పచ్చి ఉల్లిపాయలతో ఆరోగ్యానికి జరిగే మేలు ఎంతో తెలుసా?

809

నేటి రోజుల్లో అనేక మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. శారీరక వ్యాయామం లేకపోవడం, ఒత్తిడితో కూడిన దైనందిన జీవితం, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, రాత్రిళ్లు నిద్రపోకుండా ఎక్కువసేపు మెలకువగా ఉండటం షుగర్ వ్యాధికి కారణమవుతోందని వైద్య నిపుణులు అంటున్నారు. ఒక్కసారి షుగర్ వ్యాధి వస్తే దాన్ని నియంత్రణలో పెట్టుకోవడమే తప్ప పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదు. వయసుతో సంబంధం లేకుండా షుగర్ వ్యాధి బారినపడి యువత తమ లైంగిక పటుత్వాన్ని కూడా కోల్పోతోంది. ఈ నేపథ్యంలో షుగర్ వ్యాధిగ్రస్తులకు పచ్చి ఉల్లి పాయ చేసే మేలు అంతా ఇంతా కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

షుగర్ వ్యాధిని అదుపులో పెట్టాలంటే.. రోజూ 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయను కచ్చితంగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. 50 గ్రాములు ఒకేసారి తినలేకపోతే ఉదయం కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా, సాయంత్రం కొద్దిగా తినాలని అంటున్నారు. సాధారణంగా షుగర్ వ్యాధి ఉన్నవారు ప్రతి రోజూ ఇన్సులిన్ తీసుకుంటుంటారు. ఇన్సులిన్ కు బదులుగా 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయను రోజూ తినడం వల్ల మంచి ఫలితం ఉంటుందని వైద్య అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్ లకు సమానమని చెబుతున్నాయి.

ఏడు రోజులు క్రమం తప్పకుండా ఈ పచ్చి ఉల్లిపాయను బాగా తినడం వల్ల షుగర్ వ్యాధిని అదుపులో పెట్టొచ్చని వైద్యులు అంటున్నారు. పచ్చి ఉల్లిపాయను తినలేనివారు పచ్చి పులుసు చారు పెట్టుకుని అందులో పచ్చిపులుసును తీసుకున్న ఫలితం ఉంటుందని పేర్కొంటున్నారు. తెల్ల ఉల్లిపాయలతో టైప్-2 డయాబెటీస్ ను నియంత్రించవచ్చని చెబుతున్నారు.