అమ్మకానికి టవర్లు…!

1257

విశ్లేషణ: ఎస్.వి.రావు

ఆశ్చర్య పోతున్నారా? మీరు చదివిందే నిజమే.  మధ్యనే అమ్మకానికి రహదారి సిద్ధం అనగానే విస్తుపోయాం.  ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే ఇప్పుడు అమ్మకానికి టవర్లు సిద్ధమవుతున్నాయి. అదేమిటి అనుకుంటున్నారా? సెల్ఫోన్లే కాదు, సెల్ఫోన్ కనెక్షన్లే కాదు టవర్లు కూడా ఇక కొనుక్కోవచ్చు. టెలికాం కంపెనీలు తమ సేవలను విస్తృతం చేసే చర్యల్లో భాగంగా మౌలిక వసతులలో ముఖ్యమైన టవర్లను వాడవాడలా ఏర్పాటు చేశాయి. ఇప్పుడు  టవర్లను విక్రయించి వేల కోట్లు సమీకరించుకోకపోతే టెలికాం కంపెనీలు ఆర్థిక సంక్షోభంతో కుప్పకూలే పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. దేశవ్యాప్తంగా కనీసం 2.60 లక్షల టవర్లు విక్రయించేందుకు టెలికాం సంస్థలు ప్రతిపాదనలను సిద్ధం చేసుకుంటున్నాయి. అప్పుల ఊబిలోంచి బయటపడేందుకు టవర్లువిక్రయం మినహా మరో మార్గం లేదని అంచనాకు వచ్చాయి. విచిత్రంగా ఉంది కదా.. ! 

మొన్న  మధ్య అమ్మకానికి రహదారి అంటూ యమునా ఎక్స్ప్రెస్ హైవేను విక్రయించేందుకు జేపి గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేయగా సింగపూర్కు చెందిన  సంస్థ కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే సుప్రీంకోర్టు అభ్యంతరం చెప్పటంతో  ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు.

టెలికాం సేవలు నగరాలుపట్టణాల నుంచి గ్రామాలకు విస్తరించాయిప్రభుత్వ రంగంలోని బిఎస్ఎన్ఎల్ పెట్టుబడి పెట్టలేక మౌళిక వసతులను పెంచుకోలేకపోవడం వల్ల దాదాపు ప్రైవేటు రంగానికి ద్వారాలు తెరిచారురెండు దశాబ్దాలు గడిచిపోయిందిసమాచార సాంకేతిక విప్లవం ప్రజల చేతుల్లోకి చేరటానికి టెలికాం రంగం ద్వారా ఇంటర్నెట్వాయిస్కాల్స్ విస్తృత స్థాయిలో ప్రజలకు అందుతున్నాయిఅదే సమయంలో టెలికాం సంస్థల వినియోగదారులపై ధరలు వడ్డిస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలోరిలయన్స్ జియో రంగంలోకి వచ్చాక పోటీ పెరిగి ప్రిపెయిడ్లో ధరలను అన్ని సంస్థలు తగ్గించినప్పటికీ పోస్ట్పెయిడ్ల వినియోగదారులపై భారం కొనసాగుతూనేఉంది. అయినప్పటికీ సంస్థలు నష్టాలు చవిచూస్తున్నాయి.

 పరిస్థితి నుంచి బయటపడి అప్పుల భారం తగ్గించుకునేందుకు టవర్లు అమ్ముకోవడమే పరిష్కారంగా టెలికాం సంస్థలునిర్ణయించుకున్నాయిదేశ వ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా టవర్లు ఉన్నాయి టవర్ల ద్వారానే సిగ్నలింగ్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుంది. వాయిస్కాల్స్ఇంటర్నెట్ పనిచేస్తాయిఇందులో 2.60 లక్షల టవర్లను విక్రయించడంద్వారా రూ.90 వేల కోట్లు సమీకరించుకోవాలనేది  సంస్థ ఆలోచన

టవర్ల నిర్వహణలో బిఎస్ఎన్ఎల్ 18.2 శాతంఇండస్ సంస్థ అత్యధికంగా 31శాతంరిలయన్స్ ఇన్ఫ్రా 11.6శాతంఏపిసి 3.5, టవర్ విజన్ 2.3, వయోం 11.3 ఇతరులు 4.3 శాతం టవర్లు కలిగి ఉన్నాయివినియోగదారులకు సేవలు అందిస్తున్న టెలికాం కంపెనీలే పూర్తిగా టవర్లను నిర్మించవు. వేరే సంస్థలు కూడా నిర్మిస్తాయి. వాటి సర్వీసులను టెలికాం సంస్థలు అద్దె ప్రతిపాదికపైన  వినియోగించుకుంటాయి. ఇప్పటికైతే అన్ని టెలికాం సంస్థలు నష్టాల్లోఉన్నాయి. ప్రతి టవర్ కనిష్ఠంగా రూ. 30 లక్షల నుంచి 70 లక్షల వరకు ఉంటుంది. ప్రధానంగా రిలయన్స్ సంస్థ 45 వేల కోట్ల అప్పు నుంచి బయట పడేందుకు తనకు సంబంధించిన టవర్లను విక్రయించాలని భావిస్తోంది. అదే విధంగా భారతి ఎయిర్టెల్ కూడా సిద్ధమవుతోంది.

