తెలంగాణలో పర్యాటకానికి డిజిటల్ శోభ!

1681
  • సందర్శకుల్ని ఆకర్షించేలా ప్రచానికి నిర్ణయం

  • మొబైల్ డిజిటల్ స్క్రీన్‌లను వాడాలని యోచన

హైదరాబాద్: తెలంగాణలో పర్యాటకానికి డిజిటల్ శోభ పట్టనుంది. బయట ప్రాంతాల సందర్శకుల్ని ఆకర్షించేలా ప్రచానికి నిర్ణయం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని కోసం మొబైల్ డిజిటల్ స్క్రీన్‌లను వాడాలన్న ఆలోచనలో పర్యాటక మంత్రిత్వ శాఖ ఉంది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను, పర్యాటక ప్రదేశాలనూ ఇతర రాష్ట్రాలలో ప్రచారం చేయటానికి మొబైల్ డిజిటల్ స్క్రీన్‌లను వినియోగించనుంది. వీటి ద్వారా వినూత్న ప్రచార మాధ్యమానికి శ్రీకారం చుట్టినట్లవుతుంది.

ఈ విన్నూత్న కార్యక్రమాన్ని తెలంగాణ టూరిజం కార్యదర్శి బుర్ర వెంకటేశం శుక్రవారం సచివాలయంలో ప్రారంభించారు. భారతదేశంలో మెుట్టమెుదటి సారిగా ఇలాంటి డిజిటల్ మాథ్యమం ద్వారా ప్రచారాన్ని ప్రయోగాత్మకంగా తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోందన్నారు వెంకటేశం. దేశంలో కొత్తగా ఏర్పడ్డ  తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో చూడదగ్గ ప్రదేశాలు, వారసత్వ కట్టడాలు, చారిత్రాత్మక కోటలు, బతుకమ్మ, బోనాలు లాంటి సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయటానికి అధునాతనమైన మొబైల్ డిజిటల్  స్క్రీన్స్ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్లు బుర్ర వెంకటేశం వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో చూడదగ్గ ప్రదేశాలు, కోటలు, ప్యాలెస్‌లు, పర్యాటక ప్రదేశాలు, జలపాతాలు ఉన్నాయని, వాటికి తగినంత ప్రచారాన్ని కల్పించటం ద్వారా రాష్ట్రానికి పెద్ద ఏత్తున పర్యాటకులను ఆకర్షించవచ్చనీ ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా దేశంలో తొలిసారిగా హెలి టూరిజం, విమానానికి ప్రత్యేకంగా తెలంగాణ టూరిజం పేరుతో ఎయిర్ క్రాఫ్ట్ ర్యాఫింగ్‌తో పాటు డిజిటల్ స్క్రీన్ ద్వారా తెలంగాణ టూరిజాన్ని ప్రచారం చేయడం ద్వారా పెద్ద ఏత్తున పర్యాటకుల నుంచి మద్దతు లభిస్తుందన్నారు.