పవన్ కల్యాణ్ బాటలో సినిమాలకు గుడ్ బై చెప్పనున్న మరో స్టార్ హీరో!

315

పవన్ కల్యాణ్ బాటలోనే మరో స్టార్ హీరో సినిమాలకు స్వస్తి పలకనున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. క్రియాశీలక రాజకీయాలకు సమయం కేటాయించడానికి వీలుగా ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే భాటలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నడవనున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న ‘విశ్వరూపం-2’ చిత్రం తర్వాత కమల్ హాసన్ ‘భారతీయుడు-2’లో నటించనున్నాడు.

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మనీషా కోయిరాలా, ఊర్మిళ హీరోయిన్లుగా వచ్చిన ‘భారతీయుడు’ ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా బారతీయుడు – 2 రానుంది. దీని తర్వాత కమల్ సినిమాల నుంచి తప్పుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలు అంటూ రండు పడవలపై ప్రయాణిస్తున్న కమల్ సాధారణ ఎన్నికలు దగ్గరకొస్తుండటంతో తను స్థాపించిన పార్టీ ‘మక్కల్ నీది మయ్యమ్’ను బలోపేతం చేసే ఆలోచనలో ఉన్నాడు. తరచుగా తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలకు దగ్గరవ్వాలనే ఆలోచనలో ఉన్నాడు. కమల్‌ నటించి దర్శకత్వం వహించిన ‘విశ్వరూపం 2’ ఆగస్టు 10న విడుదల కానుంది.