ప్రైవేటు రంగంలో కెకెఆర్ కన్సర్టియంఅమెరికన్ టవర్ కార్పోరేషన్ (ఏటిసి), గ్లోబల్ ఎసెట్ మ్యానేజ్మెంట్ కంపెనీ గ్రూప్ ఫీల్డ్తదితర సంస్థలువీటిని కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

దేశంలో టెలికాం రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందిప్రధానంగా ఎయిర్టెల్బిఎస్ఎన్ఎల్ఐడియారిలయన్స్ తదితర టెలికాం కంపెనీలన్ని నష్టాల ఊబిలో కూరుకు పోయాయి.2013 నుంచి 2017 వరకు క్రమంగా నష్టాలు పెరుగుతూ వస్తున్నాయిఐడియా, ఎయిర్టెల్రిలయన్స్ నష్టాలను చవిచూస్తుండడంతో  పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రభుత్వం విధాన పరంగా ఆదుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఒత్తిడి పెరుగుతోందిఅదే సమయంలో నష్టాలను తగ్గించుకునేందుకు తొలుత ఉద్యోగులను తొలగించడానికి  సంస్థలు సిద్ధమయ్యాయిఇప్పటికే 30 వేల ఉద్యోగాలలో కోత విధించాలని ప్రధాన టెలికాం కంపెనీలు నిర్ణయానికి వచ్చేసాయి.  అన్లిస్టెడ్లో ఉన్న టాటా సర్వీసెస్ 4600 ఉద్యోగాలుఇతర సంస్థలు 22 వేల ఉద్యోగాలు కోత విధించాలని నిర్ణయించినట్లు దాదాపుగా ప్రకటించేశాయి వైపు టెలికాం సంస్థల ఆదాయం తగ్గిపోగా మరోవైపు నిర్వహణవ్యయంప్రభుత్వానికి చెల్లించాల్సిన స్ప్రెక్ట్రం తదితర ఫీజులు ఎక్కువ కావటంతో నష్టాలు చవిచూస్తున్నాయిటెలికాం రంగం  విధమైన పరిస్థితి ఎదుర్కొవటంపై కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి (టెలికాంఅరుణా సుందర్రాజన్‌ తరచూ సమీక్షలు నిర్వహిస్తూ ప్రత్యామ్నాయాలను ప్రతిపాదిస్తున్నారుదీర్ఘకాలికస్వల్పకాలిక ప్రతిపాదనలు తెరమీదకు వచ్చాయిప్రధానంగా స్ప్రెక్ట్రం ధర వల్లనే ఈ పరిస్థితి ఎదురయ్యిందనే వాదన కూడా ప్రచారంలో ఉంది.

స్థూలంగా చెప్పాలంటే దేశంలో ప్రభుత్వ రంగం విఫలమైమిశ్రమ ఆర్థిక వ్యవస్థ స్థానంలో ప్రైవేటు రంగానికి ద్వారాలు తెరిచారు. పి.వి.నరసింహారావు ప్రధానిగాఉన్నప్పుడు ఆర్థిక విధానాలను సరళీకరించడంతో పాటు విదేశీ పెట్టుబడులకుద్వారాలు తెరిచారుప్రైవేటు రంగం అప్పటినుంచి పుంజుకుందిప్రభుత్వ వనరులను ఉపయోగించుకుంటూ బ్యాంకునుంచి రుణాలు ఇతరత్రా వనరుల నుంచి నిధులు సమీకరించుకుంటూ ప్రైవేటు రంగం వ్యాపారాలను విస్తృతం చేసిందిఅయితే ఈ రంగం కూడా దాదాపు దివాళా అంచుకు చేరిందిదేశంలోని పెద్దపెద్ద వ్యాపార సంస్థలన్నీ నష్టాలు మూటగట్టుకున్నాయి.  ముఖ్యంగా బూట్పిపిపి పద్ధతిలో ప్రాజెక్ట్లు చేపట్టిన సంస్థలన్నీ క్రమంగా నష్టాలతో మూతపడుతున్నాయి వైపు కేసులు ఎన్సిఎల్టీకి చేరుతుండగా మరోవైపు కోర్టు గడప తొక్కుతున్నాయి మధ్య జరిగిన సహరా సంక్షోభం తెలిసిందిజిందాల్అదానిజేపి ఇలా చెప్పుకుంటు పోతే అనేక పెద్దసంస్థలు నష్టాలతో మునిగిపోయాయిఇప్పుడు  జాబితాలోకి టెలికాం సంస్థలు కూడాచేరిపోయాయి

అందుకే ఈ టవర్ల విక్రయం..!!