మిల్కీ బ్యూటీ సినిమా షూటింగ్ దశలోనే ఆగిపోయిందా?

281

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇది మాత్రమే కాకుండా విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న ‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్’లోనూ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘క్వీన్’ రీమేక్ లోనూ తమన్నానే లీడ్ రోల్ చేస్తోంది.

కాగా, గతంలో అంటే.. చాలాకాలం కిందట తమన్నా, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా మొదలైంది. హిందీలో ఘనవిజయం సాధించిన ‘హమ్ తుమ్’కి ఇది రీమేక్. హిందీ చిత్రానికి దర్శకత్వం వహించిన కునాల్ కోహ్లీనే తెలుగు చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. హీరో కమ్ ప్రొడ్యూసర్ సచిన్ జోషి నిర్మాణంలో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ దశలోనే ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే తమన్నా పార్ట్ పూర్తవగా మిగతా కొంత చిత్రీకరించాల్సి ఉందని అంటున్నారు. అయితే ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తయిందని సినిమాకు డిస్ట్రిబ్యూటర్స్ లేక ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని నిర్మాత సచిన్ జోషి చెబుతున్నారు. మరి ఈ సినిమా విడుదలవుతుందో లేదో వేచిచూడాల్సిందే.