నాగ చైతన్య మంచోడు కాదా..?

244

యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య మంచోడు కాదా మీరు చెప్పండి..భలేవాళ్లే మంచోడైతేనే కదా తమిళనాడు చిన్నది సమంత మనోడిపైన మోజుపడిందంటారా.చైతన్యతన నిజ జీవితంలో చాలా కామ్ గోయింగ్. తన పనేదో తానుచూసుకుంటాడు. తెలుగు సినీ రంగంలో రెండు పెద్ద కుటుంబాలు.. అదేనండి దగ్గుబాటి కుటుంబం,అక్కినేని కుటుంబం నుంచి వచ్చినా ఎప్పుడు ఆ ఫీలింగ్ చూపడు. ఎవరితో నైనా ఇట్టే కలిసిపోతాడనిఅందరూ చెప్పే మాట. మనోడు ఈ ఏడాది పంజాబీ అందం రకుల్ ప్రీత్ తో కలిసి రారండోయ్ వేడుకచూద్దాం వంటి సినిమాతో మంచి హిట్ దక్కించుకున్నాడు. ఈ అందగాడు.. నడుమందాల సన్నజాజిలావణ్య త్రిపాఠితో కలిసి నటించిన యుధ్దం శరణం ప్రస్తుతం థియేటర్స్ లో ప్రదర్శితమవుతున్నసంగతి తెలిసిందే. మరోవైపు వచ్చే నెలలో సమ్మూ.. అదేనండి సమంతతో పెళ్లి పీటలు ఎక్కడానికిసిద్ధమవుతున్నాడు. అయితే ఇప్పుడిదంతా ఎందుకు? అతని మంచితనం గురించి తెలుసుకోవాల్సినఅవసరమేముంది? అంటారా..

ఈ రోజుల్లో, బస్టాప్ వంటి అడల్డ్ మూవీస్ తో యువతను ఆకట్టుకున్నాడు మారుతి. ఇదే క్రమంలోబూతు సినిమాలు తీస్తున్నాడంటూ విమర్శలూ అందుకున్నాడు. తర్వాత రూటు మార్చి నేచురల్స్టార్ నానితో భలేభలే మగాడివోయ్, విక్టరీ వెంకటేశ్ తో బాబు బంగారం వంటి సినిమాలకు దర్శకత్వంవహించాడు. భలే భలే మగాడివోయ్ సూపర్ హిట్ కాగా బాబు బంగారం యావరేజ్ గా నిలిచింది.ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై శర్వానంద్ హీరోగా మహానుభావుడు అనే సినిమానుతెరకెక్కిస్తున్నాడు. దీని తర్వాత తన దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించనున్నాడనితెలుస్తోంది. ఈ సినిమాకు మంచోడు అని పేరు పెడుతున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈమేరకు టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించారంట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ సినిమాచిత్రీకరణను ఈ ఏడాది డిసెంబరులో మొదలుపెట్టనున్నారట. ఈ సినిమాలో నాగచైతన్య సరసన ‘లై’ఫేమ్‌ మేఘా ఆకాశ్‌ని కథానాయికగా తీసుకున్నారనే రూమర్లూ వినిపిస్తున్నాయి.