ఈ టాలీవుడ్ స్టార్ హీరో మరోసారి బాలీవుడ్ మూవీలో మెరవనున్నాడే!

266

టాలీవుడ్ హీరోలు హిందీ సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదు. గతంలో మెగాస్టార్ చిరంజీవి (ప్రతిబంధ్, ఆజ్ కూ గూండారాజ్, జెంటిల్మన్), విక్టరీ వెంకటేశ్ (అనారి), నాగార్జున (ఖుదాగవా, ఎల్వోసీ కార్గిల్, క్రిమినల్), రామ్ చరణ్ (తుఫాన్) తదితరులు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోమారు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున ఒక హిందీ చిత్రం నటిస్తున్నాడని సమాచారం.

బాలీవుడ్ తాజా ప్రేమ పక్షులు.. రణ్ బీర్ కపూర్, అలియాభట్ హీరోహీరోయిన్లుగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘బ్రహ్మాస్త్ర’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. కాగా, 2013లో జేపీ దత్తా దర్శకత్వంలో వచ్చిన ‘ఎల్వోసీ కార్గిల్’ నాగార్జునకు చివరి హిందీ చిత్రం.

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న బ్రహ్మాస్త్రలో నాగార్జున స్నేహితుడు అమితాబ్ బచ్చన్ నటిస్తుండటం, మంచి కథా ప్రాధాన్యమున్న పాత్ర లభించడం, ఎప్పటి నుంచో మరోసారి హిందీ సినిమాల్లో నటించాలని చూస్తుండటంతో ఈ చిత్రంలో నటించడానికి నాగార్జున అంగీకారం తెలిపాడని సమాచారం. ఈ సినిమా మంచి విజయం సాధించి ఈ అక్కినేని అందగాడికి మంచిపేరు తేవాలని కోరుకుందాం.