జైళ్లో గుర్రం గుర్మీత్‌: 24 గంటలు.. అదే లోకమట

1011

సన్యాసులు, బాబాలంటే.. ఇహలోక సుఖాలన్నీ త్యజించిన వారు. ముఖ్యంగా స్వార్థం, కామం, ఆవేశం ఉండనే ఉండవు కదా..! శాంతికి, సహనానికి మారుపేరుగా ఉన్నవారే.. సన్యాసం స్వీకరిస్తారనే విన్నాం కదా. ఒకవేళ అంతకు ముందు అలాంటి అలవాట్లున్నా.. సన్యాసం పుచ్చుకున్నాక శాస్త్రాల ప్రకరాం అన్నింటిని అణచుకోవాల్సిందే. అయితే.. ఇదంతా ఇప్పుడెందుకని డౌట్‌ రావటం సహజం. ఇప్పుడు దేశంలో స్వామిజీ పేరు వినబడిందంటే.. అవున అది డేరా బాబా గురించేనని అందరికీ అర్థమై పోతుంది. ఇప్పుడీ అసభ్యపు, విశృంఖల నిజం కూడా గుర్మీత్‌ రాం రహీమ్‌ సింగ్‌ గురించే…!

ఆరోగ్యానికి.. హానికరమని చట్టబద్ధమైన హెచ్చరిక చేసినా సరే… కొందరికి కొన్ని అలవాట్లుంటాయి. సిగరెట్‌ తాగడం, పాన్‌ మసాలాు నమలడం.. మద్యం తాగడం.. డ్రగ్స్‌ తీసుకోవడం. అవి ఇన్‌ టైంలో తీసుకోకపోతే.. నరాలు లాగేస్తుంటాయి. తల గిరికీలు కొడుతుంటుంది. మనసు మాట వినదు.. ఒక్కోసారి శరీరమే అదుపు తప్పుతుంది.. ఏదోదే అవుట్‌ ఆఫ్‌ కంట్రోల్‌ కండిషన్‌లా ఉంటుంది.

కోట్లాది మంది భక్తుల దైవం గుర్మీత్‌ బాబా కూడా అలాంటి పాడు అలవాటుకే బానిసై పోయాడట. అదేంటో చెబితే అసభ్యమే ధ్వనిస్తుంది. కొందరైతే చెవులు మూసుకుంటారు. కొందరు ముక్కున వేలేసుకుంటారు. కొందరైతే ఛీ పాడు అంటూ తల దించుకుంటారు. అవును మీరు ఎక్స్‌పెక్ట్‌ చేసింది నిజమే. డేరా బాబా సెక్స్‌కు బానిసైపోయాడట. స్వయంగా నలుగురైదుగురు డాక్టర్లు, ఓ సైకాలజిస్టు.. బాబాకు వైద్య పరీక్షలు చేసి తేల్చిన వాస్తవమిది. జైలుకు వెళ్లినప్పటి నుంచి బాబా ఆరోగ్యం అస్సలు బాగా లేదట. అదోరకంగా ప్రవర్తిస్తున్నాడట. బాడీకి మసాజ్‌ కావాలి. నా దత్త పుత్రిక హనీని జైలుకు పంపించండి. నాతో పాటు ఉండేలా ఏర్పాట్లు చేయండి… అని రకరకాల కోరికలు కోరుతున్నాడట.

డేరా బాబా వైఖరితో బిత్తరపోయిన జైలు అధికారులు.. డాక్టర్లను పిలిపించి పరీక్షలు చేయిస్తే అసలు నిజం బయటపడిందట. గుర్మీత్‌ బాబా సెక్స్‌ ఎడిక్ట్‌. అంటే సెక్స్‌కు బానిస అయ్యాడని.. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడని తేల్చి చెప్పారట. అడిక్షన్‌ ఏ రేంజ్‌లో ఉందంటే.. వెంటనే ట్రీట్‌మెంట్‌ అందించకపోతే ఆయన ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుందని చెప్పారట. అంతేకాదు.. గుర్మీత్‌ బాబా సెక్స్‌ ఎడిక్షన్‌ గురించి చాలా విషయాలను వెల్లడించారట. బాబా చాలా కాలంగా డ్రగ్స్, ఎనర్జీ డ్రింక్స్, లైంగిక పటుత్వాన్ని పెంచే టానిక్‌ లు విపరీతంగా తీసుకుంటున్నారట. అవి మామూలువి కూడా కాదట. తన రేంజ్‌కు తగ్గట్లుగా ప్రత్యేకంగా ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్‌ చేసుకున్నారట. వీటి కారణంగానే మితిమీరిన కోరికలు, విచ్చలవిడి విశృంఖల చేష్ఠలతో రగిలిపోయే వాడట. అందుకే తన కోరికలను తీర్చేందుకు ఆశ్రమంలోనే ఉన్న సాధ్విలను భయపెట్టి బెదిరించి లోబరుచుకొని శృంగారం చేసేవాడట. ఇప్పుడు అన్నింటికీ దూరమైన డేరా బాబా జైళ్లో అస్సలు తట్టుకోలేకపోతున్నారట. పగలు రాత్రి తేడా లేకుండా.. కామవాంఛతో తల్లడిల్లుతున్నాడట.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. లైంగిక వేధింపుల కేసు కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు.. తాను నపుంసకుడినని.. ఎవరిపై అత్యాచారం చేయలేదని.. అసలు అలాంటి మ్యాటరే తన దగ్గర లేదని బాబా, తన తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కానీ.. గుర్మీత్‌ బాబాకు అప్పటికే ఓ కొడుకు ఉండటంతో కోర్టులో అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు డాక్టర్లు చేసిన పరీక్షల్లో అంతకు మించిన శృంగార గుట్టు బయటపడటంతో సాములోరు… చేతులు పిసుక్కుంటున్నారట…!
(క్రెడిట్‌ సోర్స్‌: ఇండియా టుడే అందించిన ఈ కథనం..)