కమల్ హాసన్ పొలిటికల్ ఎంట్రీ..!

472

దీపమున్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలి. నిప్పున్నప్పుడే నీళ్లు కాచుకోవాలి. అలా కాదని ఆలస్యం చేస్తే దీపం ఆరిపోతుంది. నిప్పు చల్లారిపోతుంది. ఈ విషయాన్ని బాగా ఒంటబట్టిచ్చుకున్నాడు నటుడు కమల్ హాసన్. తమిళనాడులో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులను తన పొలిటికల్ ఎంట్రీకి పాజిటీవ్ గా మార్చేసుకుంటున్నాడు. కమల్ హాసన్ సినిమాలు ఎంత అద్భుతంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలో పెద్దగా స్టోరీ లేకున్నా.. తన అభినయంతో అభిమానులను మెప్పిస్తారు. ఆయన పర్ఫార్మెన్స్ ఆ రేంజ్ లో ఉంటుందన్న మాట. ఒక్క సినిమాల్లోనే కాదు.. ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ పర్ఫార్మెన్స్ లోనూ తనకు ఎవరూ సాటిలేరని నిరూపించుకుంటున్నాడు.

ఈ నెలాఖరు లోగా కమల్ హాసన్ కొత్త పార్టీ పెడతారంటూ ప్రచారం జోరుగా నడుస్తోంది. మొదట్లో డీఎంకేలోకి వెళ్తారని ప్రచారం జరిగినా.. దానికి సంబంధించిన యాక్టివిటీస్ ఏం కనిపించడం లేదు. కానీ కమల్ హాసన్ మాత్రం చాలా యాక్టీవ్ అయ్యారు. అధికారపార్టీపై విమర్శలు పెంచారు. ప్రజలను పట్టించుకోకుండా పదవుల కోసం తమిళనాడులో నడుస్తున్న రాజకీయాల మీద ట్విట్టర్ వేదిక సీరియస్ అయ్యాడు. నో వర్క్ నో పే అంటూ అప్పట్లో టీచర్లను హెచ్చరించినట్టుగానే.. ఇప్పుడు పని చేయకుండా  రిసార్టుల్లో ఎమ్మెల్యేలను హెచ్చరించాలన్నాడు.

అయితే.. కమల్ హాసన్ సర్కారును తిట్టాడా..? లేక దినకరన్ చేస్తున్న రాజకీయాలపై ఫైర్ అయ్యాడా..? అనేది తేల్చుకోలేకపోతున్నారు తమిళ లీడర్లు. డీఎంకేలో చేరుతారంటూ అప్పట్లో ప్రచారం జరిగినట్టుగానే.. ఇప్పుడు పళని, పన్నీర్ ల పక్షం వహిస్తున్నాడా..? అనే ఆలోచనలో పడ్డారట లీడర్లు. దినకరన్  ను సైడ్ చేస్తే తనకు పొలిటికల్ గా ఇబ్బందులు ఉండవనే ఆలోచనలో కమల్ హాసన్ ఉన్నాడనేది మరో టాక్.

ఇక.. ఇవన్నింటికి మించిన మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఆల్రెడీ పార్టీ పెట్టేందుకు కమల్ హాసన్ ఫిక్స్ అయిపోయాడని.. పార్టీ ముసాయిదా తయారుచేసే పనిలో బిజీగా ఉన్నాడని.. మరికొద్దిరోజుల్లో రాబోతున్న లోకల్ బాడీ ఎలక్షన్లే టార్గెట్ గా ముందుకుపోతున్నాడని..! అయితే.. కొత్త పార్టీ పెడతారనే విషయం తప్ప.. మిగతా ఏ ఒక్క విషయంపై కూడా కమల్ అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వకపోవడం కొసమెరుపు.