జ్యుయెలరీ కంపెనీకే టోకరా వేసిన నటి ఎవరో తెలుసా?

430

జ్యుయెలరీ కంపెనీకి టోకరా వేసిన నటి ఉదంతం వెలుగులోకొచ్చింది. హిందీ బిగ్ బాస్-11లో పాల్గొన్న హీనా ఖాన్ ఈ మేరకు ఒక జ్యుయెలరీ కంపెనీని మోసం చేసినట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఒక ఫంక్షన్ లో పాల్గొనడానికి ఒక ప్రముఖ జ్యుయెలరీ సంస్థకు చెందిన సుమారు రూ.11 లక్షల విలువైన ఆభరణాలను ఈ భామ ధరించింది. కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్లీ తిరిగి ఇవ్వకపోవడంతో జ్యుయెలరీ కంపెనీ ఆమెకు లీగల్ నోటీసులు జారీ చేసింది.

ఈ విషయమై హీనా ఖాన్ ను ప్రశ్నించగా.. లీగల్ నోటీసులు తనకైతే రాలేదని.. బహుశా అవి మీడియా సంస్థలకు వెళ్లి ఉంటాయని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. తనంటే గిట్టనివారు తన పేరు చెడగొట్టే పనులు చేస్తున్నారని, అయితే ఇలాంటివి కాకుండా కొత్తగా ఏవైనా ప్రయత్నించాలంటూ సోషల్ మీడియాలో పేర్కొంది. సంబంధిత జ్యుయెలర్ కంపెనీ అధినేత మాత్రం హీనా ఖాన్ ఆభరణాలు తిరిగి ఇవ్వలేని పక్షంలో వాటి విలువ రూ.11 లక్షల రూపాయలను తిరిగి చెల్లించాలని, తనను మానసికంగా క్షోభపెట్టినందుకు, తమ జ్యుయెలరీ బ్రాండ్ కు నష్టం కలిగించినందుకు అదనంగా మరో రెండు లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు.

ఇదిలా ఉండగా హీనా ఖాన్‌ మ్యూజిక్‌ వీడియో ‘భసూది’ యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. యూట్యూబ్‌లో విడుదలైన ఈ మ్యూజిక్‌ వీడియోను ఇప్పటికే 10 మిలియన్ల మంది వీక్షించారు. దీంతో ఈ అమ్మడు తన సంతోషం వ్యక్తం చేస్తూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.