పవన్ కళ్యాణ్ జనసేన గురించి మోహన్ బాబు.. అది పవన్ విజ్ఞతకే వదిలేశా..!

1246

ప్రస్తుతం అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ సంచలనంగా మారిన వ్యక్తి పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనతో పవన్ తన ప్రచారం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ఆయన గురించి సెలబ్రిటీస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో కలక్షన్ కింగ్ మోహన్ బాబుకు పవన్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. పవన్ రాజకీయాల గురించి మాట్లాడాలని మోహన్ బాబుని అడుగుగా. ప్రస్తుతం తాను మాట్లాడలేనని సమాధానం ఇచ్చారు.

తను నటించిన గాయత్రి సినిమా ప్రమోషన్స్ లో ఇంటర్వ్యూస్ ఇస్తున్న మోహన్ బాబు మొన్న పత్రికలకు ఇంట్రర్వ్యూలు ఇవ్వగా.. ఎలక్ట్రానిక్ మీడియాకు నిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో పవన్ గురించి కొన్ని ప్రశ్నలడగగా వాటిని ఇది సమయం కాదు అన్నట్టు సమాధానం ఇచ్చారు మోహన్ బాబు. అయితే చిరంజీవికి పద్మా భూషణ్ వచ్చిన సందర్భంలో పవన్ తనను ‘తమ్ముడూ మోహన్ బాబూ’ అని సంభోదించడం గురించి నోరు విప్పారు మోహన్ బాబు.

ఆరోజు పవన్ అలా అన్నందుకు చాలా సంతోషించానని.. ఆ తర్వాత అసలు విషయం తెలిసి ఆయన విజ్ఞతకే వదిలేశానని అన్నారు మోహన్ బాబు. కొన్నిటిని విని వినట్లు వదిలేస్తే మంచిదని.. పవన్ కామెంట్లు గురించి తాను ఆ తర్వాత ఆలోచించలేదని అన్నారు.