మరోసారి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్స్డ్‌లోకి ఎక్కిన మేఘా

391

18 నెలల్లో పూర్తి  కావాల్సిన సబ్‌స్టేషన్‌ నిర్మాణం ఏడు నెలల్లో పూర్తి

అనంతపురం జిల్లా ఎన్‌పీ కుంట వద్ద 400 కెవి సబ్‌ స్టేషన్‌ నిర్మాణంలో రికార్డు

ఇప్పటికే బెస్ట్‌ డెబ్యూటెంట్‌ అవార్డు అందించిన పవర్‌ గ్రిడ్‌

ఏషియా, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులోనూ చోటు

పట్టిసీమ ఎత్తిపోతలను సకాలంలో పూర్తి చేయటం ద్వారా  గతంలోనే లిమ్కా బుక్‌లోకి ఎక్కిన మేఘా

దేశంలోనే అత్యంత వేగంగా విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణాన్ని పూర్తి  చేసి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది ఎంఈఐఎల్‌. అనంతపురం జిల్లా నంబూలపూలకుంట వద్ద 15 నుంచి 18 నెలల్లో పూర్తి కావాల్సిన  400 /200 కెవి సబ్‌ స్టేషన్‌ను ఏడు నెలల్లో  ఎంఈఐఎల్‌ పూర్తిచేసింది. 2015 సెప్టెంబర్‌ 25న సబ్‌స్టేషన్‌ నిర్మణాన్ని మొద లుపెట్టి 2016 ఏప్రిల్‌ 26న ప్రారంభోత్సవానికి సిద్ధం చేసింది. అదే రోజున పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ సబ్‌ స్టేషన్‌ను ప్రారంభించింది.  ఇంతకు ముందే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని గడువుకన్నా ముందే నిర్మించటం ద్వారా  లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్స్డ్‌లోకి మేఘా ఎక్కిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లా నంబూలపూలకుంట (ఎన్‌పి కుంట) వద్ద క్లిష్టమైన నమూనాలు, కఠినమైన నిబంధనలు, ఏమాత్రం అనుకూలంగాలేని పరిస్థితులు, నిత్యం వర్షాలు నేపధ్యంలో కూడా నిర్ణీత గడువుకన్నా ముందే ఈ సబ్‌ స్టేషన్‌ నిర్మాణాన్ని పూర్తిచేసింది మేఘా ఇంజనీరింగ్‌. కేంద్ర ప్రభుత్వ  నవరత్న సంస్థల్లో ఒకటైన పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (పిజీసీఐ) ఎన్‌పీ కుంట వద్ద 400/200 కెవి సబ్‌ స్టేషన్‌ నిర్మించాలని తలపెట్టింది. దీని ద్వారా అక్కడే పవర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేస్తోన్న  ఆల్ట్రా మెగా సోలార్‌   పార్క్‌  గ్రిడ్‌కు అనుసంధానించాలనేది లక్ష్యం. ఆ లక్ష్యాన్ని  మేఘా ఇంజనీరింగ్‌ గడువుకన్నా ముందే నిర్మిణాన్ని పూర్తి చేసి అప్పగించింది. పవర్‌ గ్రిడ్‌  1500 మెగావాట్ల విద్యుత్‌ను  గత రెండు సంవత్సరాలుగా నిరంతరాయంగా సరఫరా చేస్తోంది. సాధారణంగా ఇటువంటి సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి 15 నుంచి 18 నెలల సమయం పడుతుంది. తమకు సాధ్యామైనంత త్వరగా ఈ సబ్‌ స్టేషన్‌ నిర్మించి ఇవ్వాలని మేఘా ఇంజనీరింగ్‌ను  పవర్‌ గ్రిడ్‌ సంస్థ కోరింది. సవాళ్లను స్వీకరించి వాటిని సకాలంలో పూర్తి చేయటంలో ముందుండే మేఘా అందుకు సిద్ధమైంది. ఏడు నెలల్లోనే ఈ సబ్‌ స్టేషన్‌ నిర్మాణాన్ని పూర్తిచేసింది. తనకు ఉన్న సొంతమైన ఇంజనీరింగ్‌ సామర్ధ్యం,  సాంకేతిక నిపుణులు, నిబద్దత కలిగిన సిబ్బందితో  ఈ అసాధ్యాన్ని ఏడు నెలల్లోనే  సుసాధ్యం చేసి పవర్‌ గ్రిడ్‌ నుంచి  బెస్ట్‌ డెబ్యుటెంట్‌ అవార్డును కూడా మేఘా దక్కించుకుంది. ఈ అవార్డు కింద మెమోంటోతో పాటు ప్రశంసాపత్రాన్ని  మేఘాకు  వవర్‌గ్రిడ్‌ అందించింది. దేశంలోనే అత్యంత వేగంగా పూర్తైన ప్రాజెక్టుల్లో ఒకటిగా  ఎన్‌పీ కుంట  సబ్‌స్టేషన్‌ రికార్డుల్లోకి ఎక్కింది. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సబ్‌స్టేషన్‌ పనితీరు సంతృప్తికరంగా ఉందని  పవర్‌గ్రిడ్‌ ధృవీకరించటంతో పాటు తన అధికారిక వెబ్‌సైట్లో ఈ విషయాన్ని పొందు పరిచింది. సబ్‌ స్టేషన్‌ నిర్మాణంలో భాగంగా ఎన్‌పీ కుంటలో  ఎంఈఐఎల్‌ 500ఎంవీఏ, 400/220 కేవీ సామర్థ్యం కలిగిన మూడు ఆటో ట్రాన్స్‌ఫార్మర్లు, 125 ఎంవీఏఆర్‌  బస్‌ రియార్టర్‌ ఒకటి  నిర్మించింది.  400 కేవీ 100 ఎవీఏఆర్‌ స్టేషన్‌ ఒకటి. 400 కేవీ బేస్‌లైన్లు రెండు, 400 కేవీ టైబేస్‌లు నాలుగు, 220 కేవీ లైన్‌బేస్‌లు నాలుగు, 220 కేవీ బస్‌ కప్‌లార్‌బే ఒకటి, 220 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ బస్‌కప్‌లార్‌ బే ఒకటి, 220కేవీ, 500 ఏంవీఏ, ఆటోట్రాన్స్‌ఫార్మర్‌ బేు మూడు ఏర్పాటు చేసింది. సివిల్‌ పనులైన అంతర్గత  డ్రైన్‌లు, రహదారాలు, కల్వర్టులు, కంట్రోల్‌రూమ్‌, బే క్యూస్‌క్‌, ట్రాన్సిట్‌ క్యాంపు, ఫైర్‌ఫైటింగ్‌ పంప్‌హౌస్‌ నిర్మాణాలను అదే సమయంలో పూర్తి చేసింది. ఎన్‌పీ కుంట ప్రాజెక్టు ఇప్పటికే  ఏషియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌,  ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో కూడా చోటు  సంపాదించుకున్న విషయం తెలిసిందే.