లేదా అని కనుక్కోవచ్చు.సాధారణంగా ఏదైనా వాహనంలో లోపాలు తలెత్తితే కంపెనీ తమ వాహనాలను వెంటనే వెనక్కు తీసుకుంటుంది.  కంపెనీకి చెడ్డపేరు రాకుండా ఉండేందుకు ప్రముఖ కంపెనీలెన్నో ఇప్పటికే చాలా సార్లు ఇలా రీకాల్ చేశాయి. ఇప్పుడు భారత్ లో హోండా కంపెనీ అదే పని చేసింది.