దసరాకు 3 లేటెస్ట్‌ స్మార్ట్ ఫోన్లు

696

మొబైల్‌ ప్రపంచాన్ని ఏలుతున్న ఆపిల్, సామ్‌ సంగ్, జియోమి కంపెనీలు దసరా పండుగకు ముందే లేటెస్ట్‌ హై ఎండ్‌ ఫోన్లతో పోటాపోటీ పడుతున్నాయి. ఆపిల్‌ కంపెనీ సెప్టెంబర్‌ 12న తన పదో వార్షికోత్సవ ఈవెంట్‌ను కాలిఫోర్నియాలోని స్టీవ్‌ జాబ్స్‌ ఆడిటోరియంలో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటోంది.

ఐఫోన్ 8, 8 ఎక్స్, 8 ప్లస్:                                                                                                  వార్షికోత్సవ కానుకగా మొబైల్‌ ప్రియులకు ఇదే రోజున ఐ ఫోన్‌ 8, ఐ ఫోన్‌ ఎక్స్, ఐ ఫోన్‌ 8 ప్లస్‌ మోడల్స్‌ను లాంచ్ చేయనుంది. ఐ ఫోన్‌ క్రేజీ ప్రపంచవ్యాప్తంగా సందడి చేస్తున్న నేపథ్యంలో వస్తున్న ఈ కొత్త మోడల్స్‌లో సరికొత్త ఐవోఎస్‌ సాఫ్ట్‌ వేర్‌ ఫీచర్స్‌తో పాటు రెండింటిలో ఫేస్‌ ఐడీ, అనిమోజీ ఉన్నాయి. కొత్తగా విడుదలయ్యే మూడు మోడల్స్‌ వైర్లెస్‌ ఛార్జింగ్‌ని సపోర్ట్‌ చేస్తాయి. ఈ లేటెస్ట్‌ మోడల్స్‌ ఇండియాకు రావడానికి మరి కొంత సమయం పడుతుంది.
ఐ ఫోన్‌ 8 ఫీచర్స్‌: ఐ ఫోన్‌ 8 – 3 జీబీర్యామ్, మినిమం 64 జీబీ స్టోరేజ్, ఏ11 ప్రాసెసర్, వాటర్‌ ప్రూఫ్‌ అండ్‌ డస్ట్‌ ప్రూఫ్‌.

సామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌ 8:
ఆండ్రాయిడ్‌ దిగ్గజంగా పేరొందిన సామ్‌ సంగ్‌ నోట్‌ సీరిస్‌లో మరో హైఎండ్‌ ఫోన్‌ను సెప్టెంబర్‌ 12న ఇండియాలో రిలీజ్‌ చేస్తోంది. సామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌ ఫోన్‌ను న్యూ ఢిల్లీలో లాంచ్‌ చేస్తోంది. ఈ సిరీస్‌లో గత ఏడాది చివర్లో విడుదల చేసిన గెలాక్సీ నోట్‌ 7 ఘోరంగా ఫెయిల్‌ అయ్యింది. ఏకంగా కంపెనీకి భారీ నష్టమే తెచ్చింది. బ్యాటరీ తయారీలో ఉన్న లోపాలు, డిజైన్, సాంకేతిక లోపాలతో ప్రీ బుకింగ్‌ సమయంలోనే నోట్‌ 7 ను కంపెనీ విరమించుకుంది. అందుకే ఇప్పుడు ఆండ్రాయిడ్‌ నాగెట్‌ సాప్ట్‌వేర్‌తో కొత్తగా మార్కెట్‌లోకి తీసుకు వస్తున్న గెలాక్సీ నోట్‌ 8 ఫోన్‌ డిజైన్‌పై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది. పోటీ కంపెనీ ఆపిల్‌కి ధీటుగా ఒకే రోజున ఇండియాలో ఈ ఫోన్‌ లాంఛింగ్‌ ఈవెంట్‌ నిర్వహిస్తోంది.
గెలాక్సీ నోట్‌ 8 ఫీచర్స్‌: ఆండ్రాయిడ్‌ 7.1.1, 1.6 గిగాహెట్జ్‌ ఆక్టా– కోర్‌ క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, రెజల్యూషన్‌ 1440“2960 పిక్సెల్స్, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్‌æ మెమరీ.

జియోమీ నుంచి ఎంఐ మిక్స్‌2:
ఇండియాలో మొబైల్‌ అమ్మకాల్లో టాప్‌ రేంజ్‌కు చేరిన జియోమీ కంపెనీ మరో సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌ జియోమి MI MIX 2 సెప్టెంబర్‌ మొదటివారంలోనే విడుదల చేసింది. ఆపిల్, సామ్‌ సంగ్‌ కంపెనీలకు పోటీగా త్వరలోనే ఈ ఫోన్‌ను ఇండియాలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇది కూడా హై ఎండ్‌ స్మార్ట్‌ ఫోన్‌ కావటంతో మూడు కంపెనీల పోటీ దసరాకు ముందే సందడి చేయనుంది.
జియోమి ఎంఐ మిక్స్‌ 2 ఫీచర్స్‌: ఆక్టా–కోర్‌ ప్రాసెస్‌ , 5– మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా , రిజల్యూషన్‌ 1080“2160 మెగాపిక్సెల్, 6 జీబీ ర్యామ్‌