కీర్తి సురేశ్, జాన్వీ కపూర్ లలో ఆ హీరో సరసన నటించేది ఎవరు?

271

సినిమా విజయం కేవలం కథను బట్టే కాకుండా హీరోహీరోయిన్ల కాంబినేషన్ బట్టి కూడా ఉంటుంది. కొంతమంది దర్శకులు- హీరోహీరోయిన్ల కాంబినేషన్లకు ఎక్కడ లేని క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం తమిళంలో ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు తీయబోయే చిత్రంలో ఇలాంటి కాంబినేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రంలో నటించే హీరోను ఇప్పటికే ఎంపిక చేయగా హీరోయిన్ కోసం అన్వేషణ కొనసాగుతోంది. హీరోగా ఎంపికైన శింబు సరసన నటించడానికి ఇద్దరు అందాల భామలను పరిశీలిస్తున్నారు.

వీరిలో ఒకరు కీర్తి సురేశ్ కాగా, మరొకరు అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ నయా సోకులాడి జాన్వీ కపూర్. ఈ ఏడాది ‘మహానటి’తో సూపర్ హిట్ కొట్టింది.. కీర్తి సురేశ్. ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం నాలుగు తమిళ చిత్రాలున్నాయి. ఇక జాన్వీ కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ‘ధడక్’ ఇటీవల విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శింబు సరసన నటింపచేయడానికి ఈ ఇద్దరు భామలను పరిశీలిస్తున్నాడు.. దర్శకుడు వెంకట్ ప్రభు.

వీరిద్దరిలో హీరోయిన్ గా నటించేది ఎవరో మరికొద్ది రోజుల్లో వెల్లడిస్తామని వెంకట్ ప్రభు తెలిపాడు. ప్రస్తుతం ఆ హీరోయిన్లు ఇద్దరితో చర్చలు జరుగుతున్నాయని చెప్పాడు. హీరో శింబు కీర్తి వైపు మొగ్గుచూపుతున్నాడని తెలుస్తోంది. మరోవైపు శ్రీదేవి కూతురు జాన్వీని తమ సినిమాలో నటింపజేస్తే జాతీయ స్థాయిలో తన సినిమాకు గుర్తింపు వస్తుందని దర్శకుడు వెంకట్ ప్రభు ఆలోచిస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే శింబుతో రొమాన్స్ చేసే అందగత్తె ఎవరో తేలనుంది.