ఏనుగులే గుంపులు గుంపులుగా వస్తాయ్.. మీరు సింగిల్ గా చూసేయండి..!

366

బర్రెలు..గొర్రెలు.. మేకలు.. పందులు.. గుంఫులు గుంపులుగా మందకు మంద.. రోడ్లపై చూడటం మనకు కొత్తేమీ కాదు. కానీ ఏనుగులే గుంపుగా మన ముందుకు వస్తే.. చూసి తీరాల్సిందే.

ఐకమత్యానికి ఏనుగులు ప్రతీకలు. కలిసి జీవించడంలో.. కలిసి ప్రయాణం చేయడంలో ఏనుగులు మిగిలిన జంతువులన్నింటి కంటే ముందుంటాయి. శత్రువుని కలిసికట్టుగా ఎదుర్కోవడంలోనూ వీటి తర్వాతే మిగిలిన జంతువులు. అస్సాం, పశ్చిమ బెంగాల్, కర్ణాటక లో ఏనుగుల సంచారం ఎక్కువ. చుట్టు పక్కల అడవులున్న రోడ్ల మీద ప్రయాణం చేస్తుంటే రోడ్ల మీదకు ఏనుగులు రావడం అక్కడ సర్వ సాధారణం. అటవీ గ్రామాల మధ్యలో పొలాల గట్ల మీదుగా ఏనుగులు గుంపులు గుంపులుగా కలిసి వెళుతాయి. కానీ.. అక్కడి ప్రజలు నోరేళ్ళబెట్టేలా ఇటీవల ఒకే సారి ఏనుగుల గుంపు ప్రయాణించింది. గజ సైన్యాన్ని తలపించేలా ఒకటి వెంట ఒకటిగా  ఏనుగులు కవాతు చేసినట్లు బయల్దేరాయి. పొలం గట్ల వెంబడి ఈ మంద వెళ్తుండటాన్ని కెమెరాలో బంధించారు. ఇప్పుడా వీడియో నెట్టింట్లో వైరల్. మీరూ చూసేయండి.