ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీబిజీగా మంత్రి కేటీఆర్

1257

న్యూఢిల్లీ: విమానయాన రంగంలో తెలంగాణ రాష్ట్రానికి స‌హ‌క‌రించాల‌ని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాలు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజును విజ్ఞ‌ప్తిచేశారు. దేశ రాజధాని హస్తిన పర్యటనలో ఉన్న కేటీఆర్ ముందుగా శుక్రవారం అశోక్‌ను కలిసి రాష్ట్రానికి పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.

అనంత‌రం మేకిన్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఇన్వెస్ట్ ఇండియా కార్య‌క్ర‌మంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో భాగంగా ఇన్వెస్ట్ ఇండియా సీఈఓ, ఎండీ దీప‌క్ బాగ్లా, ఇన్వెస్ట్ ఇండియా సంస్థ వైస్ ప్రెసిడెంట్ దుశ్యంత్ ఠాకూర్‌ల‌తో భేటీ అయి ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల రంగాల్లో తెలంగాణ అభివృద్ధిని గురించి వివ‌రించిన మంత్రి కేటీఆర్

టీ హ‌బ్, టీఎస్-ఐపాస్ వంటి వాటి గురించి తైవాన్ ఇన్వెస్ట‌ర్ల బృందానికి పేప‌ర్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. అంతకముందు, ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేటీఆర్‌కు తెలంగాణ భ‌వ‌న్ ప్రిన్సిప‌ల్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ అర‌వింద్ కుమార్ స్వాగతం పలికారు.

తెలంగాణలో బ‌హుళ జాతి కంపెనీలు పెట్టేందుకు స‌ముఖం వ్య‌క్తం చేసిన ప‌లువురు ఇన్వెస్ట‌ర్లు కేటీఆర్‌తో త్వరలో ప్రత్యేక భేటీ ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. కేటీఆర్ తన బృందంతో కలిసి ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణం చేశారు.