చిరంజీవి చెప్పింది చేసి నష్టపోయానంటున్నఆ నటి ఎవరంటే..

856

తెలుగులో ఎన్నో చిత్రాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ యాక్టర్ గా నటించి సహజ నటిగా పేరుతెచ్చుకున్నారు.. జయసుధ. టాలీవుడ్ లో అగ్రనటులు యన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, చిరంజీవి, మోహన్ బాబు, మురళీ మోహన్, చంద్రమోహన్ తదితర హీరోల పక్కన హీరోయిన్ గా నటించిన జయసుధ అసభ్యతకు తావులేకుండా చక్కటి చీరకట్టులో ప్రేక్షకులను అలరించింది.

నితిన్ కపూర్ ను పెళ్లిచేసుకున్న జయసుధ కొన్ని సినిమాలను కూడా సొంతంగా నిర్మించారు. వీటిలో కొన్ని లాభాలు తెచ్చిపెట్టగా మరికొన్ని తీవ్ర నష్టాలపాలు చేశాయి. తాజాగా ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన జయసుధ నాటి సంగతులను పంచుకున్నారు. తను నిర్మించిన చిత్రాల్లో శివనాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాండ్సప్’ చిత్రం తనను తీవ్ర నష్టాలపాలు చేసిందని వివరించారు.

జయసుధ నిర్మించిన హ్యాండ్సప్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్రలో నటించారు. దీంతో పోస్టర్లపైన చిరంజీవి ఫొటో వేద్దామని జయసుధ భావించారట. అయితే చిరంజీవి మాత్రం పోస్టర్లపైన తన ఫొటో వద్దని, ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఉండాలని, సినిమాకు వచ్చినవారు తనను చూసి సర్ ప్రైజ్ అవుతారని చెప్పడంతో పోస్టర్లపై చిరంజీవి ఫొటో వేయలేదట. అయితే సినిమాలో విషయం లేకపోవడంతో అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. దీంతో నిర్మాతగా జయసుధకు భారీ నష్టాలు వచ్చాయట. ఇలా కాకుండా చిరంజీవి ఫొటో వేసి ఉంటే ఈ సినిమాలో చిరంజీవి ఉన్నాడని ఎక్కువమంది చూసేవారని నష్టాలు లేకుండా ఉండేవని నాటి సంఘటనను వివరించింది.. జయసుధ. ఇవేకాకుండా తాను నిర్మించిన మరికొన్ని చిత్రాలు కూడా నష్టాలు చవిచూడటంలో ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందట.