మహేష్ బాబు సీఎంగా భరత్ అనే నేను రెడీ

743

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’ ఏప్రిల్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. కైరా అడ్వాణీ కథానాయిక. కొరటాల శివ దర్శకుడు. మహేష్‌బాబు ఇందులో ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. సినిమా సెన్సార్‌ పూర్తి కాగా, యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.  ‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్‌-కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నిర్మాత డీవీవీ దానయ్య అందుకు తగినట్లుగానే పబ్లిసిటీకి భారీగా ఖర్చు చేస్తున్నారట. దాదాపు  రూ.3కోట్లు ఖర్చు చేస్తున్నారని ఫిలింనగర్‌ టాక్‌. ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లోనే 300లకు పైగా హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. గతంలో ఏ తెలుగు చిత్రానికి ఈ స్థాయిలో ప్రచారం జరగలేదు. మరోపక్క అమెరికాలోనూ ఈ సినిమా భారీ ఎత్తున విడుదలవుతోంది. 320కిపైగా లొకేషన్లలో సినిమాను ప్రదర్శించనున్నారట. 2000లకుపైగా స్క్రీన్లలో చిత్రం ప్రీమియర్‌ను నిర్వహించనున్నట్లు సమాచారం. తొలి వారాంతానికి మొత్తం 10 వేల షోలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  ‘బాహుబలి’ తర్వాత అమెరికాలో భారీ వసూళ్లు సాధించిన సినిమాల రికార్డును బద్దలు కొట్టడం ఖాయమనే అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు హిట్ కొట్టాయి. మీరూ చూడండి.