అర్జున్ రెడ్డిలో శ్రీదేవి కూతురిని నటించకుండా అడ్డుకుంది అతనా?

510

తెలుగులో వంగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, షాలినీ పాండే హీరోహీరోయిన్లుగా వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సూపర్ హిట్ గా నిలిచింది. గతేడాది విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లు కొల్లగొట్టి రాత్రికి రాత్రే దర్శకుడు వంగా సందీప్ రెడ్డిని, హీరో విజయ్ దేవరకొండను స్టార్ డైరెక్టర్, స్టార్ హీరోలుగా మార్చింది. దర్శకుడిగా వంగా సందీప్ రెడ్డికి, హీరోయిన్ శాలినికి ఇదే మొదటి చిత్రం కావడం గమనార్హం.

ఇంతటి ఘనవిజయం సాధించిన ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. తెలుగు వర్షన్ కు దర్శకత్వం వహించిన వంగా సందీప్ రెడ్డే హిందీ వర్షన్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, అర్జున్ రెడ్డి అంటే.. విజయ్ దేవరకొండ పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. ఇక కీలకమైన హీరోయిన్ పాత్రకు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ను తీసుకోవాలని చిత్ర నిర్మాతలు భావించారు.

అయితే సినిమాల్లోకి ప్రవేశించిన మొదట్లోనే ఘాటు రొమాన్స్, శృంగార దృశ్యాలు ఉన్న ఇలాంటి సినిమాల్లో నటించడం మంచిది కాదని, బోల్డ్ యాక్టర్ ముద్ర పడుతుందని ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్.. జాన్వీకి సూచించినట్టు సమాచారం. జాన్వీ కపూర్ కి సినిమాల పరంగా మెంటార్ గా కూడా వ్యవహరిస్తున్న కరణ్ జో్హార్ ఆమెను అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ లో నటించకుండా అడ్డుకున్నాడు. దీంతో కరణ్ జోహార్ చెప్పింది వాస్తవమేనని నిశ్చయించుకున్న జాన్వీ హిందీ అర్జున్ రెడ్డిలో నటించడానికి ఆస్తకి చూపలేదంట.